May 3, 2024

పద్యమాలిక .. ఏప్రిల్ 1

april 1

NagaJyothi Ramana

 

అమ్మో జేబున చెయినిడ
సొమ్ములచట దొరకనియడు- చోద్యము నేడున్
నెమ్మదిగా చూతును గద
కొమ్మా ఫూల్ వయితివనుచు- కొంటెగ వ్రాసెన్

 

ఈ నెల జీతము నీదని
మానస చోరుడు బలుకగ- మానిని తోడన్
వీనుల విందుగ దలచుచు
కానక ఫూలయె ధనమును-కాంతుని జేబున్

 

ఫూలు గ జేశావ్ మగడా
పూలకు నీ జేబు నిటుల- ఫుల్లుగ వెదకన్
వీలుగ చొక్కా కనపడి
ఖాళీ యగుజేబునిడుచు -కాసులు దాచీ !!

 

Venkat Tekumalla

 

నగదు మాయము యింటిలొ నడుమ నడుమ
భర్త జూచుచు గమనించ పర్సు ఖాళి;
ఫూలు జేయగ దలచెను పూర్తి గాను
చీటి జూచిన చిన్నది చిన్న బోయె!

 

Srinivas Iduri

 

ఒకటవ తేదీ ఎపుడూ
తికమక లేకుండ ధనము తీసెద నేనూ
అకటా ఇదేమి చిత్రమె
టకారముగ ఫూలనెగద టక్కరి మొగుడూ

శ్రీ స్వామి

 

ఆ.వె. సకలకళలు నేర్పుచదువులపడతివి
జగములోన జనుల చదువునీవె
గతినిజూపుమాకు ఖగవాహన విహారి
నీకరుణని జూపు నీరజాక్షి.

 

ద్వి.. :మది విషాధ విహంగ మాయెను, నాలొ
కదిలెడు భాదను కడతేర్చు దేవ!

ఎదబరువాయెను, ఈశ్వరాయన్న
మదిపిలుపును నీవు మన్నించు దేవ!

 

 
Sonti Prabhakara Sastry

 

ఆశగ చూసెను అంగీ,
పైసా కానక వెధవది •పైత్యము కాంచెన్
ఆశే ధన మిద్దరికిన్
గాసెను నిప్పటి వరకును •కాదా మగడా!

 
Voleti Srinivasa Bhanu

 

క్రమము తప్పక సతి కాంతమ్మ చేతులు
మొగుడి జేబు వెదుకు మొదటి దినము
గుట్టు నెరిగి నపతి గట్టి పాచిక వేసె
ఏప్రెలొకటి నాడు ఈవిధాన

 

 

 

 

Srivenkateswara Rao Dubagunta

 

తేది ఒకటి యని తెలిసి-వెదికెను సతి
జీత మొచ్చెనేమో నని- జేబు నందు
పాప ,మాయమ్మఆశలు వట్టి వాయె
మగడు ఏప్రేలు ఫూల్జేసె – మందమతిని

 

వెదికె వెర్రి తల్లి పతి జేబు లోపల
కూర పాలు పండ్లు కొనుట కొరకు
రోజు మారి పోయెరూక లేక పోయెను
ఇంతి బాధ తీర్చ ఎవరి కెరుక

 

ఎన్ని మార్లు వచ్చి- ఎంతని వెదికినా
చీటి మార దాయె – చింత మిగిలె
ఎన్ని రోజులిటుల – యేమార్చునోగదా
ఇంటిలోని బాధ- ఈశుడెరుక

 

P Bdv Prasad

 

జేబులోపర్సు పత్నికి జిక్కదాయె
వెక్కిరించె యే యెఫ్పనె యొక్కమాట
ఏప్రియలుఫూలు తానయ్యె నీదినమ్ము
నన్ని దినములాల్వేసుఫూలతడు గాదె?

 

Goli Sastry

 

ప్రతినెల యొకటవ తేదీ
పతి జేబున దబ్బు కొరకు పర్సే దీయున్
సతి నేడు చేయి బెట్టగ
మతి బోయెను ” ఫూలు ” స్లిపు మరి గనగానే.

కానీనుంచక జేబున
ఈ నాతోనె నెగతాళ నిదితాళను లే !
రానీ చెబుతా రాత్రికి
నేనేంటో అయ్యగారు నివ్వెర బోవన్.

పైసా లేదే జేబ్ మే
ఐ సా ఏప్రిల్లు ఫూలు అనెడీ చీటీ
ఐసా కర్తే బాద్మే
ఐసును జేస్తాడు మేరి హస్బెండ్ హాయ్ ! హాయ్ !

 

 

Annapareddy Satyanarayana Reddy

 

పెల్లుగ(ఫుల్లుగ) జీతము నంతయు
తల్లికి తానిచ్చునంచు తలచుచు మదిలో
మెల్లగ పతిజేబు వెదకి
చెల్లనిచీటీని కాంచి చిక్కెను ఫూలై

 

పైకమును చేతికిడక
పేకాటకుఁబోవుచున్న పెనిమిటి చెంత
న్నాకాంత వెతికి కనుగొనె
నోకాగితమును తనపతి యంగీనందున్

 

జేబులోనుండి సొమ్ము విచిత్ర ముగను
మాయమగుటగాంచి విభుడు మర్మ మెరుగ
చిన్న చీటీ నునుచ పట్ట జేబు దొంగ
నింట ఫూలుగ చిక్కె నా యింతి కనుడు

 

Venkata Subba Sahadevudu Gunda

 

జేబులోన డబ్బేదని గాబరాగ
తెరచి చూచిన శ్రీమతి తెల్ల బోయె!
బ్యాంకు సెలవని మరచిన పత్నిజూడ
నేప్రెలొకటిన ఫూలాయె నింటిలోన!

 
Sailaja Akundi

 

భర్త గారి జేబు బాగుగా కనిపింప
ఫస్టు మాట మరచి పర్సు జూడ
కాన వచ్చెనందు కాగితం బొక్కటి
ఫూలు జేసె పతియె మేలు గాను !!!

 

గుట్టుగ దాచగ సొమ్మును
కొట్టెను పతి జేబునుండి కోమలి పర్సున్
బిట్టుగ దెరువగ నహహా !
నట్టింట్లో ఫూల యెనుగ నారీ మణియే!!!

 

చెక్కుచు రేఖల నింపుగ
చక్కని కార్టూను మలచి సంతస మిడగా
పెక్కురు సొగసుగ నల్లరె !
మక్కువతో పద్యములను మాలిక యందున్ !!!

 

Chandramouli Suryanaryana

 

పైసా ఛుపాకె ముఝుకో
కైసా బుద్ధూ బనాయ ఖానా ఖానే
జైసా తుమ్ ఆవోగే
ఐసా బదలా మిలేగి హాథుమె మేరీ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *