May 8, 2024

ఆమె

రచన: పారనంది శాంత కుమారి

ఆమె నువ్వు గుర్తించాల్సిన నీ బాధ్యత,
అమ్మగా,అక్కగా,చెల్లిగా,భార్యగా,
వదినగా,మరదలిగా,తెలిసిన పక్కింటి ఆమెగా
తెలియని కనిపించే ఒక అమ్మాయిగా,
నీ చుట్టూ తిరుగుతూ ఉన్న
నువ్వు గుర్తించని ఒక పుణ్య చరిత.
ఆమె సంరక్షణ, ఆమె పరిరక్షణ నీ బాధ్యత.
నీకే తను ఆధారమైనా
నీపై ఆధారపడినట్లు కనిపిస్తున్న ఆమె
నువ్వు పూజించాల్సిన ఒక దేవత.
తన శక్తిని నీకు ధారపోసి
నీశక్తిపై ఆధారపడుతున్నట్లు కనిపిస్తున్నఆమె
ఆ పరమాత్ముని ప్రభావిత.
నీ నీడగా తను ఉంటూ, నీ తోడును కోరుకొంటూ
అనుక్షణం నిన్నాదుకొంటూ ఉన్న ఆమె
ఆతనియొక్క అధ్బుతమైన ఆవిష్కృత.
నీ సమస్యలన్నిటికీ ఆమె
సవ్యమైన,దివ్యమైన ప్రేమమయ పరిష్కృత.
నువ్వు తెలుసుకుంటే తను ఆదిశక్తి
తనను కొలుచుకుంటే నీకు కలుగుతుంది ముక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *