May 4, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2015 సంచికకు స్వాగతం

పాఠకులను అలరించడానికి , కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ కొత్త కొత్త రచనలకు అందిస్తున్న మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక విడుదలైంది.. ఈసారి  మరిన్ని విశేషమైన వ్యాసాలు మీకోసం అందిస్తున్నాము… వచ్చేనెల మాలిక పత్రిక ప్రత్యేక సంచికగా విడుదల అవుతోంది.. మరి ఈ నెల పత్రికలోని వ్యాసాలు, కథలు, కవితలు, పద్యాలు ఏమేమున్నాయో చూద్దాం.. 01. తంగిరాల వెంకట సుబ్బారావు (ఇంటర్వ్యూ) 02. పద్యమాలిక 5 03. పద్యమాలిక 4 04. పద్యమాలిక 3 05. RJ వంశీతో […]

శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు .

ఇంటర్వ్యూ: విశాలి “క్రోధములేని సాధువు, అకుంఠిత నైతికశీలశాలియున్, ఆధునికాంధ్రవాజ్మయ మహార్ణవనౌక, కవిత్వమాధురీ శీధుపిపాసి, మిత్రజనసింధు సరిద్వర పౌరమాసియున్, సౌధములేని రాజునకు సాంద్ర నమస్సులు తంగిరాలకున్.. ” అని గుంటూరు శేషేంద్రశర్మ గారు ప్రశంసించిన తంగిరాల సుబ్బారావు గారు ప్రసిద్ధ తెలుగు రచయిత, కర్నాటక రాజధాని బెంగళూరు విశ్వవిద్యాలయములో  వివిధ ఉన్నతమైన పదవులలో  పని చేసి రిటైర్ అయినారు. 1971 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  పి.వి. నరసింహరావు గారికి లేఖ వ్రాసి మూడు లక్షల రూపాయల గ్రాంటు […]

పద్యమాలిక – 4 (2)

  Venkata Subba Sahadevudu Gunda 1. పగలంత పిల్లలెల్లరు తెగవాడగ కంప్యుటర్ను ,తిమిరపు వేళన్ సెగబుట్టెడు మంట లెగయ బెగడెడు బామ్మ చలిఁ గాచె బిగుసుకు పోకన్!   2. అహమందు నుగ్రవాదుల దహనమ్ముల వార్త దూరదర్శని జూపన్! తుహినపు తాకిడి నోర్వక యుహుహూ యని వడకు బామ్మ యుడుకును గాచెన్!   3. త్రీడీ టీవీ యైనన్! బోడీ! సెగఁగాచునటుల పోజేలమ్మా! కూడును వండగ పదవే వేడిసెగల వంటశాల వెచ్చగ నుండున్! 4. టీవీ […]

పద్యమాలిక – 4

J K Mohana Rao   పండుగ నాఁడీ రోజవ, నెండఁగ నా కడుపు వచ్చె – నేకాదశియున్, దిండిని వదలిన బుణ్యము, దండిగఁ దిన గల్గు ముదము, – ధర్మ మ్మేమో?   మీ రథమును లాగంగా నీ రమణీకి బలము లేదు – యిది నిజము సుమా ధారిత్రియె వచ్చెఁ గదలి యౌరా యా విష్ణుమాయ – లతిశయము గదా!   రాతిరి వేసిన ముగ్గును రాతిరి వర్షమ్ము తుడువ – రథము మరుగయెన్ […]

పద్యమాలిక – 3

    VoletiSrinivasaBhanu   పాల సంద్రము మథియించు వేళయందు ఉద్భవించిన కలశాలు మూడు తెలియ ఒకటి మోహిని చేతిలో నొదిగె నాడు రెండు అమరావతినియేలె నిండు గాను   రసికరాజా యంచు రాగాలు పండించి గాన తత్త్వమెరుగు జ్ఞాని యొకడు మధువనమ్మున రాధ యెద పొంగి నర్తించు పాట నాలాపించు మేటి యొకడు శివశంకరీ యంచు అవలీల దర్బారి కానడ చిలికించు ఘనుడొకండు దునియా కె రఖ్వాలె వినుమయ్య నా బాధ అనుచు గీతంబైన యార్తి […]

RJ వంశీతో అనగా అనగా…. ఐఫోన్…

ఇప్పటి లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 6…. ఇంటావిడ లేటెస్ట్ అవునో కాదో మరి… మరి ఈ నెల కథలో RJ వంశీ ఇల్లాలికి, ఐఫోన్ కి గల అవినాభావ సంబంధం గురించి ఒక పసందైన కథ చెప్పబోతున్నారు అందమైన పాటలు జత చేర్చి… ఎలా అంటారా?? సింపుల్ క్రింద ఉన్న ఐపోన్ మీద మెల్లిగా తట్టండి.. అదేనండి క్లిక్ చేయండి..  

అక్షర సాక్ష్యం – 1

రచన: రంగనాధ్          1.   నేను :   అధికంగా వేషాలొస్తే సంతోషపడతాడు – నాలోని నటుడు… బ్యాంక్ పాస్ బుక్ నిండుతుందని! దీర్ఘ విరామం వస్తే ఆనందపడతాడు – నాలోని కవి… కవితలతో ఒక నోట్ బుక్ నిండుతుందని! ఆ ఇద్దరి వల్ల ఇబ్బంది పడుతుంటాడు – నాలోని క్రీడాకారుడు…. ఆడుకొనే అవకాశం దొరకదేమోనని! నటిస్తున్నా, రచిస్తున్నా, ఆడుకుంటున్నా సత్యాన్వేషణలో వుంటాడు – నాలోని వేదాంతి !   ‘ఇంతకూ […]

జై జై.. జై గణేశా..!

రచన: సమ్మెట ఉమాదేవి    ‘‘ఏం!!  రామ్‌ సింగ్‌ పదవుతుంది ఇంకా బ్రష్‌ నోట్లో పెట్టుకునే తిరుగుతున్నావా..? పంపు దగ్గరో, బావి దగ్గరో ముఖం కడుక్కోవాలి గాని ఇట్లా ఊరంతా తిరుగుతూ బ్రష్‌ చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను..’’  రజని కసిరింది. ఆ  గుడిసె ఆవరణలోనే .. పోయ్యిమీద అన్నం వండుతున్నది మాన్సిబాయ్‌.  ఒక పక్కనే మేకలు కట్టేసి వున్నాయి. మరో పక్క  నులక మంచం మీద కూర్చుని రామ్‌లాల్‌ చుట్ట తాగుతున్నాడు. మరో పక్కనే ఉన్న  గోడలు […]

నవలికలు – పరంపర, ఎటు? – సమీక్ష

సమీక్ష: సి.ఉమాదేవి నిద్రాణమైవున్న ఆత్మీయతానురాగాలను తట్టిలేపే పరంపర   పరంపర:  మాయమవుతున్నాడమ్మా మనిషన్నవాడు అని పలికిన కవి పలుకులు అక్షరసత్యాలు.మనిషి తన జీవితమంతా బ్రతుకు పరుగుకే అంకితంచేసి సంపాదన,పేరుప్రతిష్ఠలకే పాటుపడితే ఏమి సాధించాడో తనకే తెలియని అయోమయంలోకి  నెట్టపడతాడు. పరుగు ఆపి వెనక్కు చూసుకుంటే….ఏముంటుంది?ఏమీ ఉండదు.మనసేకాదు సర్వం శూన్యంగా గోచరిస్తుంది.ఆ శూన్యంలో దివిటీ పెట్టి వెదకినా,ఫ్లడ్ లైటు కాంతికైనా కానరాని మనిషితనాన్ని ఎక్కడ వెదకి పట్టుకోగలం?తన చుట్టు తానే గీసుకున్న వృత్తం ధనాన్ని,పేరు ప్రతిష్టలను పదిలంగా కాపాడవచ్చేమోకాని […]