రచన: మాలతి దేచిరాజు
నిశ్శబ్దిస్తున్న బంధాలు….. జారిపోతున్న అనుబంధాలు…
కదులుతున్న కాలంతో కరిగిపోయే స్నేహాలు
ఈ జీవన పయనంలో నీకు నువ్వే తోడు
కరగనీకు నీ ధైర్యం…వదులుకోకు అస్థిత్వం
రుధిర ధార అన్వేషణలో పసికందుల ఆక్రందనలతో
కరుడుకట్టిన పాషాణపు రహదారులలో
అడుగడుగున ఎదరయ్యే కంటకాలు
సమస్యల సందిగ్ధాలు, ఆరాటాల పోరాటాలు
కలగలిపిన అంతులేని అగాధాలు
భగ భగల సెగల పొగలు అలుపెరగని ఆటంకాలు
గతులు మారినా చరితలు మారని తలరాతకి
చరమ గీతం పాడేసేయి….
కనులు తెరవని
కసురు గాయలకి….నూతన శకాన్ని రాసేసేయి
అమ్మతనం నీకు వరం….ప్రేమకి నువ్వు ప్రతిరూపం
ఆశలకి వూపిరి పోస్తూ …రేపటిపొద్దులకి ఆకృతి నిస్తూ
సాగిపో సాగిపో నీ గమ్యం బహుదూరం
chala bagundi malati garu mi kavita gundenu takindi.
ఎప్పటి లాగే….గుండె లోతుల్లో నుంచి ఉబికి వచ్చిన అద్భుతం…మాలతి…అభినందనలు…….