May 3, 2024

శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు .

ఇంటర్వ్యూ: విశాలి

TSR

“క్రోధములేని సాధువు, అకుంఠిత నైతికశీలశాలియున్,

ఆధునికాంధ్రవాజ్మయ మహార్ణవనౌక, కవిత్వమాధురీ

శీధుపిపాసి, మిత్రజనసింధు సరిద్వర పౌరమాసియున్,

సౌధములేని రాజునకు సాంద్ర నమస్సులు తంగిరాలకున్.. ”

అని గుంటూరు శేషేంద్రశర్మ గారు ప్రశంసించిన తంగిరాల సుబ్బారావు గారు ప్రసిద్ధ తెలుగు రచయిత, కర్నాటక రాజధాని బెంగళూరు విశ్వవిద్యాలయములో  వివిధ ఉన్నతమైన పదవులలో  పని చేసి రిటైర్ అయినారు.

1971 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  పి.వి. నరసింహరావు గారికి లేఖ వ్రాసి మూడు లక్షల రూపాయల గ్రాంటు సంపాదించి 1974 లో బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు స్నాతకోత్తర శాఖను స్థాపించారు.

శ్రీ తంగిరాలవారు నిరంతర సాహిత్యయాత్రికులు.

వారు వ్రాసిన గ్రంధాలు :

సృజనాత్మకాలు:

1.హంస పదిక (ప్రణయ కావ్యం)

2.వనదేవత (బుఱ్ఱ కథ)

3.గుండె పూచిన గులాబి.

పరిశోధనాత్మకాలు:

1.జానపద సాహిత్యము – వీరగాధలు,

2.కాటమరాజు కథలు,

3.తెలుగు వీరగాథా కవిత్వము,

4.అంకమ్మ కథలు,

5.శ్రీ కృష్ణకర్ణామృతము.

6. రేనాటి సూర్యచంద్రులు,

7.ఏఱిన ముత్యాలు.

ENGLISH:

1. Ranganatha Ramayanam, ‘nikumbhila yagam ‘ (along with others).

2. ‘Sumathi Satakam’ (poetry), (along with others).

 

కన్నడం లో:

1.వేమన – ఎరడు అద్యయనగళు,

2.విశ్వనాథ సత్యనారాయణ, హిమవద్ గోపాలస్వామి.

తంగిరాలవారిమీది అభిమానంతో , స్నేహభావంతో, గురు భావంతో  చాలామంది తమ రచనలను ఆయనకు అంకితం చేశారు .

 


వారు అంకితం పొందిన గ్రంధాలు :

1.వేయి పడగలు – నవలాశిల్పం (విమర్శ) డా.ముదిగొండ వీరభద్రయ్య

2.శ్రీ సీతారామరాజీయము (వీరమహాకావ్యము) – డా.మల్లేల గురవయ్య

3.నా గోదావరి (వచన కవితా సంపుటి) – డా. కావూరి పాపయ్యశాస్త్రి

4.ఫోక్స్ ఆర్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ కర్నాటక – ప్రొ. జి. ఎస్. మోహన్

5.మంచుముత్యాలు (కథల సంపుటి) – శ్రీమతి అంబిక అనంత్

6.పురుషోత్తముడు (వీరమహాకావ్యము) – శ్రీ చిట్టిప్రోలు కృష్ణమూర్తి

తంగిరాల వారు ఎన్నో గ్రంధాలకు పీఠికలు వ్రాశారు.

వారి సాహిత్య సేవకు, ప్రతిభకు  వారు పొందిన పురస్కారాలు :

*శ్రీ ఎన్.టి.రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా “ఉగాది పురస్కారము”

*శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారి చే “కవిత్రయ పురస్కారము”

*విజయవాడ సిద్ధార్థకళాపీఠం వారిచే “సాహిత్య పురస్కారము”

*డా. అవంత్స సోమసుందర్ సాహిత్య పురస్కారము. (పిఠాపురం)

*ద్రావిడ విశ్వవిద్యాలయం వారిచే సాహిత్య పురస్కారము. ( కుప్పం)

* అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారిచే “ఉగాది పురస్కారము”

* ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం వారిచే “తెలుగు భాషా పురస్కారము” (బెంగుళూరు)

*యోగి వేమన విశ్వవిద్యాలయం వారిచే “సి.పి. బ్రౌన్ పురస్కారము” (కడప)

* కీ.శే. దేవరకొండ బాలగంగధర తిలక్ స్మారక పురస్కారము (హైదరాబాద్)

* కీ.శే. పెద్దిబొట్ల బ్రహ్మయ్య స్మారక రసధుని సాహితీ పురస్కారం (పాలకొల్లు)

* తెలుగు విజ్ఞాన సమితి వారిచే శ్రీకృష్ణదేవరాయ కళాపురస్కారము

బిరుదులు : ” వీరగాథల సవరాల జిమ్మడు ” ( పల్నాటి యుద్ధంలో అలరాజు ఆధిరోహించే గుఱ్ఱం పేరు “సవరాల జిమ్మడు” .)

ఉద్యోగాలు :

1969-1978: ఆంధ్రోపన్యాసకుడు, బెంగుళూరు విశ్వవిద్యాలయం,బెంగుళూరు.

1978-1980: రీడరు మరియు తెలుగు అధ్యాయనశాఖ అధ్యక్షుడు,బెంగుళూరు . విశ్వవిద్యాలయం,బెంగుళూరు.

1980- 1983: మొట్టమొదటి పరీక్షా నియంత్రణాధికారి, గుల్బర్గా విశ్వవిద్యాలయం, గుల్బర్గ.

1983-1987: రీడరు, తెలుగు అధ్యయనశాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు.

1987-1994: ప్రొఫెసరు మరియు తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షుడు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు.

1994-1996: ప్రొఫెసరు, అధ్యయనశాఖ అధ్యక్షుడు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు.

1998-2000: ప్రొఫెసర్ ఎమెరిటస్ (యు.జి.సి), తెలుగు అధ్యాయనశాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు.

తంగిరాల వెంకట సుబ్బారావు గారు పది పన్నెండు డాక్టరేట్ పట్టాలకు సరిపడే  విషయ సేకరణ చేశారు. కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగారు. చేతివ్రేళ్లు అరిగేదాకా కలానికి పనిపెట్టారు. ఆ తరవాత వర్గీకరణకు పూనుకొని  కృతకృత్యులయ్యారు.  తదుపరి వివరణాత్మకమైన రచనలోనూ సాఫల్యం పొందారు.

ఆయన గురించి వివరాలు, విషయాలు, అనుభవాలు అన్నీ ఆయన ద్వారా తెలుసుకుందాము.

 

one more video..

 

కొన్ని చిత్రాలు:

IMG_20130101_183621IMG_20130101_183641IMG_20130101_183703???????????????????????????????

3 thoughts on “శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *