May 10, 2024

మాలిక పదచంద్రిక డిసెంబర్ 2014

కూర్పరి: డా.సత్యసాయి కొవ్వలి.satyasai

 

ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.

మొదటి  బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: 20th డిసెంబర్ 2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

padachandrika dec14

అడ్డం
1    నోట్లో ఊరేది
5    రక్తంపీల్చేవి
7    చిన్న పిల్ల
8    దేవదాసు తన ప్రేయసిని వెనక నుండి పిలిస్తే..
9    ఆరేసేముందు చేసేపని..అసమాపకంగా
10    పుట్ట వాసి
12    ఒక వేదం
14    షైరు కెళ్ళాలంటే ఇలా వెను తిరక్కూడదు
16    డబ్బు
17    సచిన్ ఒక్క రన్ను కూడా చేయకుండా ఔటయితే ఏపక్షి గుర్తొస్తుంది
18    సిరి రా అడ్డు పెట్టకూడనిది
19    నదికి వర్షాకాలంలో వచ్చేది
20    ఈప్రవేశవిద్య వస్తే వేరే శరీరాల్లో దూరచ్చుట
23    (ఇనప) పొడి
25    మొదలు లేని ఆమని
26    చంటి హీరోయిన్
27    దుఃఖానికి ఇది చేటు
28    చొక్కాలిప్పేసే హిందీ దబ్బాంగు ఖాన్
29    అవును, మీరు పూరిస్తున్నదే
32    సురభివారి కళాప్రక్రియ
34    వెనక్కితిప్పి చూడండి, మాడు అని తెలుస్తుంది.
35    వెదురు బుట్ట
36    తీరం

నిలువు
2    సైమన్ కి వ్యతిరేకోద్యమంలో కాల్పుల్లో మరణించిన స్వాతంత్ర్యసమరయోధుడు.. పేరులో మొగుడున్నవాడు -మొదటిరెండక్షరాలు 1 అడ్డం మొదట్లో వచ్చేసాయి
3    జలజలో నీరు
4    ఓడలని పార్కింగు చేయడానికి వాడేది
6     ప్రేమతో పెళ్ళాం మురి సిపోయి ఒలకపోసే పాలు. ముద్దు తోడివి
7    ఒకటిలో సగంలో సగం
11    త్వమేవాహం ..కూనలమ్మపదకర్త
12    వశిష్ఠుడు బ్రహ్మ- –
13    ఆలుమగలు
15    కవి వ్రాసిన గ్రంధం
17    ఊదే వాద్యం.  ఎవరి గొప్ప వాళ్ళు పాడుకోవడం
18    తమలపాకుల కట్ట
20    వివేకానందుడి గురువు? రామకృష్ణ – – – – –
21    రాత్రి.  ఒక ఆధునిక వాగ్గేయకారుడి పొట్టిపేరు
22    మానూ, మాకును – –
24    నాశనం
26    అనేక భజనలు వ్రాసిన కృష్ణభక్తురాలు.. విషంతాగినా బ్రతికిందట
29    బ్రహ్మనాయుడు, బాలచంద్రుడి ఏరియా
30    చంపకమ్మా.. ఇదో రకమైన పువ్వంతే
31    అబద్దం, కపటం
33    ఎటునుండి చదివినా ఒకేలా ఉండే కూరగాయ.  సూపుకి బాగుంటుంది
35    గాంధారి కళ్ళకి కట్టుకున్నది

1 thought on “మాలిక పదచంద్రిక డిసెంబర్ 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *