September 23, 2023

మాలిక పత్రిక నవంబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ఈ మధ్యే కదా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం. అప్పుడే సంవత్సరాంతానికి చేరువలో ఉన్నాం. కాలం ఎంత వేగంగా కదులుతుంది కదా. పాఠకులను అలరించడానికి మరిన్ని కథలు, సీరియళ్లు, కార్టూన్లతో మళ్లీ మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక. ఈ నెల నుండి ప్రముఖ రచయిత్రి మంథా భానుమతిగారి నవల “కలియుగ వామనుడు” సీరియల్ గా వస్తోంది. వినూత్నమైన ఈ రచన మీద మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తారు […]

“కలియుగ వామనుడు” – 1

రచన:మంథా భానుమతి. 1 “ఏటేటి తిన్నా ఏ పన్జేసినా ఎవ్వురైన.. ఏటి సేత్తారీ నిశి రేతిరీ ఏమారి ముడుసుకోని తొంగుంటే ఏడనుంచొత్తాదొ నిదురమ్మ ఏమడగకుండ తన ఒడికి సేర్సుకోదా!” వీధి చివరున్న ముసలి బిచ్చగాడు సన్నగా పాడుతూ, మలుపు మూల బొంత పరచి ముడుచుకుని పడుక్కున్నాడు. వెంటనే గుర్రు పెట్ట సాగాడు. మధ్యరాత్రి ఒంటిగంట దాటింది. రెండో ఆట సినిమాకి వెళ్లొచ్చిన వారు కూడా గాఢ నిద్రలోకి జారుకున్నారు. వీధి దీపాలు నాలుగింటికి ఒకటి చొప్పున, నీరసంగా […]