April 27, 2024

అనగనగా ఒక రాజు

రచన: ధనికొండ రవిప్రసాద్ “ఏం గురూ ! ఈ మధ్య కథలేమీ రాయట్లేదా ? ” అన్నాడు సుబ్బారావ్. “పత్రికలకి రాస్తూనే ఉన్నా” అన్నాను. “ఇంకా పత్రికల కథల దగ్గరే ఉన్నావా ? ఏ టి.వి.సీరియల్సో రాయక. ఆ పత్రికలోళ్లు పది కతల్రాస్తే ఒక కత యెయ్యటమే ఎక్కువ. ఆళ్లిచ్చే డబ్బులు మనకేం లెక్క ! ఈ మద్య నేను టి.వి. సీరియల్స్ కి రాస్తన్నా అన్నాడు. నాకు మతి పోయినంత పని అయ్యింది. “నువ్వు టి.వి. […]

నేను అమ్మనయ్యాను!

రచన: వడ్లమాని బాలా మూర్తి. “నువ్వు గొడ్రాలివి… నువ్వు గొడ్రాలివేనే మహాతల్లీ ఏం పాపం చేసుకున్నామో మా పాలిట పడ్డావు. నాకా వీడొక్కడే, వీడికో నలుసైనా పుడుతుందా అంటే, నీ కడుపు పండదాయే..ఖర్మ…… నువ్వు గొడ్రాలివి……. గొడ్రాలివి…… గొడ్రాలివి……..” “అబ్బా” అని రెండు చెవ్వులూ మూసుకుంది రమావాణీ. గత రెండు సంవత్సరాలై ఇదే తంతు. ఏడాది దాటింది తానూ శేఖర్ విడిపోయి. డైవోర్స్ కూడా వచ్చేసింది. కానీ అత్తగారి శాపనార్ధాలు ఇంకా చెవులో గింగుర్లాడుతూనే ఉన్నాయి. అబ్బా […]

కాలం మారిందా?

రచన: సుజల గంటి ధరణి మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణం ఏమిటీ. అన్నిటికీ సర్దుకుపోవడం అన్నది ఎన్నాళ్ళు జరగాలి? సర్దుబాటన్నది భార్యాభర్తలిద్దరి మధ్యా ఉండాలి. కాడికి కట్టిన ఎద్దుల్లా జీవిత భారాన్ని ఇద్దరూ సమానంగా మొయ్యాలి. ఒక ఎద్దు అలిసినప్పుడు ఇంకో ఎద్దు మిగిలిన భారాన్ని కూడా మొయ్యాలి. ఇది ఇద్దరికీ వర్తించినా అవసరమైనప్పుడు అదనపు భారాన్ని ఎప్పుడూ ఆడదే మోస్తుంది. తప్పించుకుందుకు, సాకులకు ఆమెకు అవకాశం దొరకదు. అమ్మగా ఆమె అలా […]

సస్పెన్స్ కధలు: 2 – అమ్మా, నాన్న ఒక బాబు

రచన: మధు అద్దంకి కెవ్వుమనరిచాడు సోను. ” మమ్మీ వద్దు మమ్మీ , కొట్టకు మమ్మీ, మళ్ళీ చెయ్యను మమ్మీ అంటూ ఏడుస్తూ, అరుస్తున్నాడు సోను.. అయినా కనికరించకుండా బెల్టుతో చితక బాదుతోంది లక్ష్మి..పనిమనిషి రత్తాలు అడ్డమొచ్చి తల్లి చేతుల్లోంచి బెల్ట్ లాక్కుని, సోనూని పక్క గదిలోకి తీసుకుపోయింది.. ” రాస్కెల్ వద్దన్న పని చేస్తాడా ఇవాళ వీడిని చంపేస్తాను” అని మళ్ళీ పక్కగదిలోకి పోబోయింది. లక్ష్మి అరుపులు విన్న రత్తాలు గభాల్న తలుపేసి గొళ్ళెం పెట్టింది.. […]

*** ఏకలవ్య 2016 ***

రచన: గుడిపూడి రాధికారాణి. “అర్జున్!కమాన్. బీ అలర్ట్. కాన్సంట్రేట్ ఆన్ ద గోల్. “మాస్టర్ సూచనలు వింటూ జాగ్రత్తగా ఎయిం చేసుకుంటున్నాడు అర్జున్. “ఏం కనిపిస్తోంది?” అనడిగాడు ద్రోణా సర్. “చిలుక కన్ను సర్. “చెప్పాడు అర్జున్ ఏకాగ్రతగా చూస్తూ. బాణం సంధించి వదిలాడు. సూటిగా చిలుక బొమ్మ కంటికి గుచ్చుకుందది. ఇక ఎప్పట్లాగా ఆ వీక్లీ అసైన్ మెంట్లో కూడా టాప్ గ్రేడ్ పాయింట్లు సాధించినట్లే. రిలీఫ్ గా ఊపిరి పీల్చి వదిలాడు అర్జున్. కుర్చీలో […]

ఎఱ్ఱ మందారం

రచన: శ్రీకాంత గుమ్ములూరి రోజూ ఎంత లేపినా లేవని వసంత ఈ రోజు ఆరింటికే నిద్ర లేచేసింది. ఇంటి ముంగిట్లో ఉన్న ఎఱ్ఱ మందారపు చెట్టుకి ఎన్ని పూలు పూసాయో పదే పదే లెక్కపెట్టింది. పదకొండు పూలు! ప్రతి రోజూ తాను లేచే వేళకి చెట్టుకి ఒక్క పువ్వు కూడా కనబడేది కాదు. ‘మన మందార చెట్టుకి అసలు పువ్వులే పుయ్యవు!’ అని పెద్దక్కకి కంప్లైంటు కూడా చేసింది ఆ ముందు రోజు. అక్క తనను చెట్టు […]

వీడెవడండీ బాబూ..!

రచన: – కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ ఆ మధ్య నేను ఒక సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడ వెళ్ళా..! రైలు దిగి బయటకు రాగానే. ఆ సమావేశానికి హాజరయ్యే మరొక ఇద్దరు తారసపడ్డారు. పరిచయాలు పూర్తయ్యక సమావేశమందిరానికి బయలుదేరాం.. వీథులు చూస్తూ… విజయవాడ నగరంతో ఎవరికి వారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, చిన్నతనంలో వదిలేసిన పాతరోజులను , ఆ మధుర జ్ఞాపకాలు షేర్ చేసుకుంటూ నడకమొదలెట్టాం..! కొద్దిదూరం వెళ్ళాక కౌతవరపు వారి వీథి దగ్గరకు వెళ్లేసరికి అంత […]

ఆమె

రచన: పారనంది శాంత కుమారి ఆమె నువ్వు గుర్తించాల్సిన నీ బాధ్యత, అమ్మగా,అక్కగా,చెల్లిగా,భార్యగా, వదినగా,మరదలిగా,తెలిసిన పక్కింటి ఆమెగా తెలియని కనిపించే ఒక అమ్మాయిగా, నీ చుట్టూ తిరుగుతూ ఉన్న నువ్వు గుర్తించని ఒక పుణ్య చరిత. ఆమె సంరక్షణ, ఆమె పరిరక్షణ నీ బాధ్యత. నీకే తను ఆధారమైనా నీపై ఆధారపడినట్లు కనిపిస్తున్న ఆమె నువ్వు పూజించాల్సిన ఒక దేవత. తన శక్తిని నీకు ధారపోసి నీశక్తిపై ఆధారపడుతున్నట్లు కనిపిస్తున్నఆమె ఆ పరమాత్ముని ప్రభావిత. నీ నీడగా […]

ఒక్క మొక్క నాటండి!

రచన: నాగులవంచ వసంతరావు అన్నలార అక్కలార ఒక్క మొక్క నాటండి చెట్టు చేసె మేలేమిటొ ఈ జగతికి చాటండి మొక్క పెట్టి మట్టి వేసి నీరు పోసి కంచె వేసి చంటిపాప వలెను దాన్ని సతతం కాపాడండి ఊరు వాడ పట్నమంత ఉప్పెనలా కదలండి ఉరకలేస్తు మొక్క నాటి ఉత్తేజం పెంచండి మొక్క నాటినంతనె మన భాద్యత తీరదోయి పెరిగి పెద్దదయేదాక చక్కగ కాపాడవోయి దినదినము మొక్క పెరిగి వృక్షమైపోతుంటె మనకు కలిగె ఆనందం మరువలేము ఈజన్మకు […]