March 19, 2024

కాసుకో నా రాజా – గుణపాఠము ఏకపాత్రాభినయం

రచన: కన్య స్థలము: ఫేసుబుక్కు గోడ వాచకుడు: సెల్ఫీ సార్వభౌముడు (సెల్ఫీసార్వభౌముడు ఫేసుబుక్కులోని న్యూసుఫీడు వద్దకు యొచ్చి, కలయగ జూచి – ఆశ్చర్యానందముతో) ఔరా! ఈ రోజటి న్యూసుఫీడు చమత్కృతి ఏమియో గాని, ఏ దినము ఏ మిత్రుడు ఏ పోష్టు వేయుదురోనన్న శంక లేకుండగ న్యూసుఫీడు నెల్ల యౌపోసన పట్టిన నా మానసమును సైత మాకర్షించుచున్నదే! (పోష్టుల గెల పక్కకు జూచి) ఈ పోష్టరులు, వాలు మిత్రులు నా మతిని, అందుండు శాంతిని తస్కరించరు గదా! […]

బుడుగు-సీగేన పెసూనాంబ

రచన: ధనికొండ రవి ప్రసాద్. బుదుగు: సీ గేన పెసూనాంభా ! ఏంటలా డల్ గా మూతి ముడుచుక్కూచ్చున్నావ్ ! ఏం జరిగింది? అన్నం కూరా ఆడుకుందామా? సీగేన:హేమి అన్నం కూలా? ఇవ్వాల్ల అన్నమే తినాలనిపించ లేదు. అమ్మ కొత్తుతుందని తిన్నా . బుడుగు: హస లేమైంది? సీగేన: అమ్మా నాన్నా పోట్టాడుకున్నారు. బుడుగు:హ్హదా ! పెద్దాళ్లన్నాక కాసేపు పోట్టాడుకుంటారు. మళ్లీ కలుసుకుంటారు . ఇంతకీ దేనికి? సీగేన: నాకేమద్దమౌతుంది? పెద్దాల్ల తగాదా. ఏదన్నా అలిగితేనేమో “పిల్లాల్లు. […]

అరుంధతి… అటుకుల చంద్రహారం.

రచన: గిరిజారాణి కలవల   మామూలుగా తెలుగు సినిమాల్లో వచ్చే డైలాగే ఇది… “ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ సంగతీ చెప్పలేము…” అన్నాడు మెళ్ళో స్టెత్ సవరించుకుంటూ.. ఆ కుర్ర డాక్టర్. డ్యూటీలోకి కొత్తగా వచ్చినా,  ఆ వాక్యం బానే కంఠోపాఠం పట్టినట్టున్నాడు.. అందుకే అప్పచెప్పేసాడు… అంతటితో ఆగకుండా అతని స్క్రిప్ట్ లో రాసిన మరో డైలాగ్ గుర్తు వచ్చి…” ఎందుకైనా మంచిది… బంధువులందరికీ కబురు పెట్టండి.. ఆవిడ ఎవరినైనా చూడాలని అనుకుంటే కనుక వెంటనే […]

కౌండిన్య హాస్యకథలు – పెళ్ళిలో చీరింగ్ గల్స్

రచన: రమేశ్ కలవల “ఏవండి, పెళ్ళిలో ఆర్కెస్ట్రా అన్నారు, సంగీత్ అన్నారు.. అందరి పిల్లల పెళ్ళిళ్ళు గ్రాండ్ గా చేసుకుంటుంటే మన ఒక్కగానొక్క కూతురు పెళ్ళి కూడా అదిరిపోయేలాగా చేయాలి కదండి” అంది కుశల. “ఆ సంగతి నాకు వదిలేయ్” అని కంగారుపడకు అన్నట్లు సైగలు చేసి మళ్ళీ టీ వి లో క్రికెట్ మ్యాచ్ చూడటం మొదలుపెట్టాడు. “పెళ్ళి వారంలో పడింది, ఇంట్లో చుట్టాలంతా వచ్చి ఉన్నారు. మీరు తీరిగ్గా క్రికెట్ చూస్తే ఎలాగండి? వాళ్ళకి […]

మా వదిన మంచితనం- నా మెతకతనం..

రచన: జి.ఎస్.లక్ష్మి.. నవంబరు 8న మన ప్రథానమంత్రి నరేంద్రమోడీగారు రాత్రి యెనిమిదిగంటలకి మొత్తం ప్రపంచమే ఉలిక్కిపడేలా. 500, 1000 రూపాయిలనోట్లు ఆరాత్రి పన్నెండుగంటలనుంచీ చెల్లుబడి కావంటూ ఒక ప్రకటన చేసారు. అది వినగానే ప్రపంచం మాట దేవుడెరుగు.. నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. సంగతి కూడా అలాంటిదే మరి.. అసలే నాది ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం. బీరువాలో డబ్బుంటే ఖర్చుపెట్టుకోవడం, లేకపోతే మాట్లాడకుండా వూరుకోవడం తప్ప చాటూమాటూ తెలీనిదాన్ని. అలాంటిదానికి నాకు మా వదిన బ్రైన్ వాష్ […]