May 2, 2024

జయలలిత.

రచన: డా.బల్లూరిఉమాదేవి.

08jayalalithaa4

మేదినందు జూడ మైసూరు సీమలో
మేలుకోటి చెంత పాండవపురాన
జయరామునకు పత్ని వేదవల్లకినీ
కోమలవల్లి తా కూతురయ్యె
నావల్లియే పెరిగి జయలలితయ్యె
కూర్మిపంచుచు తా కన్నవారికచట
చిరుతప్రాయమందె తండ్రి మరణించంగ
చెన్నపురిని చేరె తల్లి యావేదవల్లి
చిత్రసీమలోన కాలూనె జయలలిత
పదునైదు యేడుల ప్రాయమందే
దక్షణాది యందు నగ్రతారలచెంత
నాయిక యై నటించి మన్ననందె
తెలుగు తమిళ కన్నడ భాషలందు
నటియించి మెప్పించె నఖిల ప్రేక్షకులను
పరస్కృతులు బహుమతులంది
చిత్రజగతిని రిడు దేశప్రగతినికోరి
రాజకీయములందు రమణి చేరె
రామచంద్రుడీమె నాదరించుచు
నేర్పి రాజకీయములను
ఎగువసభకంప ఓనమాలటనేర్చి
దేశమునె శాసించు నేతయ్యె త్వరలో
ఆటు పోట్లెదురైన నదరక బెదరక
సాధించి చూపె తనసత్త్వమెల్ల
అలనాటి పాంచాలినా దుశ్శాసనుండు
నవమానంబు చేసె నిండు సభలోన
చట్టసభయందట్టి యవమానమే పొంది
ముఖ్యమంత్రిగానె సభలోన
యడుగిడుదు ననుచు ప్రతిన చేసి
తానునెరవేర్చుకొనియె
ప్రతిపక్షవీరులు ముప్పతిప్పలు పెట్ట
ప్రజానుగ్రహమంది మరల రాజ్యమేలె
ఆడదన్న కాదు అబల యని తాను
సబల యని రూపించె సకల జగతికిని
మేరిమాత వోలె పెళ్ళి కాకున్నను
అభిమానులందరికి అమ్మ తానయ్యె
అక్రందనలమధ్య నశువులనుబాసి
తాదివికేగె అభినేత్రి విప్లవజ్యోతి
కలైమామణికి కడసారి వందనం
జోహారు జోహారు నీకు జోహార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *