March 29, 2023

మాలిక పత్రిక డిసెంబర్ 2013 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక ఈ సంవత్సరంలో   డిసెంబర్ 2013 సంచికకు స్వాగతం. ఈ సంచికలో మీకు నచ్చే, మీరు మెచ్చే సీరియళ్లు, పుస్తక సమీక్షలు, కవితలు చోటు చేసుకున్నాయి. జనవరినుండి మరిన్ని కొత్త శీర్షికలు మిమ్మల్ని అలరించగలవు. మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org మాలిక పత్రిక ఈ  నెల సంచికలోని విశేషాలు: 0.  పుస్తకాల పండగ గురింఛిన సంపాదకీయం పుస్తకం హస్తభూషణం 1. బ్నింగారు రచించగా ఝాన్సీ గళంలో ఈ సారి పెళ్లానికి ప్రేమలేఖ గురించి […]

సంపాదకీయం : పుస్తకం హస్తభూషణం

  డిసెంబర్ నెల. అప్పుడే సంవత్సరం చివరాఖరుకు వచ్చేసింది. తెలుగువారి  పెద్ద పండగలన్నీ ఐపోయాయి. చలిగాలులు మొదలయి గిలిగింతలు పెడుతుంది. కాని చాలా మంది  ఈ నెలలోనే వచ్చే ఇంకో పండగ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.  పండగ కదా అని అందరూ జరుపుకోరు. సంతోషించరు. ఆ పండగలోని అంశాలు, విశేషాలంటే ప్రేమ ఉన్నవారు మాత్రమే ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ, రోజులు లెక్కపెడుతూ ఉంటారు. కొన్నేళ్ళుగా, దక్షిణభారత దేశంలోని అనేక నగరాల్లో శీతాకాలంలోనే  ఈ  పండగ జరుగుతోంది. ఇది […]

అనగనగా బ్నిం కధలు – 5 పెళ్ళానికి ప్రేమలేఖ

రచన: బ్నిం గళం ; ఝాన్సీ   అనగనగా బ్నిం కధలు… కథలో వినే కథ ‘పెళ్ళానికి ప్రేమలేఖ ‘చాలా మందికి నచ్చిన కథలలో ఒకటి- ఇందులో రెండు పాయింట్ల కలనేత కథని కనీళ్ళతో తడిపింది-‘ఝాన్సీ’ చదివారు. భర్త చనిపోయిన భార్యకి ముత్తయిదువు వేషం తీసేయడానికి ఆడంగులు పడే ఆరాటం..ఆ ఉబలాటం చూస్తే సంప్రదాయాన్ని సర్వనాశనం చెయ్యాలన్న కోపం-బాధా కలిగేది- ఇది వాస్తవ సంఘటన లోంచి కలిగిన వేదనే- ఇక రెండోది థేంక్స్ చెప్పడం, చేతకానితనానికి జాలి […]

అద్దం

రచన: పసుపులేటి గీత ఎవరు, ఎప్పుడు తగిలించారో గానీ మకిలి పట్టిన మా పడమటింటి గోడకు ఓ అద్దాన్ని అమ్మకంట్లో నీటిచుక్కలా అదెప్ప్పుడూ అలా గోడనంటి పెట్టుకుని వేలాడుతూనే వుంటుంది మసిబారిన దాని మీద ఏ అమ్మ బొమ్మయినా ముసురు పట్టిన మబ్బు తునకలా కనపడుతుంది. అమ్మ నుదుట కుంకుమ వెనుక దాగిన ముడతల్లా అద్దం వెనక అణగారిన ప్రతిబింబాలెన్నో! ఎన్ని ముఖాకృతులకు ఎన్ని ఎగదన్నే దుఃఖచిత్తరువులకు పౌడరు అద్దిందో కాటుక రేఖలు తీర్చిందో కుంకుమ దిద్దిందో […]

మదిర – మధుశాల

      రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు         నన్నయభట్టు వ్రాసిన ఆంధ్రమహాభారతములో శకుంతలోపాఖ్యానము చాల ప్రసిద్ధమైనది. దుష్యంతమహారాజు మృగయావినోదములో ఆసక్తుడై అడవిలో వేటాడి, తరువాత కణ్వాశ్రమమును సమీపిస్తాడు. అప్పుడు ఆ ఆశ్రమమును వర్ణిస్తూ నన్నయభట్టు వ్రాసిన రెండు పద్యములను క్రింద పరిచయము చేస్తున్నాను –   మానిని లేక మదిర  – భ/భ/భ/భ/భ/భ/భ/గ,  యతి [ 1, (7,) 13, (19) ] ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల – నిమ్మగు […]

మౌనరాగం … 2

రచన:  అంగులూరి అంజనీదేవి         సూర్యుడు దేదీప్య మానంగా వెలుగుతూ, తను చూడని అందం ఇంకెక్కడైనా దాగి వుందా? అని ప్రపంచంపై పరిశోధన చేస్తున్నాడు. కాలేజీలో క్లాసులు సీరియస్‌ గా నడుస్తున్నాయి. సీనియర్స్‌ అంతా కలసి ‘మేనేజ్‌మెంట్‌ మీట్‌’ డేట్‌ని డిక్లేర్‌ చేశారు.  అన్ని కాలేజీలకెళ్లి జూనియర్స్‌ని ఇన్‌వైట్‌ చేశారు. ఉదయం పదిగంటలకి మేనేజ్‌మెంట్‌ మొదలైంది. సీనియర్స్‌ చెప్పినట్లుగానే జూనియర్స్‌ ‘డ్రస్‌కోడ్‌’లో వచ్చారు. అభిరాం సీనియర్‌ కాబట్టి వర్క్‌ బిజీలో వున్నాడు. లక్ష్యాన్వేష్‌ […]

గజల్స్ – షకీల్ బదాయూనీ -2

రచన: అబ్దుల్ వాహెద్         షకీల్ బదాయూనీ రాసిన మరి కొన్ని గజల్స్ ఈ సంచికలో చూద్దాం ఈ గజల్ బేగం అక్తర్ స్వరంలో: 1. ఆయ్ ముహబ్బత్ తెరే అంజామ్ పే రోనా ఆయా జానె క్యోం ఆజ్ తెరే నామ్ పే రోనా ఆయా యుంతో హర్ షామ్ ఉమ్మీదోం పే గుజర్ జాతీ హై ఆజ్ కుఛ్ బాత్ హై జో షామ్ పే రోనా ఆయా కభీ […]

“తెలుగు వెలుగుల స్నేహం” – చారిత్రక సాహిత్య కథలు – 8

  రచన: మంథా భానుమతి “మిత్రమా!” మరునాడు తన శిష్యులకు బోధించవలసిన ఛందో లక్షణాలను ఒకసారి పరికించి చూసుకుంటున్న జినవల్లభునకు వినిపించలేదు. అతని ఏకాగ్రత అటువంటిది. అందుకే అతను చతుర కవిత్వ రచనలో సుప్రసిద్ధుడిగా పేరుపొందాడు. సత్పురుషులకు విద్య నేర్పడంలో అతనికున్న ఆసక్తి మెండు. అంతే కాదు.. ఏ పద్యమయినను రాగయుక్తంగా, శ్రావ్యంగా గానం చెయ్యడమేకాక అదే విధముగా శిష్యుల చేత కూడా పాడిస్తాడు. కొద్ది సేపు స్నేహితుని దీక్షను ప్రసన్నవదనంతో తిలకిస్తూ అలాగే ఉండిపోయాడు మల్లియ […]

అరిపిరాల ఊహల చిత్రం

సమీక్ష: అపర్ణ తోట అరిపిరాల సత్యప్రసాద్. అడపా దడపా చదివే కథల్లో రచయిత పేరు. దరిమిలా నా ఫేస్ బుక్ ఫ్రెండ్ గా కూడా మారారు. కథల పై చర్చలు, మొపాసా కథల అనువాదాలూ చూస్తే కాస్త సీరియస్ కథా రచయితే అనుకున్నా. క్రమంగా పాఠకుడిగా ఆయన పరిధి, రచనాధోరణులపై ఉండే వివేచనా ఇంకొంచెం ఆయన గురించి చెప్పాయి.కానీ నా దృష్టిలో కథా రచయితలు రెండు రకాలు.కథను కెరీర్ గా మార్చుకుని సంవత్సరానికిన్ని కథలని టార్గెట్లు పెట్టుకుని […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2013
M T W T F S S
« Nov   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031