May 2, 2024

మాతృక

రచన: డా॥ స్వర్ణలత గొట్టిముక్కల నిశ్శబ్దం ఎప్పుడూ నిజమే! కనుచూపు భావాలను కవళిక ఆంతర్యాలను పెదవి విరుపు ప్రహేళికలను హృదయస్పందనల ఎగుడుదిగుడులను మస్తిష్కపు మాయా మర్మాలను కదలికల కపటత్వాన్ని నిశ్శబ్దం నా ముందు యధాతథంగా బోర్లిస్తుంది నిశ్శబ్దం నా కంటికి శక్తినీ మాటను వాడినీ చేతకు చేవనీ హృదయానికి స్వాంతననూ చేకూరుస్తుంది అందుకే నిశ్శబ్దం ఎప్పుడూ నా మాతృక

గుర్తింపుకు నోచుకోని పోస్టు

రచన:భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. ఆకాశం కంటే విశాలమైన హృదయం నాన్నది, భూదేవికి మించిన సహనం నాన్నది, ప్రకృతికంటే కూడా ప్రమాణమైన త్యాగగుణం నాన్నది, వెన్నకంటే మెత్తనైన మనసు నాన్నది, వెన్నెలకంటే చల్లనైన చూపు నాన్నది, మౌనంగా మురిసే మురిపెం నాన్నది, దగాచేయని దీవెన నాన్నది, ఋణం తీర్చలేని ప్రేమ నాన్నది, ఋజువులు అక్కర్లేని ఉన్నత స్థితి నాన్నది. వివరించలేని వేదన నాన్నది, గుర్తింపు పొందలేని గుణం నాన్నది, తీరుకు నోచుకోలేని తపన నాన్నది, ఏకరువు పెట్టలేని ఎదురీత […]

ఇలా ఐతే ఎలా?

రచన: పారనంది శాంత కుమారి. కొడుకులుంటే కోడళ్ళతో బాధంటావు, కూతుళ్ళయితే అల్లుళ్ళతో వ్యధ అంటావు. మనవళ్లుంటే గోలంటావు, వాళ్ళు లేకుంటే బ్రతుకు బోరంటావు. ఇంటికెవరైనా వస్తే సహించలేనంటావు, రావటం మానేస్తే భరించలేనంటావు. పెళ్ళాలు వాదిస్తారంటావు, భర్తలు వేధిస్తారంటావు. అత్తలు వాదిస్తారంటావు, మామలు మోదిస్తారంటావు. జోకులంటే డోకంటావు, నవ్వులంటే కేకలేస్తావు. చెడును మరువనంటావు, మంచిని తలవనంటావు. నువ్వు చెప్పినదే వేదమంటావు, ఎవరు ఏమన్నా వాదమంటావు. ఇలా ఐతే ఎలా?