May 2, 2024

Gausips – గర్భాశయపు సమస్యలు-1

రచన: డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ   పి.హెచ్.డి.   pic. for maalika

 

పాతికేళ్ళ కీర్తన క్రొత్తగా పెళ్ళి చేసుకుని భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. పెళ్ళైన నాలుగు నెలలకి విపరీతంగా బరువు పెరిగింది. దీనికంతటికీ కారణం పెళ్ళైన దగ్గిరనుండి ఇంట్లోనే ఉండి కూర్చుని తినడం, పెద్దగా అలసిపోయే పనులేవీ లేకపోవడం వల్లనే అనుకుని, రోజూ ఎక్స్ ర్సైజులకని బయలుదేరింది. ఈలోపున నెలసరి తప్పడంతో, తనకు గర్భం వచ్చిందని తలచి హాస్పిటల్ కు వెళ్ళింది. వాళ్ళ primary care physician, Dr. Steve ని consult చేసింది.  వాళ్ళు అక్కడ రకరకాల టెస్టులు  చేసి ఫైనల్ గా గర్భం కాదని తేల్చారు. కీర్తన అది విని కాస్త నిరాశపడింది. తన భర్తకి తెలిస్తే ఎంత నిరాశ పడతారో  ఊహించుకుని మరికొంచెం నీరాశపడింది.  Dr. Steve, అతని సిబ్బంది blood test చేసి ఈస్ట్రోజెన్, ప్రొజిస్టిరోన్ వగైరా గర్భానికి సంబంధించిన హార్మోనులను చెక్ చేసి, కొద్దిగా ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఎక్కవ ఉంది అని చెప్పారు. Dr. Steve కీర్తనని కొంచెం ఓదార్చి reproductive medicine లో specialization ఉన్న Physician cum Scientist Dr. గౌరి ప్రదాన్ కి refer చేసాడు. Indian అనగానే నీరసించిన కీర్తనకి కొండంత బలం వచ్చినట్లైంది.

డాక్టర్. గౌరి కీర్తనకు మరి కొన్ని టెస్టులు (ultra sound), స్కాన్లు (Magnetic Resonance Imaging, MRI) చేసి ఆమెకి గర్భాశయం లో గడ్డలు (Uterine Fibroids) ఉన్నాయని, వాటిని తొలగించవచ్చని దైర్యం చెప్పింది.  ఇది విన్నాక కీర్తనకు మతి కూడ పోయినట్లైంది.

uterine fibroids

సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు స్త్రీలలోబరువు పెరగడం, ఋతుస్రావం ఎక్కువ రోజులు ఉండడం, అధికంగా రక్తస్రావం జరగడం, మలబద్దకం, తరచు మూత్రానికి వెళ్ళడం, నడుంలో నొప్పి లాంటి symptoms ఉంటాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఎమిటంటే కీర్తనకు పెద్దగా ఎటువంటి symptoms లేకపొవడం బరువు పెరగడం తప్ప.  కీర్తన వెళ్ళిపోయాక  డాక్టర్. గౌరి ఆలోచనలో పడింది.

ఈ గర్భాశయ గడ్డలు వివిధ రకాలుగా ఉద్భవిస్త్తాయి. స్త్రీ యొక్క fertile period లో ఈస్ట్రోజెన్ (estrogen) ఉత్పత్తి అధికంగా ఉంటే గడ్డలు వస్తాయి, menopause తర్వాత తగ్గిపొతాయి.  నాడీ వ్యవస్థ (Vascular system) లో రక్తపు నాడులు, కణజాలాలు రక్తాన్ని, లింఫ్ ని శరీరమంతా ప్రసారం చేస్తాయి. కొన్ని సందర్భాలలో గర్భాశయపు నాడుల్లో అధిక రక్త ప్రసరణ జరిగి గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. రక్తప్రసరణ తగ్గిపోతే గడ్దలు కూడ మాయమవుతాయి. ఇటువంటి గడ్డలు cancer కి దారితీయవు. ఈ సహజ సిద్దమైన ప్రోసెస్ విక్రుత రూపం దాల్చి గడ్డలలో angiogenesis అంటే క్రొత్త blood vessels ఉత్పత్తి అవుతూ, రక్తప్రసరణ పెంచడం వల్ల tumors గా రూపాంతరం చెంది cancer కు దారితీస్తుంది. అటువంటి పరిస్థితి లో గర్భసంచిని తొలగించవలసివస్తుంది.

గడ్డలు గర్భాశయపు గోడలపైన వస్తే ఫర్వాలేదు కానీ గర్భాశయం లోపల (inner lining of uterus) ఏర్పడినప్పుడే చాలెంజింగ్. ఎందుకంటే స్త్రీకి వంధ్యత్వం (infertility) వచ్హే అవకాశం ఉంది. గడ్డలు ఫలదీకరణ చెందిన అండాన్ని (fertilized egg) గర్భాశయపు గోడకు attach కాకుండా అడ్డు పడడమో లేదా normal గా పెరిగాక, గర్భాశయం లోకి ప్రయాణించి దాంట్లో కూర్చుని (implantation) fetus గా మారకుండా ఆపుతాయి.  దానికారణం గా అబార్షన్లు అయిపోతాయి. కీర్తనకు గడ్డలు గర్భాశయం లోపల ఉన్నాయి. పైగా కీర్తన పిల్లల్ని కనే స్టేజు లో ఉంది. ఇదే డాక్టర్ గౌరి ని తీవ్ర ఆలోచనలో పడేసింది.

కీర్తన ఒక internet పురుగు. తనకు కావలసిన ప్రతి విషయాన్నిఇంటర్నెట్ లో చదివి, వివిధ కోణాల్లో ఆలోచించి అప్పుడు ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి నిర్ణయ ఫలితమే తన భర్త శైలేష్ కూడా. మరి ఈ విషయాన్ని అంత త్వరగా వదిలేస్తుందా?    తక్షణమే రకరకాల వెబ్ సైట్ల కి వెళ్ళి తన సమస్య గురించి మరిన్ని వివరాలు సేకరించుకుంది. అయితే తన సమస్య నయం చేయగలిగేది కాబట్టి కొంతవరకు దైర్యంగానే ఉంది. కానీ ఎక్కడో చిన్న బెరుకు లేకపోలేదు. గౌరికి ఫోన్ చేసి, తనకున్న గడ్డలు పొజిషన్ లో ఉన్నాయని అడిగింది. గౌరి స్కాన్ లో తాను కనుగొన్న విషయం  చెప్పేసింది. ఇంకా ఆ కాస్త బెరుకు ఎక్కువ అయి, తొండ కాస్త ఊసరవెల్లి అయి కూర్చుంది. తాను ఎక్కడ పిల్లల్ని కనలేకపోతుందో నని ఒకటే బెంగ.  అప్పుడు గుర్తొచ్చింది కీర్తనకు వాళ్ళ బామ్మ.

కీర్తనకు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న మరొక స్త్రీ తన జీవితంలో కి వస్తే కీర్తనను సరిగ్గా ఎక్కడ చూడదోనని, మరో పెళ్ళి మానుకున్నాడు. తనని పూర్తిగా బామ్మే పెంచి పెద్ద చేసింది. తనకే కష్తం వచ్చినా బామ్మకు చెప్పుకోవడమే అలవాటు. అయితే ఆ బామ్మగారు ఇప్పుడు  మనమరాలి క్రొత్త సంసారం ఎలా ఉందో చూడడానికి  visitor visa మీద అమెరికాకు వస్తున్నారు,.   బామ్మ గారు రానే వచ్చారు. కీర్తన మరియు శైలేష్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి బామ్మగారిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు.  కీర్తన తన ఇంటిని అద్దంలా మెరిసిపోయేలా పెట్టిందని బామ్మ తెగ పొగిడింది. మనసులో అదంతా తన పెంపకం అని మురిసిపోయింది. శైలేష్ ఎంతో కలుపుగోరు తనంతో బామ్మని ఆదరిస్తుంటే, కీర్తనకు మంచి సంబందం చేసానని గర్వపడింది కూడా. ఇలా బామ్మగారి అమెరికాయాత్రలో పది రోజులు గడిచిపోయాయి. కీర్తన ఇంకా తన మెడికల్ ప్రాబ్లమ్ గురించి బామ్మకి గాని, శైలేష్ కి గాని చెప్పలేదు.

ప్రొద్దునే బామ్మ తన పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని, హాల్ లోకి వచ్చారు. కీర్తన శైలేష్ ని ఆఫీస్ కి సాగనంపి ఇంట్లోకి వస్తున్నది. ఈ లోపున హాల్ లో ఫోన్ మ్రోగి మ్రోగి voice record message హాల్ అంతా ప్రతిధ్వనిస్తున్నది.

This call is from Jefferson Hospital for Keertana Vemuganti to confirm scheduled appointment tomorrow at 2.30 PM.

If you cannot keep this appointment please call us to reschedule it or cancel it…

కీర్తన కంగారు పడింది. ఈ లోపుల బామ్మగారు, తన మెట్రిక్యులేషన్ పరిజ్ఞానంతో, ఆ మెసెజ్ లో హాస్పిటల్, ఆపాయింట్మెంట్, టుమారో అని వినేసి విషయం అర్ధం చేసేసుకున్నారు. ఆవిడకు ఏదో అనుమానం తోచింది. అడిగితే కీర్తన ఏదో జనరల్ చెకప్ అని మాట దాటేసినా, తన ముఖంలో రంగులు చూసి, ‘కీర్తనా, నా దగ్గిరెందుకమ్మ దాస్తావు, ఏమిటో చెప్పు’  అని అనునయంగా అడిగేసరికి, కీర్తన ధుఃఖం ఆపుకోలేక పోయింది. ‘నీకు చెబితే ఎక్కడ బాధ పడతావో అని చెప్పలేదు బామ్మ’  అంటూ మొత్తం చెప్పేసింది.

బామ్మ ‘నువ్వు హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు, నీతోపాటు నన్ను కూడ తీసుకువెళ్ళవే, డాక్టర్ తో మాట్లాడాలి’ అంది.

నువ్వెందుకు బామ్మ, నీకు ఇంగ్లీషు రాదు కదా, ఏం మాట్లాడుతావ్?

నాకు రాకపోతే ఏం నీకు వచ్చుగా, నేను తెలుగు లో అడుగుతాను డాక్టర్ కి నువ్వు ఇంగ్లీషులో చెప్పు.

ఇంతకీ శైలేష్ కి చెప్పావా?

ఇంకా లేదు బామ్మ…. ఆయన ఉద్యోగం సేల్స్ మార్కెటింగ్ కదా, ఆఫీసు పన్లలో ఎప్పుడూ కాంప్ లే. ఇప్పుడు చెబుదామంటే మళ్ళీ వారం వరకు రారు. వచ్చాక చెబుదాం లే. బామ్మ అలా ఊరకుండిపోయింది.

డాక్టర్ను కలవడానికి ఇద్దరూ వెళ్ళారు. కీర్తన నర్సింగ్ స్టేషన్ దగ్గిర, తాను వచ్చినట్లుగా పేరు నమోదు చేసి, మెడికల్ ఇన్సూరెన్స కార్డ్ చూపించింది. అక్కడి మెడికల్ అసిస్టెంట్ అన్ని వివరాలు, తన కంప్యూటర్ సిస్టమ్ లోకి ఎక్కించుకుని వెళ్ళి కూర్చోమంది. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. ఒక అమెరికన్ నర్సు, వేముగంటి కీర్తన అనే పేరుని చిత్ర విచిత్రంగా పలుకుతూ కష్టపడి పిలిచింది. అది చూసి బామ్మ ఆశ్చర్యంతో ‘అదేవిటే వీళ్ళకి ఇంగ్లీషు రాదా, ఇంగ్లీషులో రాసినా నీ పేరు చదవలేక పోయింది?’. కీర్తన చిన్నగా  నవ్వి చెప్పింది, ‘వీళ్ళు మన పేర్లను స్పష్టం గా పలుకలేరు, మన పేర్లు వాళ్ళకి నోరు తిరగదు’. అయినా బామ్మ పెద్దగా కన్విన్స్ అయినట్లు లేదు. నర్స్ కేసి, ఆశ్చర్యంగా చూస్తూ, కీర్తన తో పాటు నర్స్ ని అనుసరించింది. నర్సు లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి వీళ్ళని రకరకాల ప్రశ్నలు వేసి కేష్ షీట్ లో వివరాలు రాసుకుని, డాక్టర్ గురించి వెయిట్ చెయ్యమని చెప్పి వెళ్ళిపోయింది. 30 నిముషాల తర్వాత డాక్టర్ గౌరి వచ్చారు. చక్కగా నవ్వుతూ బామ్మ కేసి, కీర్తనకేసి చూస్తూ కీర్తనను ఇంగ్లీషులో ఎదో అడిగింది. బామ్మకు అర్ధం కాలేదు. కీర్తనను చిన్నగా గోకి ఏమడుగుతుందని బామ్మ అడిగింది. ‘నీ గర్భాశయపు గడ్డల్ని ఎప్పుడు తొలగించమంటావ్, అపాయింట్మెంట్ తీసుకున్నావా? ‘ అని అడిగారని కీర్తన చెప్పింది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని డాక్టర్ గౌరి అడిగినప్పుడు  కీర్తన తనకు, బామ్మకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పింది. డాక్టర్ గౌరి, చిరునవ్వుతో అడగమని తల ఊపింది.

కీర్తన (ఇంగ్లీషులో): డాక్టర్, బామ్మకు ఇంగ్లీషు రాదు. ఆమెకున్న ప్రశ్నలు తెలుగు భాషలో అడుగుతారు, నేను అది మీకు ఇంగ్లీషులో చెప్తాను. మీరు ఇంగ్లీషులో నే సమాధానమివ్వండి. నేను బామ్మకి తిరిగి తెలుగు లో చెప్తాను. ఈ విధంగా మీ టైమ్ కొంచెం ఎక్కువ  తీసుకుంటామేమో, దానికి వెరీ వెరీ సారీ..

డాక్టర్: (నవ్వి, తెలుగులో) నేను పుట్టింది, కొంతవరకు పెరిగింది హైదరాబాద్ లోనె. తర్వాత అమ్మానాన్నలతో ఇక్కడకు వచ్చేసాను. నాకు తెలుగు వచ్చు. మీ బామ్మకు నేనే స్వయంగా తెలుగులో సమాధానాలు చెబుతాను.

బామ్మ ఒక్కసారిగా పొంగిపోయింది. ఇక ప్రశ్నల వర్షం కురిపించడానికి తయారైపోయింది.

బామ్మ (ఇంతలోనే బాధగా): కీర్తన ఇంతవరకు నెలతప్పలేదు, దానికి ఆమె గర్భాశయంలో పెరుగుతున్న గడ్డలే కారణమా డాక్టర్.

డాక్టర్: ఈ సమయంలో కీర్తన గర్భవతి కాకపొవడమే మంచిది. గర్భం వల్ల ఈస్ట్రోజెన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అది ఆమె గర్భాశయంలోని గడ్డల్ని ఇంకా పెద్దవి చేస్తుంది. కాబట్టి, వాటిని తొలగించుకున్నాకే  ప్రెగ్నన్సీ కి  ప్లాన్ చెయ్యడం మంచిది.

కీర్తన: డాక్టర్, నాకు గర్భాశయం లోపలి లైనింగు నుండి గడ్డలు రావడం వల్ల అసలు గర్భం వస్తుందా?

డాక్టర్: వస్తుంది. కాకపొతే అవి పెద్దగా పెరుగుతూ, గర్భసంచి ని ప్రక్కకు నెట్టే ప్రమాదం, గర్భం వచ్చ్హాక implantation లో interfere అయి అబార్షన్ అయిపోయే ప్రమాదం ఉంది.

కీర్తన: మరి దీనిని పూర్తిగా అరికట్టే అవకాశం ఉందా?

డాక్టర్: ఎందుకులేదూ, గర్భాశయపు లోపలి లైనింగును తీసేస్తాం. అలాగే గడ్డను దాని చుట్టూ ఉన్న endometrial tissue తో సహా తొలగిస్తాం. ఈ టిష్యూ మళ్లీ పెరుగుతుంది, ట్రీట్మెంట్ అయిపోయాక మీరు పిల్లల గురించి ప్లానింగ్ చెయ్యవచ్చు.

బామ్మ: (బాధ పడుతూ) వీటిని మందులతో కరిగించలేరా డాక్టర్?

డాక్టర్: సాధారణంగా వీటి సైజు మిల్లీ మీటర్ సైజు నుండి సెంటీమీటర్ సైజు వరకు ఉంటాయి. మిల్లీమీటర్ సైజులో ఉన్నప్పుడు మాత్రమే మందులతో కరిగించవచ్చు. కానీ కీర్తన విషయంలో ఇందాక చెప్పిన విధంగా తొలగించక తప్పదు. ఇందులో వర్రీ పడవలసిందేమి లేదు.

మీ కుటుంబంలో కీర్తనకేనా లేక ఇంకెవరికైనా ఇలా ఉందా?

బామ్మ: వాళ్ళ అమ్మకు ఉండేదని గుర్తు. ఆమె ఋతుస్రావ సమయంలో కడుపు నొప్పితో బాధ పడుతుండేది. కానీ కీర్తన కడుపులో ఉన్నప్పుడు కూడా ఆమెకి గడ్ద ఉండేది. తర్వాత ఎప్పుడో తీసేసారు.

కీర్తన:  అయితే ఇది వంశపారంపర్య లక్షణమా?

డాక్టర్: కుటుంబంలో  ఇలాటి లక్షణం ఉంటే వచ్చే  అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు సైంటిస్టుల పరిశోధనలలో,  జన్యుపరంగా ఈ డిఫెక్త్స్ వస్తున్నాయా అనేది తేలలేదు. అయితే angiogenesis వల్ల వచ్చే గడ్డల లో కొన్ని పెరుగుదల కారకాలు (growth factors) అసాధారణం గా పనిచేయడం వలన ఇది సంభవిస్తున్నదని మాత్రం కనుక్కున్నారు.

కీర్తన: ఈ పెరుగుదల కారకాలు శరీరం లో ఎక్కడ ఉంటాయి? అవి ఏవి?  కీర్తన ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకునే type కదా..

డాక్టర్: ఈ angiogenesis కారకాల పేర్లు fibroblast growth factor (FGF) మరియు vascular endothelial growth factor (VEGF).  శరీరలోపలి కుహురంలో సన్నటి లేయర్ గా ఉండే కణాల (endothelial cells) లో ఉంటాయి. ఇవి ఈ కణాల యొక్క మనుగడకు, ఆరోగ్యానికి అవసరం. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో blood vessels మీద పని చేసి, angiogenesis కు దారితీస్తుంది.

ప్రస్తుతం ఈ కారకాలతో ఇంటరాక్ట్ అయి, వాటిని బ్లాక్ చేసి angiogenesis ని ఆపగలిగే ముఖ్యమైన మాలుక్యూల్ ని పరిశోధనాల ద్వారా కనుక్కున్నారు. అది రక్తపళ్ళెరాల (blood platelets) లోఉండే ముఖ్య కీలకం platelet factor-4 (PF4). దీనిని therapeutic agent గా కారకాలకి target చేసి angiogenesis ని block చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది.

బామ్మ: ఈ గర్భాశయ గడ్డలు రాకుండా తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలు ఏమైన ఉన్నాయా?

డాక్టర్: మంచి ఆహారము, మానసిక వత్తిడి కి లోనవకుండా ఉండడం చాలా ముఖ్యం. ఆహారంలో చేపలు, సోయాబీన్స్ తీసుకోవడం చాలామంచిది. చేపలలో inflammation న్ని, బీన్స్ లో ఈస్ట్రోజెన్ ని తగ్గించే గుణముంది. మానసిక వత్తిడి వల్ల, ప్రొజిస్టిరోన్ హార్మోను తగ్గి, ఈస్ట్రోజెను పెరుగుతుంది. కాబట్టి  బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. పచ్చి కూరగాయలు, పళ్లని విరివిగా తీసుకోవాలి, వాటిల్లోని digestive enzymes, fibrin అనే blood clotting protein ని తగ్గిస్తుంది. బరువు పెరగకుండా  జాగ్రత్త పడాలి, ఎందుకంటే కొవ్వుశాతం ఎక్కువ అయినా కూడా ఈస్ట్రోజెన్ పెరుగుతుంది. కుటుంబ నియంత్రణ మాత్రలు కూడా  వాడరాదు. అవి ఈస్ట్రోజెన్ మీద పని చేస్తాయి.

డాక్టర్ గౌరికి  ధాంక్స్  చెప్పి ఇద్దరూ బయటపడ్డారు. కీర్తన తేలికపడ్డ మనసుతో గడ్డలు తొలగించుకోవడానికి అపాయింట్ తీసుకోవడానికి  తమకు వీలైన తేదీన వెతుక్కోవడం లో పడిపోయింది.

బామ్మగారు మాత్రం ‘మా కాలంలో ఈ జబ్బులన్నీ ఉన్నాయా? హాయిగా అన్నీ తిని గుండ్రాళ్ళలా ఉండేవాళ్ళం. ఈ కాలం పిల్లలు అందం అంటూ, ఏదో జీరో సైజు గురించి ప్రాకులాడుతూ, 2-మినిట్ మ్యాగీ నూడుల్స్ తిని బ్రతికేస్తూ ఇలా జబ్బుల పాలవుతున్నారు’ అని రుస రుస లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *