March 19, 2024

మాలిక పత్రిక జనవరి 2018 సంచికకు స్వాగతం

  JyothivalabojuChief Editor and Content Head అప్పుడే సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరం వచ్చి కూడా పది రోజులైంది. కాలం ఎంత వేగంగా గడచిపోతుంది కదా.  అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక డిసెంబర్ సంచిక వెలువడలేదు. క్షమించగలరు. ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా మీ ముందుకు వచ్చింది మీ మాలిక పత్రిక.. మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు, కార్టూన్లు కొలువుదీరాయి.. మీ రచనలు  పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com మరి […]

రెండో జీవితం 4

రచన: అంగులూరి అంజనీదేవి ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు. ఇంకేదో…! మరి పురుషునిలో తండ్రి అంశ వుండదు. ప్రేమ అంటే కామమే… ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు. కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే వుంటారు. వంటగదిలో వున్న శకుంతల – భర్త పిల్లల్ని తిట్లే తిట్లు వినలేక, దేవుడు ఈ చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడ్తోంది. తిట్లు ఆగిపోయాయి. కుక్కర్‌ విజిల్‌ రెండు సార్లు రాగానే ఆపేసింది. ”మమ్మీ! మమ్మీ!” అంటూ ఆపదలో […]

బ్రహ్మలిఖితం 14

రచన: మన్నెం శారద లిఖిత ఎంగేజ్ చేసిన టాక్సీ కొచ్చిన్‌లో బయల్దేరింది. అడుగడుగునా బాక్‌వాటర్స్‌తో, కొబ్బరి తోటలతో మరో లోకంలో అడుగుపెట్టినట్లుంది కొచ్చిన్. లిఖిత కళ్లార్పకుండా చూస్తుందా స్థలాల్ని. సహజంగా సైట్ సీయింగ్‌కి, శబరిమలై వెళ్ళే యాత్రికుల్ని తీసుకెళ్ళడానికలవాటు పడ్డ డ్రైవర్ లిఖితలోని ఆసక్తి గమనించి “ఇదేనా మొదటిసారి రావడం మేడం?” అనడిగేడు ఇంగ్లీషులో. అవునన్నట్లుగా తల పంకించింది లిఖిత. “ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” […]

కలియుగ వామనుడు 2

రచన: మంథా భానుమతి ఈళ్లేం సెయ్యలా.. బానే ఉంది. అమ్మయ్య అనుకుంటూ, మూల తలుపు కేసి సైగ చేశాడు కొత్తవాడు. టింకూని తీసుకుని ఆ తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు చిన్నా. టింకూ ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. వాడిని కూడా తీసుకుని లోపలికెళ్లి తలుపేసేశాడు. బాత్రూం, లెట్రిన్ కలిపే ఉన్నాయి. ఇద్దరూ ముక్కు మూసుకుని నడిచారు. ఎవరూ శుభ్రం చేస్తున్నట్లు లేదు. చిన్న పిల్లలు భయానికి, ఎలా వాడాలో తెలిసినా నీళ్లు పొయ్యట్లేదనుకున్నాడు చిన్నా. టింకూ, తనూ […]

మాయానగరం – 42

రచన: భువనచంద్ర “మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస. “ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు. ఎలా తినబుద్ధి అవుతుంది? ” దీనంగా అన్నాడు సేఠ్ చమన్ లాల్. ఒక్క నెల రోజుల్లోనే అతను సగానికి సగం తగ్గిపోయాడు. బాధతోనూ, మనోవ్యధతోనూ శరీరం సగం వడిలిపోయింది. […]

మనసు గాయం మానేనా….?

రచన:- జ్యోతి వలబోజు ఇంట్లో ఎవరూ లేరు.. నిశ్శబ్దంగా ఉంది. అసలు అది పెళ్ళి ఇల్లు అంటే ఎవరూ నమ్మరేమో. సుజాత తన గదిలోని మంచం మీద కూర్చుని టీవీ చూస్తుంది. కాని మనసు మాత్రం ఎక్కడో ఉంది. టీవీలొ కొత్త సినిమా వస్తుంది. కాని సుజాత దాన్ని మ్యూట్ చేసి రిమోట్ చేతిలో పట్టుకునే ఆలోచనలో పడింది. ఎంతో కష్టం మీద కూతురుకు నచ్చినవాడితో పెళ్ళి చేసి పంపి పది రోజులైంది. పెళ్లైన వారంలోనే భర్తతో […]

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కధలు … బ్రిడ్జి

రచన: ఝాన్సీరాణి కె స్కూల్‌ నుంచి వచ్చిన రాహుల్‌ ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్లు కూర్చున్నాడు. ‘ఏమిటి? రాహుల్‌ ఏమి తినకుండా అలా కూర్చుండి పోయావు’ అని అడిగారు లక్ష్మీగారు. లక్ష్మీగారి కూతురు లావణ్య కొడుకు`రాహుల్‌. లావణ్య ఆఫీస్‌కి వెళ్ళి వచ్చేసరికి ఆస్యం అవుతుంది. అందుకని రాహుల్‌ స్కూు నుంచి క్ష్మీగారి దగ్గరికి వస్తాడు. అక్కడ బట్టు మార్చుకుని అమ్మమ్మ పెట్టిన టిఫన్‌ తిని కాస్సేపు ఆడుకుని తర్వాత చదువుకుంటాడు. ఒక్కోసారి తల్లి లావణ్యగాని తండ్రి శేఖర్‌ గాని […]

జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు

రచయిత్రి; జి. యస్. లక్ష్మి సమీక్ష/మాటామంతీ: మాలాకుమార్ నవరసాలల్లో హాస్యరసం ప్రాధానమైనది అని నా భావన. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు . కాని అన్ని సమయాలల్లో కాదు. అసలు నవ్వని వాడు ఒక రోగి, నవ్వటం ఒక భోగం అన్నారు జంధ్యాల. చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళను చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. అదే చిటచిటగా ఉంటే దూరంగా ఉందామనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు, ఏదైనా చికాకు కలిగినప్పుడు మనసు మళ్ళించుకునేందుకు ఓ హాస్య నవలో, కథో చదవాలనిపిస్తుంది. […]

తుషార మాలిక లఘు సమీక్ష …!!

రచన: మంజు యనమదల కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని. సిరి వడ్డేగారు రాసిన త్రిపదలకు అది కూడా 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే. అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు “తుషార మాలిక” తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు. ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 22

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? భగవద్గీతలో భగవానుడు….దైవసంబంధమైనదియు, త్రిగుణాత్మకమైనదియునగు ఈ మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. అయితే నన్ను ఎవరు శరణు బొందుచున్నారో వారీమాయను సులభంగా దాటగలరు అంటున్నాడు. భగవంతునిచే కల్పించబడిన యోగమాయ, సత్త్వం – రజస్సు – తమస్సనే మూడు గుణాల రూపంలో ఉన్నది. ఇది జీవులకు దాటరానిది. ఈ మూడు గుణములను జయించగలిగినవాడే ఈ మాయను దాటగలడు. అటువంటి సామ్యావస్థ భగవంతుని శరణుజొచ్చిన వారికే […]