May 5, 2024

అనగనగా బ్ని కథలు – 13 ( అమ్మమ్మ)

రచన: బ్నింbnim

చదివింది: ఝాన్సీ

అమ్మమ్మ కథ చదివి సజీవ పాత్రని చూపిన ఝాన్సీకి నమస్కరించకుండా ఈ కథ గురించి చెప్పలేను. నేను సృష్టించిన పాత్ర అయినా నేను నడిపిన కథ నేడు వింటుంటే, కథయినా అనేకసార్లు గుండె తడయ్యింది.

అమ్మమ్మ పేరు సీతామాలక్ష్మి.. ‘బుల్లెమ్మాయ్’ అంటారు సర్పవరంలో అందరూ. సర్పవరం భావనారాయణ స్వామి అంటే ఎంత ఆరాధిస్తారో బుల్లెమ్మాయ్‌ని కూడా.. అంత అభిమానిస్తారు. అందరూ అంత ఆత్మీయులు కావడానికి కారణం ఆమె ఎటాచ్మెంటా? కాదు అమ్మమ్మ డిటాచ్‌మెంట్. ఒక్కగానొక్క కూతురు పెళ్ళయాక రాకపోకలు ఆపేస్తే  మమకారం తెంచుకుంది. ఘనీభవించిన  ప్రేమానురాగాలతో కష్టపడి తనకు తానుగా కరిగించుకుని జీవనగోదావరిలా మారింది. అందుకే ‘సర్పవరం’లో పేదలకి ఆమె అమృతమయి అయింది. ఈ పాత్ర నాకు అత్యంత ప్రియంగా మార్చేసింది మాత్రం ఝాన్సీయే..

వినండి ప్లీజ్! నా గుండెబరువు.. బరువెక్కిన ఆనందం మీరూ పంచుకోవాలని నా కోరిక..

మీ బ్నిం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *