May 17, 2024

ముదనష్టపు మధుమేహము

రచన: శ్రీనివాస భరద్వాజ్ కిషోర్ ఎక్కువ చపలత్వముతో చిక్కినవన్నిటిని తినగ జీవితమంతా చక్కెర చూడగ మెల్లగ చిక్కును రుధిరమ్మునందు చేదునిజమిదే బియ్యం ముతకది తిన్నా తియ్యదనము వైపు ముఖము తిప్పకయున్నా నెయ్యన్నా వలదన్నా కయ్యబడుతు ఉడకబెట్టి కాయలె తిన్నా ముదనష్టపు రోగమ్మది వదలదు మనలను సుళువుగ వచ్చిందంటే మదికెంతో క్షోభకలుగు పదిరకముల మందులుతిను బతుకైపోవున్ పట్టినచో మధుమేహము పుట్టగనే కర్మగాలి పూరువ జన్మన్ తిట్టుకొనుచు ఇనుసులినును గట్టిగ గుచ్చేసుకొనుచు గడిపేయవలెన్ తగ్గించవలయు కార్బులు పగ్గము వేయగవలయును బైటతినుటకున్ […]

నందోరాజాభవిష్యతి

రచన: డా. ఇందిరా గుమ్ములూరి పురాణ వైరగ్రంధమాలలో ఇది నాలుగవది. దీని రచనకాలం 1960. విశ్వనాధవారు దీనిని ఆశువుగా చెపుతుంటే శ్రీ జువ్వాడి గౌతమరావుగారు లిపిబద్ధం చేసేరు. మగధరాజ్యం శిశునాగవంశం నుండి నందవంశ పరం ఎట్లయిందో నిరూపించే రచన “నందోరాజాభవిష్యతి” అనే నవల. పురాణాల ప్రకారం, చరిత్ర ప్రకారం కూడా శిశునాగులు పదిమంది. వీరు మగధని మూడువందల అరవై ఏళ్ళు పాలించారు. మౌర్యవంశపు రాజులు వరుసగా చంద్రగుప్తుడు, భద్రపారుడు, అశోకుడు, కుణాలుడు, దశరధుడు, ఇంద్రపాలితుడు, హర్షవర్ధనుడు, శాలిశూకుడు, […]

మన వాగ్గేయకారులు – (భాగము – 8)

రచన:- సిరి వడ్డే శ్రీ రామదాసు : భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన భక్త రామదాసు అసలు పేరు కంచెర్ల గోపన్న. వీరు 1620లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శ్రీ లింగన్నమూర్తి, శ్రీమతి కామాంబ దంపతులకు జన్మించారు. వీరి భార్య శ్రీమతి కమలమ్మగారు. రామదాసు శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధులైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధమున్నది. తెలుగులో కీర్తనలకు ఈయనే ఆద్యులు. “దాశరధి శతకము”, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 9

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఎంతో పుణ్యం చేసుకొంటేకానీ మానవజన్మ లభించడం దుర్లభం. మానవ జన్మ ఎత్తాక ఇవన్నీ మరచి కేవలం కాంతా కనకాలు, కీర్తి ప్రతిష్ఠలు, పదవులు, హోదాలు మాత్రమే శాశ్వతమని నమ్మి, పొద్దు వాలిపోతున్నట్లు వయసు వార్ధక్యం వైపు నడచిపోతున్న విషయం గమనించక, మన వెనక రాని, మన సేద తీర్చలేని, వ్యర్థమైన, తుఛ్చమైన కోరికలకోసం వెంపర్లాడడం అన్నమయ్యను విస్మయానికి గురిచేశాయి. క్షణిక సుఖాలకోసం శాశ్వత సుఖాలను దూరం చేసుకోవడం పట్ల అన్నమయ్యకు ఏహ్య భావం […]

కృష్ణ , వేణిల సంగమం

రచన: నాగలక్ష్మీ కర్రా కృష్ణాపుష్కరాలు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది విజయవాడ కనకదుర్గ అమ్మవారి పాదాల దగ్గర వున్న కృష్ణ, అక్కడవరకు వెళ్లలేనివారి సంగతి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా తీరాన యెన్నో స్నానఘట్టాలు నిర్మించి ఉభయరాష్ట్ర ప్రజలకు పుణ్యస్నానాలకు చేసిన యేర్పాట్లు న్యూస్ ఛానల్స్ లో చూసి పూనేలో వున్న మేం యెక్కడకు వెళ్లి పుణ్యం సంపాదించాలి అని మనసులో రోజూ బాధ పడుతూ వుండేదాన్ని. గోదావరి , కృష్ణ నదులు మహారాష్ట్ర […]

తాను – నేను

కళ్యాణదుర్గం స్వర్ణలత కాంపౌండ్ వాల్ పక్కగా తాను తొంగి చూసినపుడే, నేనూ చూశా తొలిసారి తనను… ఇంద్రలోకం నుండి నిటారుగా దిగిన సౌందర్యమది ప్రతి రోజు తన నవ్వుతోనే నాకు తొలి ఉదయం చూసిన ప్రతిసారి గుభాళించే ఆ నవ్వే నన్ను తనకోసం చూసేలా చేస్తోంది తన నిత్య దర్శనంలో కాలం అప్పుడే పుష్కరమై పూసింది ఇంతలోనే ఎంత మార్పు .. ఇంతే వున్న తాను మానంతై చిరునవ్వుల గుభాళింపులతో నన్ను ముంచేస్తుంటే మనసంతా మైమరుపే అమాంతంగా […]

అస్త్ర సన్యాసం

రచన: అశోక్ అవారి సమాజ సంఘటనల్ని ఎప్పుడు కొలిచినా.. హృదయస్పందనల్లో హెచ్చుతగ్గులే. మానవత్వాన్ని ఎప్పుడు తూచినా మనసెప్పుడూ.. సంద్రంలో ఆటు పోటుల్లా అల్లకల్లోలమే. మనిషి నిఘంటువులో మంచితనపు పదాన్ని చేర్చలేక అస్త్ర సన్యాసం చేసిన.. చేతగాని మానసిక అవిటి వాన్ని. గురుదక్షిణగా నైపుణ్యం బొటనవేలై తెగిపడ్డ ఏకలవ్యున్ని. వ్యూహమే లేకుండా.. సమాజ సమస్యా పద్మవ్యూహంలో కిరాతకంగా హత్య చేయబడ్డ వాన్ని. ఇప్పుడు నేనొక జీవ మృత కళేభరాన్ని- కడిగినా పోని నిత్య పాపాలపై ప్రళయ రుద్రునిలా.. పాశుపతాన్ని […]

చేయగలిగేదేముంది?

రచన:-భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు అజ్ఞానమే తప్పవిజ్ఞానం అలవడని వయసులో ఆవేశమే తప్ప ఆలోచన జతపడని మనసుతో కన్నవాళ్ళని కాదని,వాళ్ళఆత్మీయతను చేదని అల్లారుముద్దుగా పెంచిన వారి ప్రేమను వద్దని ప్రేమించుకున్నాం అనే భ్రమలో ఇరుక్కొని కలిసితీరుతాం అనే కఠిననిర్ణయాన్ని తీసుకొని కులగోత్రాలతో సంబంధం రద్దు చేసుకొని వంశగౌరవాలతో అనుబంధం త్రెంచేసుకొని కట్టుబాట్లను కాలదన్ని వెసులుబాట్లను వెనకేసుకొని సాంప్రదాయానికి తలవంచక ముందువెనుకలు ఆలోచించక మంచిచెడులు అవలోకించక ఆవేశాన్నే ప్రేమ అనుకొని ఆకతాయితనాన్నేధైర్యం అనుకొని చెడుదారిని ఎంచుకోవటమే చైతన్యం అనుకొని పెడదారిని […]

మధ్యతరగతి మిథ్యా సూరీడు

రచన:- జి. మధుబాబు నివురు గప్పిన ఆశల నింగిలో నిప్పుల కొలిమిలా మండుతున్నాడు ఎండమావుల వేటలో యాంత్రిక జీవన బాటలో ఎడతెరిపిలేక యేగుతున్నాడు శ్వాసించే శిలలా శ్రమిస్తున్నాడు మధ్యతరగతి మిథ్యా సూరీడు ఈ మధ్యతరగతి భారతీయుడు!! అనుక్షణం అనుక్రమిస్తూ ప్రతీక్షణం పరిక్రమిస్తూ అభ్యుదయం కొసం అల్లాడుతున్నాడు ఉద్యమం ఊపిరిగా జీవిస్తున్నాడు మధ్యతరగతి యెర్ర సూరీడు మధ్యతరగతి మిథ్యా సూరీడు ఈ మధ్యతరగతి భారతీయుడు!! సామ్యవాదమంటాడు సమసమాజమంటాడు తన దాకా వస్తే ధనస్వామ్యమంటాడు ప్రపంచానికేమొ ఇదే ప్రజాస్వామ్యమంటాడు ప్రజాతంత్ర […]

కాసేపు నీతో ప్రయాణం ..

రచన: గవిడి శ్రీనివాస్ ఆ కాసేపు నీతో పయణించిన క్షణాలు మల్లె వాసనలూ మౌన రాగాలూ అలజడి రేపుతున్నాయి నీ వేదో చేస్తావనీ కాదు మనసు తలుపు తడితే ఒలికిపోయే వెన్నెల సమీరాల్లో తడిసి పోయిన వాణ్ణి నీ వేదో చెప్తావనీ కాదు కనుల భాషలో రాలిపోయే పువ్వుల్ని ఏరుకుందా మనీ మూసుకున్న కళ్ళల్లో కలల్ని నీ పరిచయాలు గా పదిల పరచు కోవాలనీ ఆరాట పడుతుంటాను మరి కొన్ని క్షణాల్లోనే దూర మౌతుంటాను. కాలం సాగుతున్నకొద్దీ […]