May 18, 2024

ఉపయుక్తమైన మొబైల్ టిప్స్ & ట్రిక్స్ – నల్లమోతు శ్రీధర్

ఇంటర్నెట్/అంతర్జాలం ఒక నిత్యావసర వస్తువైపోయింది. దీనిని  ఉపయోగించడానికి కంప్యూటర్, లాప్టాప్ మాత్రమే కావలసిన అవసరం లేదు. దాదాపు ప్రతీవారి చేతిలో ఉండే మొబైల్ ఫోన్ లో కూడా అంతర్జాలాన్ని చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్ ఎరా సంపాదకులు నల్లమోతు శ్రీధర్ గారు అందిస్తున్న అంతర్జాల సాయంతో మొబైల్ ద్వారా మనకు ఉపయోగపడే కొన్ని టిప్స్  ట్రిక్స్ వీడియోలు మీకోసం.

1. మీకు ఇష్టమైన ఫుడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా??

“wow.. ఏం టేస్ట్…” అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని మీరు ఎన్నాళ్లవుతోంది.. 🙂

నెట్‌లో వెరైటీ వంటలు ప్రయత్నించడం ఈ మధ్య ఎక్కువవుతోంది..వెజ్, నాన్-వెజ్ కోవలకు చెందిన భారీ మొత్తంలో వెరైటీ వంటకాల్ని నేరుగా ఫోన్‌లోనే తెలుసుకుని… ఫోన్‌ని దగ్గర పెట్టుకుని వంట చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది. మంచి ఐటెమ్ చేద్దామనుకుంటే, ఇంట్లో వాటికి కావలసిన వస్తువులు లేవా…. 🙂 అస్సలు దిగులు చెందకండి.. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయగల వెరైటీల్నీ ఈజీగా వెదికి పట్టుకోవచ్చు. కేవలం వెరైటీలే కాదు… వాటి ద్వారా ఎన్ని కేలరీలు ఎనర్జీ వస్తుందో కూడా ఇది చూపిస్తుంది… వెరైటీ ఫుడ్ తినేవారికీ, వెరైటీలు చేయడం చాలా ఇష్టం ఉన్న వారికీ ఉపయోగపడే వీడియో ఇది.

 

2. ప్రయాణాల్లో పోన్ చార్జింగ్:

 

ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోతోందా? ఇలా చేసుకోండి!

మనం వాడే ఫోన్లూ, టాబ్లెట్లూ చాలా ఖరీదైనవే గానీ… బయటకు వెళ్తే ఎక్కడ ఛార్జింగ్ అయిపోతుందో అని ఆచి తూచి వాడాల్సి వస్తుంటుంది…ఈ వీడియోలో  చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీ ఫోన్/టాబ్లెట్ ఛార్జింగ్ గురించి దిగులు చెందాల్సిన పనిలేదు.. మీ ఫోన్‌కి 2 నుండి 3 రెట్లు అదనంగా ఛార్జింగ్ పొందొచ్చు. ఎక్కువ బయట తిరిగే వారికీ, తరచూ ప్రయాణాలు చేసేవారికీ ఖచ్చితంగా ఈ వీడియో పనికొస్తుంది.

 

3. అలారం పెట్టుకున్నా నిద్ర లేవటంలేదా?

పెద్ద టైమ్‌కి నిద్ర లేచే వాళ్లలా… అలారమ్ పెట్టుకుంటాం 🙂

అది మోగగానే stop చేసి.. ఓ పావుగంటో, అరగంటో అటూ ఇటూ దొర్లాడి మొత్తానికి ఎలాగోలా నిద్రలేస్తాం..ఇప్పుడు అందరం ఫోన్లలోనే అలారమ్ సెట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఒక్కసారి ఫాలో అవండి…ఇక నిద్ర మత్తు ఉన్న ఫళంగా వదిలిపోతుంది… అలారమ్ ఆపడం అంత ఈజీ కాదు…నిద్రలేచి కాస్త మీరు సెట్ చేసుకున్న ప్రకారం ఓ ఐదారు అడుగులో, 10, 20 అడుగులో నడిస్తే గానీ అలారమ్ ఆగదు.. అప్పటివరకూ మోగుతూనే ఉంటుంది…మీరు పడుకుని నడుస్తున్నట్లు ఫోన్‌ని అటూ ఇటూ తిప్పినా పప్పులేం చెల్లవు… “మీరు నన్ను మోసం చేస్తున్నారు” అంటూ మెసేజ్ వస్తుంది ఫోన్ నుండి.. సో అలారమ్ ఆగాలంటే నిద్ర లేచి అలా ఓ నాలుగు అడుగులు వేయాల్సిందే… అలా చేస్తే నిద్రమత్తు పూర్తిగా ఎటూ వదిలిపోతుంది….మీరూ, మీ పిల్లలూ టైమ్‌కి నిద్రలేవకపోతే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి..

 

4. ట్రాఫిక్ జామ్ ఎక్కడయిందో ముందే తెలుసుకోండి ఇలా….

ఏ రోడ్‌లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో…

ఆఫీసులకూ, స్కూళ్లకూ, కాలేజీలకు ఎంత లేట్‌గా వెళ్లాల్సి వస్తుందో మనకు తెలిసిందే…మనం ఇంటి నుండి బయర్దేరాక ఏ రూట్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో ఎప్పటికప్పుడు ముందే తెలిసే అవకాశముంటే.. పెద్దగా ట్రాఫిక్ లేని వేరే రూట్‌లోనో, షార్ట్‌కట్‌లోనో వెళ్లిపోవచ్చు కదా…ఎప్పటికప్పుడు తాజాగా అలా వివిధ రూట్లలోని ట్రాఫిక్ ఎలా ఉందో లైవ్‌గా తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను…సో ఇలాంటివి ఫాలో అయితే కొంతవరకూ ట్రాఫిక్ బాధలు తప్పుతాయి….

 

5. ఫోన్ ద్వారా కరెంట్ బిల్లు గురించి తెలుసుకోవడం:

మీ రాబోయే కరెంట్ బిల్ ఎంత షాకిస్తుందో ముందే తెలుసుకోండి ఇలా…

మనకు కరెంట్ బిల్లు ఎంతొస్తుందో తెలీదు… బిల్ చూసి కాసేపు షాక్ అయ్యి… కరెంటోళ్లని ఓ ఐదు నిముషాలు తిట్టుకుని… పే చెయ్యడానికే అలవాటు పడిపోయాం…వివిధ స్లాబ్ సిస్టమ్‌ల కొద్దీ మనకు వస్తున్న బిల్లులు కరెక్టేనా…. అసలు ఎన్ని యూనిట్లు వాడుకుంటే మనకు ఎంత బిల్ వచ్చే అవకాశముంది, Fixed Charges ఎంత వంటి వివరాలు నేరుగా మీ మొబైల్‌లోనే కాలిక్యులేట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా? ఈ వీడియోలో  చూపిస్తున్న టెక్నిక్‌తో మీరు ప్రస్తుతం బాకీ ఉన్న కరెంట్ బిల్లు ఎంతో తెలుసుకోవచ్చు… వివిధ స్లాబుల లెక్కన ఎన్ని యూనిట్లకు ఎంత ఖర్చవుతుందో చిటికెలో తెలుసుకోవచ్చు. కరెంట్ ఉన్న ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది… అలాగే ఈ మధ్య అందరి దగ్గరా ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి…   సో ఈ వీడియో అందరికీ ఉపయోగంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *