May 3, 2024

మాతృక

రచన: డా॥ స్వర్ణలత గొట్టిముక్కల

నిశ్శబ్దం ఎప్పుడూ నిజమే!
కనుచూపు భావాలను
కవళిక ఆంతర్యాలను
పెదవి విరుపు ప్రహేళికలను
హృదయస్పందనల ఎగుడుదిగుడులను
మస్తిష్కపు మాయా మర్మాలను
కదలికల కపటత్వాన్ని
నిశ్శబ్దం నా ముందు
యధాతథంగా బోర్లిస్తుంది
నిశ్శబ్దం నా కంటికి శక్తినీ
మాటను వాడినీ
చేతకు చేవనీ
హృదయానికి స్వాంతననూ చేకూరుస్తుంది
అందుకే నిశ్శబ్దం ఎప్పుడూ నా మాతృక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *