May 4, 2024

పిడికెడు పక్షి – విశాలాకాశము – సమీక్ష

రచన: సి.ఉమాదేవి మమతల నగిషీలు,మానవతా మధురిమలు కలబోసిన కథావళి.             జగమెరిగిన రచయిత రామా చంద్రమౌళి.సాహితీ ప్రక్రియలన్నిటిలోను తనదైన శైలిలో చక్కని రచనలు చేసి పాఠకుల మనసును అలరింపచేస్తున్న రచయిత.18 నవలలు,5 కథా సంపుటాలు 9 కవితా సంకలనాలు,అనువాద కవితలు , నాటకాలకు  ఎన్నో సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 22వ వరల్డ్ కాంగ్రస్ ఆఫ్ పొయెట్స్-2011 గ్రీస్ లో భారత ప్రతినిధిగా పాల్గొనుట,సార్క్ సాహిత్య శిఖరాగ్రసభలు,2010,2011,2012లలో భారతప్రతినిధిగా పాల్గొనుట మాత్రమే కాదు,ఆటా తెలుగు అసోసియేషన్ లో గ్రంథావిష్కరణ […]

వసంతము

 రచన:జెజ్జాల కృష్ణ మోహనరావు     భారతదేశములో చాల చోట్లలో శీతాకాలము ముగుస్తుంది, కాని ఇక్కడ పశ్చిమ దేశాలలో జనవరి, ఫిబ్రవరి నెలలలో విపరీతమైన చలి. దానికి తోడుగా మంచు కూడ. కొన్ని వేళలలో రెండు లేక మూడు అడుగుల హిమరాశి నేలపైన కుప్పలుగా పడి ఉంటుంది. చుట్టు ఉండే చెట్లు కూడ ఆకులు లేకుండా వ్యాకులపాటుతో నగ్నముగా తపస్సు చేసే మునీశ్వరులవలె కనబడుతాయి. చెట్లు ఏప్రిలు నెలలో మొగ్గలు తొడుగుతాయి. అంతవఱకు ఎప్పుడు మళ్లీ దినాలు […]

“తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది”

రచన:ఆర్ అనంత పద్మనాభరావు      మేము ఎం ఏ. చదువుకునే రోజుల్లో మాకు తిమ్మావజ్జుల కోదండరామయ్య బాలవ్యాకరణ పాఠాలు చెప్పేవారు. ఆయన అన్ని పద్యాలు వల్లించగలరు. ఒకదానికి మరొకదానికి సమన్వయం చేసి,  ప్రౌఢవ్యాకరణంతో సమన్వయం చేసి బోర్డుమీద వ్రాసి మంత్రముగ్దుల్ని చేసేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని ఆ సూత్రం చెప్పమనేవారు. ఆయన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి శిష్యులు. కోదండరామయ్య మద్రాసు త్యాగరాయ కళాశాలలో పనిచేసి తిరుపతిలో ఖాళీ వచ్చినప్పుడు అక్కడ చేరారు. ఆ తర్వాత మధురై కామరాజ్ […]

మాయానగరం – 12

రచన: భువనచంద్ర     పరమశివుని మెళ్ళో ఉన్న పాము గరుత్మంతుని అడిగిందట ” గరుడా సౌఖ్యమా?”అని. అప్పుడు గరుత్మంతుడు నవ్వి “ఎక్కడ ఉండేవారు అక్కడ ఉంటేనే సౌఖ్యం! ” అన్నాడుట. ఇది నిజమో కాదో తెలియదు కానీ, తమిళ సినీ గీత రచయిత, వ్యక్తి  కీ.శే. కణ్ణదాసన్ గారు యీ సంభాషణని ఒక పాటగా తీర్చిదిద్దారు. శివుని మెడలో ఉన్నది గనక పాము అంత ధైర్యంగా గరుడుడిని అడగగలిగింది. అదే పాము శివుడి మెడలో లేకపోతే?? […]

మీ ఇంటికి వరండా వుందా??

రచన: టి.జ్ఞానప్రసూన మీ ఇంటికి వరండా వుందా? లేకపోతే ఒకటి కట్టించుకోండి.. అపరిచితులకి ఆశ్రయం ఇవ్వవచ్చు ఆత్మీయులకి ఆతిథ్యం ఇవ్వవచ్చు ఇంటికీ వాకిలికి మధ్యవర్తి వరండా నిజానికి ఇది ఇల్లు కాదు వాకిలి కాదు ఇది ఇల్లు వాకిలి రెండూ కూడా స్నేహితులతో వరండాలో కూర్చుని కాఫీయో, టీయో, బిస్కట్లతోనూ, కారప్పూసతోనూ కొంచెం కొంచెం చప్పరిస్తూంటే ఎన్ని భావాలు, ఎన్ని కబుర్లు వూరి, వూరిస్తాయో! అదే కొంచెం అందంగా వుంటే వరండా కప్పు అంచున చిన్ని నీలం […]

Gausips… Dead people Don’t speak !!!

 రచన: శ్రీసత్యగౌతమి  చచ్చిపోయినవాళ్లు మాట్లాడతారా??? ఏరన్..ఏరన్ ఫెర్నాండేజ్, జర్నలిస్ట్ !!!! తలుచుకుని అసంతృప్తి చెందుతుంటాడు, ఎందుకంటే ఏరన్ ఒక జర్నలిస్ట్ గా ఎన్నో మంచి విషయాల్ని సేకరించినా, మిస్టీరియస్ చాలెంజింగ్ విషయాల్ని సేకరించి తానొక డెటెక్టివ్ నారద అనిపించుకోలేకపోయినందుకు.  తాను ఎన్నో సంస్థల్లో పనిచేశాడు…..అయినా సరే… ఊహు.. అన్నవరంలో పుట్టినా మలేషియా వెళ్ళిపోయి..మలేషియా అనే చెప్పుకుంటాడు.. అయినా సరే.. అబ్బే.. ఆఖరికి తన పేరు వీర వెంకట సత్యనారాయణ (అన్నవరం కదా) రామ జోగయ్య (తాత గారి […]

వెటకారియా రొంబ కామెడియా 6 – సేల్ బాబోయి సేల్!!

రచన: మధు అద్దంకి “ఏమండీ” అని పిలిచింది సుందరి “ఊ” కొట్టాడు ఏదో పని చేసుకుంటున్న సుబ్బారావు. “ఏమండీ” ఈసారి కొద్దిగా గట్టిగా పిలిచింది సుందరి “ఊ” అంటూ కొద్దిగా గట్టిగానే ఊ కొట్టాడు సుబ్బారావు ఇంక లాభం లేదనుకుని భర్త దగ్గరికి వెళ్లి.. ” ఏమండోయ్” అని గావుకేక పెట్టి చళ్ళున వీపున చరిచింది సుందరి “అయ్యబాబోయ్” అంటూ ఒక గావుకేక పెట్టాడు సుబ్బారావు. మంటెక్కిన వీపు రుద్దుకోవడానికి నానా అవస్థ పడుతూ ” ఇప్పుడింత […]

ఆరాధ్య – 5

రచన: అంగులూరి అంజనీదేవి                     వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించి, తాళికట్టించి, తలంబ్రాలు పోయించాడు. ‘హమ్మయ్యా! ఒక పని అయిపోయింది’ అన్నట్లు తేలిగ్గా చూసి ”ఆడపడుచును పిలవండి! హారతి పట్టించాలి” అంటూ తొందరపెట్టాడు. ఆయనకు కడుపులో ఆకలి గంట చాలా గట్టిగా కొడుతోంది. అప్పటికే ఒక కమలాపండు ఒలిచి తినబోయి వీలుకాక పక్కన పెట్టేశాడు.             వెంటనే కాశిరెడ్డి వాత్యల్యను పిలిచి ”అమ్మ చెప్పింది. హారతి నీచేత పట్టించమని” […]

శ్రీముఖ లింగేశ్వరం

రచన: నాగలక్ష్మి కర్రా… శివరాత్రి…..   ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్ధశిని శివరాత్రిగా హిందువులు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. ఆంగ్ల కేలండర్ ప్రకారం ఈ సంవత్సరం 17-02-2015న ఈ శివరాత్రిని హిందువులు జరుపుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో హిందువులు సంవత్సరంలో  రెండుసార్లు శివరాత్రిని జరుపుకుంటారు.  శ్రావణ శుక్ల చతుర్ధశిని పార్వతి పరమేశ్వరుల కల్యాణం జరిగిన రోజుగానూ, మాఘ బహుళ చతుర్దశిని శివుడు హాలాహలం  గ్రహంచిన రోజుగానూ మరియు లింగంగా ఉద్భవించిన రోజుగానూ జరుపుకుంటారు. శ్రావణమాసంలో అమావాస్య మొదలు చతుర్దశి […]