April 22, 2024

రక్షా బంధనం

రచన:కె.ఝాన్సీరాణి

డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్న నిత్య ఆలోచిస్తూ వుంది. ఆఫీసుకి వెళ్ళాలా, సెవు పెట్టాలా? లేక ఏకంగా ఉద్యోగమే మానేయాలా? అని. నిత్య ఒక ప్రైవేటు ఆఫీసులో కంపెనీలో 6 నెల నుంచి ఉద్యోగం చేస్తూంది. భర్త అజయ్‌ ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం. రెండు నెలలు ఇండియాలో ఉంటే ఒక నెల అమెరికాలో ఉంటాడు. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు. అందుకే నిత్య ఉద్యోగం మానేయాలంటే ఆలోచించడం. పోనీ వేరే ఉద్యోగం చూసుకోవాంటే `ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో జీతం బాగుంది. ఇంటికి దగ్గర బస్‌స్టాప్‌. ఆఫీసుకు 5 నిముషాల ప్రయాణం. వేరే చోటైనా సమస్యలుండవని గ్యారంటీ ఏమిటి?
అసలేమయిందంటే ` రెండు నెలల ముందు బాస్‌ సెక్రటరీ షీలాకు పెళ్ళి జరిగింది. ఆ సెక్రటరీ పోస్ట్‌ నిత్యకిచ్చాడు బాస్‌ విక్రం. చాలా సంతోషించింది నిత్య. బాస్‌కి సెక్రటరీ అంటే జీతం పెరుగుతుంది. ఆఫీసులో తన ప్రాముఖ్యత పెరుగుతుంది. తక్కువ కాలంలో తనకు గుర్తింపు రావడం అనే ఆలోచనే ఎంతో బాగుంది. ఆ విషయం విన్న తోటి ఉద్యోగులు ఒకరి నొకరు చూసుకోవడం నిత్యకు అర్థం కాలేదు. రజిత మామూలుగా కంగ్రాట్స్‌ అంది. కవిత ‘జాగ్రత్త’ అంది. బాస్‌ దగ్గర పని కాబట్టి అలా అంటూ వుందేమో అని అనుకుంది నిత్య. మొదటి రోజు బాస్‌ గదిలోకి అడుగు పెట్టగానే ‘వెల్కం మిస్‌ నిత్యా’ అని నాటకీయంగా స్వాగతం చెప్పడం నవ్వు తెప్పించింది నిత్యకు. తను మిసెస్‌ అని మరచిపోయాడా?
బాస్‌ మొదట చెప్పిన రిపోర్ట్‌ చేసి ఇవ్వగానే చాలా మెచ్చుకున్నాడు. ప్రశంసాపూర్వకంగా భుజం మీద తట్టాడు. ఇబ్బందిగా అనిపించింది నిత్యకు. అలాగే థాంక్యూ చెబుతూ చేతులు పట్టుకోవడం. ఒక్కో రోజు తను వేసుకున్న డ్రెస్‌ బాగుందనడం. ఇవన్నీ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎవరికైనా చెప్పాలా? వద్దా? బాస్‌ విక్రంని చూస్తే నిత్యకు తన మామయ్య రాజారావు గుర్తుకు వస్తాడు. పెద్దవాడు పోనీలే అనుకుంటే అతని ప్రవర్తన భరించడం కష్టంగా వుంది. ఇంతలో ఆఫీసులో వాళ్ళు బంధువు ఇంట్లో ముఖ్యమైన ఫంక్షన్‌ వుండటంతో విక్రంకు రావడం కుదరదన్నాడు. వ్యాన్‌లు రెండు ఆఫీసు బయట వున్నాయి. నిత్య, రజిత, కవిత ముగ్గురు మాట్లాడుకుని జీన్స్‌లో వచ్చారు. అందరికి మీటింగ్‌ పాయింట్‌ ఆఫీసే కావడంతో అందరూ అక్కడే కుసుకున్నారు. ముగ్గురు బయటికి వెళ్తూంటే ప్యూన్‌ వచ్చి నిత్యని బాస్‌ పిలుస్తున్నారని చెప్పాడు.
ఇప్పుడే వచ్చేస్తాను. మీరు వెళ్ళి పోకండి అంటూ గబగబా లోపలికి వెళ్ళింది నిత్య. బాస్‌ విక్రం తన ఎక్జిక్యూటివ్‌ చైర్‌లో వెనక్కి వాలి కూర్చుని వున్నాడు. నిత్య గదిలోకి వెళ్ళగానే విక్రం నిత్యని నఖశిఖ పర్యంతం చూసిన చూపు నిత్యకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. బయటికి పారిపోదామా అనిపించింది. కాని ఏమి చేయలేక ‘‘బాస్‌ పిలిచారా’’ అంది.
‘నిన్న చతుర్వేది వాళ్ళ ఫైల్‌ ఇచ్చాను ఏది?’ అన్నాడు విక్రం
ఆ ఫైల్‌ ముందు రోజే నిత్య మొత్తం తయారు చేసి బాస్‌ డెస్క్‌లో పెట్టింది. అది తీసి ఇద్దామని డెస్క్‌ దగ్గరికి వెళ్ళింది.
‘ఇదేనా ఆ ఫైల్‌ చూడు’ అన్నాడు విక్రం. ఫైల్‌ చూడాంటే టేబుల్‌ మీదికి వంగాలి.
‘అవును సర్‌’ అంది.
‘ఇంపోర్టెడ్‌ ఫెర్ఫ్వూమా?’ అన్నాడు.
‘అవును మా వారు అప్పుడప్పుడు ఫారిన్‌ వెళ్ళినప్పుడు తెస్తుంటారు’ అంది
‘ఈ డ్రెస్‌ ఫిట్టింగ్‌ నీకు చాలా బాగుంది’ అన్నాడు విక్రం. జీన్స్‌ మీద ముడతను సరిచేస్తూ. వంటిమీద తేళ్ళు, జెర్రులు పాకినట్లు అనిపించింది నిత్యకు.
‘ఓ.కె. బై సర్‌. బయట అందరూ ఆ గురించి ఎదురు చూస్తుంటారు’ అంది నిత్య.
‘నాక్కూడా రావాలని వుంది కాని అర్జంటుగా చతుర్వేది వాళ్ళు వస్తామన్నారు. అందుకే మా రిలేటివ్స్‌ ఫంక్షన్‌ మానేసి ఇక్కడ కూర్చున్నా. హావ్‌ ఎ నైస్‌ టైం ఈసారి తప్పకుండా వస్తాను’ అన్నాడు. భుజంమీద తడుతూ.
‘బై సర్‌’ అంటూ వేగంగా బయటికి నడిచింది నిత్య. టి.విల్లో న్యూస్‌ పేపర్లలో ఆఫీసుల్లో లైంగిక వేధింపులు, స్కూల్లో కీచకులైన టీచర్లు అని వచ్చే వార్తలు వింటే ఇలా వుంటుందా? అని ఆశ్చర్యపడ్డది. కానీ ఇప్పుడు అది నిజమని అనిపిస్తూంది అని అనుకుంది నిత్య.
‘ఏమయింది’ అన్నారు కవిత, రజిత, ఆవేశంతో, ఉక్రోషంతో, నిస్సహాయతతో పగలబోయే అగ్ని పర్వతంలా ఉన్న నిత్యను చూసి.
‘ఏమీ లేదు పదండి’ అంది సర్దుకుంటూ. ఆరోజు వాళ్ళతో బాటు సంతోషంగా గడపలేక పోయింది నిత్య. తర్వాత రోజు ఆఫీసు నుంచి వెళ్దామనుకునే సరికి విక్రం ‘‘నిత్యా రేపు అర్జెంట్‌గా ఒక రిపోర్టు తయారు చేయాలి, పది గంటకల్లా వచ్చేస్తే మధ్యాహ్నం రెండింటికి వెళ్ళిపోవచ్చు’’ అన్నాడు.
మరుసటి రోజు ఆదివారం. అది గుర్తుందా? లేక ఆదివారమైనా తను రావాని చెబుతున్నాడా? అనుకుంటూ ఎవరెవరు వస్తున్నారు? అడిగింది నిత్య.
‘సగం మంది పైన రావాలి. లేకుంటే పని పూర్తికాదు’ అన్నాడు విక్రం.
‘మీవారితో బయటకి వెళ్ళే కార్యక్రమం ఉన్నా వాయదా వేసుకో’ అన్నాడు విక్రం.
‘అజయ్‌ ఆస్ట్రేలియా వెళ్ళాడు సర్‌’ అంది అప్రయత్నంగా.
ఇక తప్పదనుకుంటూ ఆదివారం ఆఫీసుకు వచ్చింది నిత్య.
వాచ్‌మాన్‌ ఆహమ్మద్‌ విష్‌ చేశాడు. హాల్లో ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళింది భయపడుతూ. విక్రం బోలెడు ఫైళ్ళు టేబుల్‌నిండా పరచుకుని కూర్చున్నాడు. నిజంగానే చాలాపని వుందన్నమాట. అనుకుంది నిత్య. ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ ఫైల్లోకి తవ దించేశాడు విక్రం. అప్పుడు ప్రారంభించిన పని 12 అయింది ఒంటిగంట అయింది. పని పూర్తయ్యే సూచనలేమి కనిపించలేదు. అహమ్మద్‌ కారియర్‌ తెచ్చాడు. మారు మాట్లాడకుండా తింది నిత్య.
ఎవరెవరు వచ్చారు? అడిగింది నిత్య అహమ్మద్‌ని.
‘‘ఇద్దరు వచ్చారు మేడం. వాళ్ళ పని అయిపోయింది ఇంకో పది నిముషాల్లో వెళ్తామన్నారు’’ అన్నాడు అహమ్మద్‌. పని వుంది, బయట అహమ్మద్‌ ఉన్నాడు భయమెందుకు అని తనకు తనే ధైర్యం చెప్పుకుంది నిత్య.
5గంటకు పని పూర్తయింది. బయటకురాగానే `విక్రం ‘‘నిత్యా ఏదైనా హోటల్‌లో కాస్సేపు విశ్రాంతిగా కూర్చుని వెళ్దాం’’ అన్నాడు కారు వైపు నడుస్తూ.
‘‘లేదు సర్‌ నేను వెళ్ళాలి’’ అంది నిత్య.
‘‘అజయ్‌ కూడా లేడన్నావుగా’’ కంఠంలో అసహనం తొంగి చూస్తుంది.
‘‘సారీ సర్‌ నాకు కొద్దిగా పనివుంది’’ అంది ఒకడుగు ముందుకు వేస్తూ.
చేయి పట్టుకుని అపాడు విక్రం
“షీలా అయితే అప్పుడప్పుడు నాతో బయటకు వచ్చేది. నేను ఎన్ని ఇన్‌సెన్‌టివ్స్‌, బోనస్‌లు ఇచ్చానో, మాకిద్దరికి బాగా కుదిరింది. కానీ నీవేమిటి ఇలా” తన్నుకు రాబోతున్న దు:ఖాన్ని అదిమి పెట్టి చేయివదిలించుకొని పరుగెత్తుతున్నట్లు బస్‌స్టాప్‌ వైపు గబగబా అడుగు వేసింది నిత్య.
అహంకారం దెబ్బతినగా, ఆశ్చర్యంతో అలా చూస్తూ వుండిపోయాడు విక్రం. తననెవరూ గమనించడం లేదని తెలిసి స్థిమితపడి కారెక్కి బయుదేరాడు విక్రం.
ఇంటికెలా వచ్చిందో, ఎలా తుపు తీసిందో అలా సోఫాలో కూబడి వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది నిత్య. ఏం చేయాలి అజయ్‌కి చెబుదామా? వద్దా అనుకుంది. అనవసరంగా అతడిని కంగారు పెట్టినట్లవుతుంది అనుకుని ఊరుకుంది. తర్వాత రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళినప్పటి నుంచి ప్రారంభమయింది నిత్యకు నరకం. రీ రైటింగ్‌లు, రీ టైపింగ్‌లు మధ్యాహ్నానికే పని చేయడం కష్టమనిపించింది నిత్యకు. లంచ్‌ టైంలో కవితా వాళ్ళకు చెప్పింది జరిగింది.
అజయ్‌ గారికి చెప్పావా? అడిగింది కవిత.
‘‘లేదు, తనిక్కడ లేడు ఆస్ట్రేలియాకెళ్ళాడు. అనవసరంగా కంగారు పెట్టడమెందుకని చెప్పలేదు’’ అంది నిత్య.
‘‘మరేం చేద్దామనుకుంటూన్నావు? ఎన్నాళ్లిలా?’’ అంది రజిత. వాళ్ళిద్దరూ సానుభూతి చూపించగరు తప్ప ఎలాటి సలహాలు ఇవ్వలేరు, వాళ్ళేకాదు ఇలాటి విషయాల్లో ఎవరైనా ఏమి చేయలేరు అనుకుంది నిత్య.
అదీ జరిగింది. తను భయపడి ఉద్యోగం వదుకోకూడదు, సమస్య నుంచి పారిపోకూడదు. దీనికి పరిష్కారం ఆలోచించాలి అనుకుంది నిత్య.
ఆఫీసుకు వెళ్ళగానే విక్రం కొన్ని పేపర్లు ఇచ్చి ‘‘ఈ రోజు ఎంత ఆస్యమైనా పని పూర్తి చేసి వెళ్ళు’’అన్నాడు.
ఆ పేపర్లు చాలా వున్నాయి. అయినా అది ఒక చాలెంజ్‌లా తీసుకుంది. చేస్తూనే వుంది. లంచ్‌ కూడా తన సీట్‌లో కూర్చుని చేసింది. బ్రేక్‌ తీసుకోకుండా చేస్తున్నా చాలానే మిగిలింది. 6 గంటకు ‘‘నిత్యా బై.. రిపోర్ట్‌ పూర్తి చేసి వెళ్ళు’’ అని కారు తాళాలు తీసుకుని ఒక క్రూరమైన నవ్వు విసిరి వెళ్ళిపోయాడు విక్రం.
6:30 అయింది 7:00 గంటయింది 7:30 అయింది. అహమ్మద్‌ మధ్యలో ఒకసారి వచ్చి ఏమైనా కావాలా మేడం అని అడిగి వెళ్ళాడు. 7:40 అమ్మయ్య ఎలాగైతేనేం పనిపూర్తి చేయగలిగాను’’ అనుకుంటూకంప్యూటర్‌ ఆఫ్‌ చేయబోయి ఏదో ఆలోచన రావడంతో ఒకసారి విక్రం అడ్రస్‌ మొబైల్లోకి ఎక్కించుకుంది. ఫైల్‌ తీసుకుని బయటకు నడిచింది నిత్య. అహమ్మద్‌ ఆశ్చర్యంగా చూశాడు నిత్యను. 4,5 రోజుల నుంచి ఆ అమ్మాయి బాస్‌ వెళ్ళినా ఆలస్యంగా కూర్చోవడం. ఒక పెద్ద ఆపద నుంచి బయటపడిన భావం ఆ అమ్మాయి మొహంలో కనిపించింది. అసలు సెక్రటరీగా నిత్యను వేసుకుంటానన్నప్పుడే అహమ్మద్‌కి అనిపించింది ఇలాంటి సంస్థల్లో చెవులు, కనులు ఉండవచ్చు గాని నోరు ఉండకూడదు. అప్పుడే తను తన ఉద్యోగం చేసుకోగలుగుతాడు. అందుకే ఊరుకున్నాడు. విక్రం తత్వం, నిత్య అమాయకత్వం తెలిసిన వాడు గనుక తనలో తను బాధపడేవాడు. కాని ఈరోజు నిత్యలో ఏదైనా చేయగలను అన్న ధీమా కనిపిస్తూంది. చేతిలో ఫైల్‌తో బయటకు వచ్చిన నిత్య ఇంటికి వెళ్ళింది. దారిలో స్వీట్స్‌ తీసుకుని. తర్వాత రోజు ఫైల్‌ తీసుకుని విక్రం వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిత్య. హాల్లో కూర్చోబెట్టి లోపలికెళ్ళాడు పని కుర్రాడు. కాస్సేపటికి మెట్లు దిగి హుందాగా వచ్చి చెప్పండి అంది విక్రం భార్య పద్మజ.
“మేడం నా పేరు నిత్య. నేను విక్రంగారి సెక్రటరీని” అంది పద్మజకు నమస్కరిస్తూ నిత్య.
‘కూర్చో. ఏ పని మీద వచ్చావు?’ అంది పద్మజ
‘‘బాస్‌ ఒక రిపోర్టు అర్జెంటుగా కావాలని చెప్పారు. ఆఫీసులో ఎప్పుడూ మీ గురించి చెబుతూంటారు. ఇంటిని మీరు చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారని, ఇంటిని, మీ నాన్నగారి వ్యాపారాలని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అంటూ వుంటారు. మీమ్మల్ని చూడాలని కోరిక. అందుకే ఈ అవకాశం తీసుకుని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదుగా’’ అంది నిత్య తను సేకరించిన వివరాలని జాగ్రత్తగా పేరుస్తూ.
‘నిజమా’ అన్నట్లు చూసింది పద్మజ
పద్మజా ఎవరు వచ్చింది అంటూ గదిలో నుంచి వచ్చాడు విక్రం. ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది. 10 ఏళ్ళు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఆఫీసులో కృత్రిమత్వం లేకుండా వున్నాడు.
‘‘నిత్య వచ్చిందండి. మీరు రిపోర్ట్‌ అర్జంట్‌ అన్నారట గదా’’ అంది పద్మజ.
ఆ! ఆ! అన్నాడు ఏమనాలో తెలియక.
ఇంటికే వచ్చేసిందేమిటి. పద్మజకు ఏమైనా చెప్పిందా. పద్మజకు తన లీలలు తెలిసినా పట్టించుకోనట్టు ఉండిపోయింది. కాని ఈ నిత్య ఇలా చేస్తుందని తెలిస్తే తను జాగ్రత్తగా వుండేవాడు. అసు నిత్యను సెక్రటరీగా వేసుకునేవాడు గాదు. తన వ్యాపార దక్షత చూసి తన మామగారు గిరిధర్‌ కూతురినిచ్చి పెళ్ళి చేశాడు. ఆస్తులన్ని పద్మజ పేరు మీద ఉన్నాయి. అయినా ఈ హోదా, ఈ జీవితం, అన్ని మామగారు పెట్టిన భిక్ష. అందుకే ఎప్పుడు పద్మజ దగ్గర చాలా ప్రేమగా, వినయంగా తన అసలు రూపం బయట పెట్టుకుండా నడచుకుంటాడు విక్రం.
ఏమిటండీ! అలా నిబడిపోయారు. ఇలా కూర్చోండి అంది పద్మజ.
కూర్చున్నాడు విక్రం
నిత్య తన హాండ్‌ బ్యాగ్‌లో నుంచి రాఖీ తీసి విక్రం చేతికి కట్టింది. స్వీట్‌ బాక్స్‌ తీసి అతని చేతిలో పెట్టింది. తెల్లబోయి చూస్తూ వుండిపోయాడు.
‘‘థాంక్యూ నిత్యా’’ అంది పద్మజ. ఇన్నేళ్ళుగా ఈయన వ్యాపారం చేస్తున్నారు. ఇంతమంది సెక్రటరీు వచ్చారు కానీ నీలా ఇంటికి వచ్చిన వారే లేరు అంది పద్మజ. తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు విక్రం.
వాళ్ళకు ఇన్‌సెన్‌టివ్స్‌ కావాలి నాకు సెక్యూరిటీ కావాలి అనుకుంది నిత్య.
మేడం నేను బయుదేరుతాను అంది నిత్య తను వచ్చిన పని అయిపోయిందనుకుని.
మేడం అనకు హాయిగా వదినా అని పిలువు. ఏమండీ నిత్య ఈ పూట ఇక్కడే బోజనం చేస్తుంది. మరి రాఖీ కట్టినందుకు ఏమిస్తున్నారు అంది పద్మజ
భోజనం చేశాక చీర, పూు, పళ్ళు ఇచ్చింది పద్మజ పుట్టింటి మర్యాదతో జాబ్‌ సెక్యూరిటీతో (రక్షా బంధన్‌ ఇచ్చిన) బయటికి నడిచింది నిత్య.

8 thoughts on “రక్షా బంధనం

  1. Rakshabandan , very good message. Nitya well done. Editor must see , so many laa,lu are missing. Good story. Jhansi Rani Garu congrats, keep it up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *