May 3, 2024

నీలాకాశపు అంచులలో….

why-is-the-sky-blue

రచన:పుట్టపర్తి నాగపద్మిని

నీలాకాశపు అంచులలో విహరించేవారము మేమూ
కల కానే కాదిది నిజమూ బందీలము కామూ మేమూ …నీలాకాశపు..

బంగరు పంజరములలోనా కన్నీటి కథలిక లేవూ
చుక్కల లోకమ్ముల దాకా మా రెక్కల అంచులు సాగూ ….నీలాకాశపు..

సంకెలల ప్రపంచం తోటీ సంఘర్షణ మాకిక లక్ష్యం
సంక్షోభపు స్త్రీ బ్రతుకులకే సంరక్షణ మా కర్తవ్యం ….నీలాకాశపు..

బరువెకిన హృదయంలోన బడబానలమే చెలరేగీ
కరుకెక్కిన జాతిని సైతం యెదిరించే శక్తిగ నిలచీ ….నీలాకాశపు..

మా గొంతులు అన్నీ ఒకటై జాగృత గీతం ఆలాపిస్తే
శృతులన్నీ ఒకటై పోవా సంస్కృతులూ ఒకటై పోవా …..నీలాకాశపు..

వీరమాతలూ మనమే, దేశ నేతలూ మనమే
మాతృదేవతలు మనమే, వీరపత్నులము మనమే
నిర్భయతా , నిర్భీకతలే మన ఆయుధ సంపద
విజ్ఞతతోనే విజయమునందితే మనదే విజయగాధ …. నీలాకాశపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *