May 2, 2024

శుభోదయం – 9

రచన: డి.కామేశ్వరి “ఏమిటి పెద్ద త్యాగం చేసాననుకుంటున్నావా? భర్తని యింకోరికిచ్చి ఈ పెళ్లి చేసి? ఏమిటసలు నీ ఉద్ధేశం? ఆ మాధవ్ వెధవ పని చేస్తే మొహం యీడ్చకుండా, ఏదో పెద్ద ఘనకార్యం చేశాననుకుంటున్నావా యీ పెళ్లి చేసి?” సరళ స్నేహితురాలిమీద విరుచుకుపడింది. మాధవ్, శారదల పెళ్లి దేముడి గుడిలో క్లుప్తంగా జరిగింది నిన్న. అది విని సుడిగాలిలా వచ్చి రాధని దులిపి వదిలింది. రాధ నిర్లిప్తంగా నవ్వింది. “మాధవ్ యింక నా భర్త కాడని నీకు […]

GAUSIPS – ఎగిసేకెరటం-6

రచన:-డా. శ్రీసత్య గౌతమి “బిశ్వా పి.హెచ్.డి. మూడవ సంవత్సరంలో ఉన్నాడు. ఇంకా మరొక్క సంవత్సరంలో పూర్తయిపోతుంది. ఇప్పుడయినా పి.హెచ్.డి కి సరిపోయినంత డాటా ఉంది. అయినా బిశ్వా ని ల్యాబ్ లో అట్టే పెట్టుకున్నాడు చటర్జీ. ఎందుకంటే అతను వుంటే తనకు వేరే క్రొత్తవాళ్ళని తీసుకొని ట్రైన్ చెయ్యడానికి సహాయంగా వుంటుంది. ఆ పనేదో బిశ్వా మీద పెట్టేస్తే తనకు కొంత సమయం కలిసొస్తుంది, పైగా పరిశోధనల నిమిత్తం బిశ్వాకి తెలిసినంత చటర్జీ కి కూడా తెలియదుగా. […]

జీవితం ఇలా కూడా ఉంటుందా 5

రచన: అంగులూరి అంజనీదేవి అప్పటికప్పుడే ఆమె ముందు కస్టమర్స్‌ క్యూ పెరిగింది… వాళ్లతో చాలా ఇంప్రెసివ్‌గా మాట్లాడుతూ వాళ్ల దృష్టిని ఎాక్ట్‌ చేసి వాళ్లను పక్కషాపులకు వెళ్లకుండా చేస్తోంది. ఆమెలోని ఆ షార్ప్‌నెస్‌ వల్ల, స్టాల్ వల్ల తమ బిజినెస్‌ స్పీడ్‌గా డెవలప్‌ అయ్యే అవకాశాలు వున్నాయని వాళ్ల ఏర్‌టెల్‌ డెమో ఆఫీసర్‌ పైవాళ్లకు ఆమె పేరును రెకమెండ్‌ చేసే ఛాన్సెస్‌ కూడా వున్నట్లు ఆమెకు నిన్ననే తెలిసింది. ***** అంకిరెడ్డి వాకింగ్‌కి వెళ్తూ దారి మధ్యలో […]

ఆదర్శ కళ్యాణ వైభోగం

రచన: సుభద్ర వడ్లమాని కృష్ణ మూర్తిగారు హడావుడిగా హాల్ల్లోకి వచ్చి “రాధా ఇంకా రెడీ అవలేదా? ఫ్లైట్ వచ్చే టైం అయిపోతోంది. నేను కార్ బయటికి తీస్తాను. తొందరగా రా.” అని చెప్పి బయటికి వెళ్లారు. 5 నిమిషాలలో రాధాదేవి వచ్చి కారులో కూర్చోగానే ఎయిర్ పోర్ట్ కి బయల్దేరారు. వాళ్లకి ఇద్దరూ అమ్మాయిలే. పెద్దమ్మాయి సుకన్య వివాహం అయి లండన్లో ఉంటోంది. చిన్నమ్మాయి సుప్రియ ఎం,స్ చేసి యూ.స్ లో మంచి ఉద్యోగం చేస్తోంది. రెండేళ్ల […]

“చారిత్రిక నవలా సాహిత్యం.”

రచన: మంథా భానుమతి నవలా సాహిత్యంలో ఉన్న వివిధ విభాగాలలో చారిత్రిక నవలలది ఒక ప్రత్యేక స్థానంగా పలువురు పెద్దలు పేర్కొన్నారు. చారిత్రిక నవలల ప్రత్యేకత ఏమిటి? కొద్ది సంవత్సరాలుగా వెనుక బడి మళ్లీ ఈ మధ్య కాలంలో కొంత ప్రాధాన్య సంతరించుకుంటోంది ఈ చారిత్రిక నవలా సాహిత్యం! ఒకప్పుడు వచ్చిన కొన్ని సినిమాలు, చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి.. కొద్ది మార్పులు చేర్పులు ఉన్నా కూడా. బోలెడు అవార్డులందుకున్న బాహుబలి.. చారిత్రాత్మకం కాదు. తొలి […]

ఆదర్శ దాంపత్యం

రచన: టీవీయస్.శాస్త్రి రామచంద్రుని సోదరీ, ఋష్యశృంగుని ఇల్లాలు శాంత. దశరథుడుకి యజ్ఞం ఫలం ద్వారా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సంతానంగా కలిగారు. అలాగే వసిష్ట ముని కామధేనువు అయిన సురభి అనుగ్రహంతో దశరధుడికి పుత్రికగా జన్మిస్తుంది శాంత. దశరథునికి మంచి స్నేహితుడు రోమపాదుడు. ఇతనికి సంతానం లేదు. ఆ దిగులుతో అతడు కృశించిపొతున్నాడు. ఆప్త మిత్రుడిని ఆదుకునేందుకు దశరధుడు తన కుమార్తె శాంతను అతనికి దత్తత ఇస్తాడు. పెళ్లీడురాగానే శాంతకు సరైన వరుడి కోసం స్వయంవరం […]

అమెరి’కలకలం’

పరిచయం: శారదా మన్నెం. వంగూరి చిట్టెన్ రాజుగారు! వారి గురించి వినడమే కాని వారిని నేను ముఖతా చూడటం మొన్న డి.కామేశ్వరిగారి కథల అనువాద పుస్తకావిష్కరణ రోజునే. వెళ్ళి పలకరించే సాహసం చెయ్యలేదు. అలాంటి చొరవ నాకు చాల తక్కువ. అప్పుడప్పుడు వారి రచనలు కొన్ని చదివాను. వారి సాహితీ సేవాకార్యక్రమాల గురించి విన్నాను. మొన్న శ్రీమతి జ్యోతి వలబోజుగారు ప్రచురించిన అమెరి’కలకలం’ కథలూ, కమామీషులూ చదవడం జరిగింది. చిట్టెన్ రాజుగారి గురించి మరింత తెలుసుకునే అవకాశం […]

జీవన యాత్రలో కనిపించిన మూడవ మనిషి

రచన: రమేష్ కార్తికేయ (స్టూడెంట్) మనమెటో వెళ్తూ ఉంటాము చడిచప్పుడు లేకుండా తుఫానులా వచ్చేస్తారు . భాయా భాయా .. పైసల్ తీయి భాయా అంటూ చెంపలు గిల్లుతూ , చప్పట్లు కొడుతూ భయపెడుతూ నవ్విస్తూ, రాబట్టుకున్న పైసలని చేతివేళ్ళ మధ్య ఇరికించుకుని దిగిపోతారు . అలా వాళ్ళ జీవితాలతో పోరాడుతూ కనిపించే మనుషులే అదేనండి మన నోటి వెంట నుండి అలవోకగా వచ్చే మాట ” కొజ్జా చక్కా ,హిజ్రా “ గురించే ఇదంతా.. నిత్యం […]

పురాణము – పరిశీలనము

ఓం గం గణపతయే నమః ఓమ్ శ్రీ వాగీశ్వర్యై నమః ఓం శ్రీ మాత్రే నమః రచన: కొరిడే విశ్వనాథశర్మ,     ఓమ్ దేవీం వాచమజనయంత దేవాః , తాం విశ్వరూపాః పశవో వదంతి | సానో మన్ద్రేషు మూర్జం దుహానా, ధేనుర్ వాగస్మానుప సుతిష్ఠతైతు || ~ తై. బ్రా. 2.4.6.10. దేవతల అనుగ్రహము వలన ప్రాదుర్భావించిన వాక్కు సమస్త ప్రాణికోటిని నడపించుచూ, జ్ఞానమే లక్ష్యముగా గావించుచున్నది. అట్టి లక్ష్యమును పొంది, జ్ఞానరాశిభూతులైన బ్రహ్మర్ష్యాదులద్వారా […]

శ్రీ కృష్ణదేవరాయ వైభవం-5

రచన:-రాచవేల్పుల విజయభాస్కరరాజు విజయనగర రాజకోటలోకి అడుగు పెట్టిన నరసానాయకుడిని చక్రవర్తి రెండవ నరసింహరాయలు సాదరంగా ఆహ్వానించాడు. నగరంలోని అనేకమంది రాజప్రముఖులు, వాణిజ్యవేత్తలు, సామంతరాజులు, ప్రజలు, రాజోద్యోగులందరు కలసి ఎంతో గొప్పగా స్వాగతించారు. ఎవరికి తోచిన రీతిలో వారు గౌరవిస్తూ తమ తమ అభిమాన పూలవర్షం కురిపించారు. తనవారు, పరాయివారు అనే భేదం లేకుండా నరసానాయకుడికి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ, సత్కారాలు లభించడంతో చక్రవర్తి నివ్వెరపోయాడు. తప్పు చేశానేమోనని మదనపడ్డాడు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే […]