April 26, 2024

మాలికా పదచంద్రిక – 5 ఫలితాలు

మాలికా పదచంద్రిక – 5ను నింపిన వారు సౌమ్య ఆలమూరు, మాచర్ల హనుమంతరావు, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల, మానస చామర్తిగార్లు.

నిలువు 17ను కొందరు షడ్రకుడు అని నింపారు. కొన్ని ప్రాంతాలలో షడ్డకుడును షడ్రకుడు అనికూడా పిలుస్తారనే కొత్త విషయం తెలుసుకున్నాను 🙂 కాబట్టి షడ్రకుడు లేదా షడ్డకుడు రెండూ సరియైనవిగానే పరిగణించాము.

ఇక పొతే మాచర్ల హనుమంతరారావుగారు ఒక తప్పు(నిలువు 5)తోను, సుభద్ర వేదుల గారు రెండు తప్పుల(అడ్డం 3, నిలువు 5)తోనూ, మానస చామర్తి గారు ఒక తప్పుతోనూ (నిలువు 2) పూరించి పంపారు.

ఇక ఈ పదచంద్రిక విజేతలు సౌమ్య ఆలమూరు మరియు భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లు. ఇద్దరికీ అభినందనలు!

విజేతలు తమ చిరునామా లేదా బాంక్ అకౌంట్ నంబర్ మెయిల్ చేయగలరు. మీ బహుమతి పంపించబడుతుంది..
editor@maalika.org

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *