May 5, 2024

నాన్న – సూపర్ హీరో

రచన: జొన్నలగడ్డ కనకదుర్గ

kanakadurga

నాన్న నా సూపర్ హీరో. మా ఇంట్లో, మా చుట్టాలలో మా నాన్న ఒక ఆదర్శం. తను చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగినా, మాకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచారు. “తనకు తాను సుఖపడితే తప్పు కాకున్న తన వారిని సుఖపడితే ధన్యత” అని నాన్నలాంటి వారిని చూసే వ్రాసి వుంటారు. నేను కష్టపడ్డాను, నా వాళ్ళు కష్టపడకూడదు అన్న నాన్న తాపత్రయము వల్లే మామ్మ, తాతయ్య, పెద్దనాన్న, బాబాయిలు, వాళ్ళ పిల్లలు అని , ఇన్ని అనుబంధాల ఆనందం తెలిసింది.
చదివించడం, ఆస్తులు ఇవ్వడం చాలా మంది చేసే పనే. కాని మనం చేసే పని వల్ల వచ్చే కష్టం, నష్టం మవదే అని బాధ్యత నేర్పించే నాన్నకి కూతురుగా పుట్టటడం మా అదృష్టం.

నాన్న మాకు నేర్పించినది ధైర్యం. భయం అనేది మొట్టమొదటి బలహీనత అయితే, ధైర్యంగా వుండడం మనకు వుండవలసిన మొట్టమొదటి లక్షణం అని నాన్న ఆచరించిన సూత్రమే మేము నేర్చుకున్న మొదటి పాఠం. ఫలితం గురించి భయపడకుండా ముందు ప్రయత్నం చేయటం ముఖ్యం అని నేర్పిన నాన్న గురించి ఎంత రాస్తే సరిపోతుంది?
నాన్న గురించి చెప్పవలసిన ఇంకొక సంగతి – సేవ. మనం సంఘంలో ఒక్కరమే బతకటం లేదు. మనకు సహాయం చేసిన వాళ్ళు వారి స్వార్ధం ఏమి లేకుండానే మనకు సాయం చేసినప్పుడు, మనం ఇంకొకరికి సాయం చేయగల స్ధాయిలొ వున్నప్పుడు తప్పకుండా సాయం చేయాలి. అలాగ చేయకపొతే అది మానవత్వం కాదు అని భావించే నాన్న ఎంత మందికి చదువు చెప్పించారో, ఎన్ని పెళ్ళిళ్లకి సహాయం చేశారో .. ఆ మంచి పనుల పుణ్యమే మాకు ఇవాళ శ్రీరామ రక్ష.. వీటితో పాటు పుస్తకాల ప్రచురణ. శ్రీ తిప్పాభట్ల శ్రీ రామచంద్ర మూర్తి గారు రచించిన మహాభారతం వచన రూపంలో ప్రచరణ సారధ్యం వహించిన ఘనత మా నాన్నదే. పేరు లేకుండా అరసవల్లిలో, మొపిదేవిలో, విజయవాడలో అన్నదాన సత్రాలు నడుపుతున్నారు అంటే సమాజం పట్ల ఆయనకున్న కృతఙత మరియు సేవా దృక్పధం. ఇంకా వేద పండితుల సేవ భగవంతుని కృపగా భావించే మా నాన్నకు ఆ భగవంతుడు కడు రమ్యమైనట్టి కరుణ తన యందు ఉంచి ఆయుర్, ఆరోగ్యము లతో దీవించుగాక..

నాన్నా!! ఇంత కన్నా నీకు ఏమి ఇవ్వగలను.

8 thoughts on “నాన్న – సూపర్ హీరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *