May 3, 2024

గుర్తింపుకు నోచుకోని పోస్టు

రచన:భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

ఆకాశం కంటే విశాలమైన హృదయం నాన్నది,
భూదేవికి మించిన సహనం నాన్నది,
ప్రకృతికంటే కూడా ప్రమాణమైన త్యాగగుణం నాన్నది,
వెన్నకంటే మెత్తనైన మనసు నాన్నది,
వెన్నెలకంటే చల్లనైన చూపు నాన్నది,
మౌనంగా మురిసే మురిపెం నాన్నది,
దగాచేయని దీవెన నాన్నది,
ఋణం తీర్చలేని ప్రేమ నాన్నది,
ఋజువులు అక్కర్లేని ఉన్నత స్థితి నాన్నది.
వివరించలేని వేదన నాన్నది,
గుర్తింపు పొందలేని గుణం నాన్నది,
తీరుకు నోచుకోలేని తపన నాన్నది,
ఏకరువు పెట్టలేని ఎదురీత నాన్నది,
గుప్తత్వాన్ని దాటలేని గుండెకోత నాన్నది.
ఒంటరితనం జంటగాఉండే రాత నాన్నది,
గుర్తింపుకు నోచుకోని పోస్టు నాన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *