April 27, 2024

చార్వాకులు

రచన: శారదాప్రసాద్ 2500 సంవత్సరాల క్రితం మనుషులకి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో కూడా భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులని చార్వాకులు లేదా లోకాయతులని అనే వారు. లోకాయతులు అంటే ఉన్న లోకాన్నే నమ్మేవారు. వీరు పరలోకాన్ని నమ్మరు. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు. చార్వాకము లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ఈ వాదాన్ని […]

పాడు పండగలు..

రచన: రాజి పల్లె పల్లెలా వాడ వాడలా వస్తాయంట మాయదారి పండగలు ముస్తాబులూ, మంచి మంచి వంటకాలు తెస్తాయంట ఇంటింటా ఆనందాలు విరజిమ్ముతాయంటా. మరి మా మురికివాడ జాడ తెలియలేదా వాటికి వెలుతురు లేని వాడల అరుగులు వెతకలేదా ఈ వగలమారి పండగలు ఆకలి ఆర్తనాదాలు, చిరుగు చిత్రాలు కనరాలేదా కలహమారి పండగలకు మాయదారి పండగలు కలవారి ఇంటనే విడిది చేస్తాయంట బంగళాల్లో, కనక, కాంతుల్లోనే కనపడతాయంటా గుడిసెల్లో, నిరుపేదలను కనికరించవంట ఈ పాడు పండగలు.

ఒక్క క్షణం ఆలోచించు!

రచన: నాగులవంచ వసంతరావు మనిషికి మత్తెక్కించి మనసును మాయచేసి ఇల్లు ఒళ్ళు రెంటిని గుల్లచేసి సంఘంలో చులకనచేసే మద్యపాన రక్కసీ! మానవజాతి మనుగడపై నీ ప్రభావం మానేదెప్పుడు? ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు “చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి ఐస్ ముక్కల హిమతాపానికి మంచులా కరిగిపోయాయి మహాత్ముల ఉపన్యాసాలు, నీతిబొోధలు సంఘ సంస్కర్తల త్యాగఫలాలు మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం బక్కచిక్కి బరువెక్కి బజారుపాలైంది మధ్యం నిషాముందు ఇoద్రభోగం […]

సశస్త్రీ సుశస్త్రీ స్త్రీ

రచన: ఉమా పోచంపల్లి విశాల గగనం, వినీలాకాశం అనంత విశ్వం, ఆవేశపూరితం మనోబలం కావాలి ఇంధనం తేజోబలం అవ్వాలి సాధనం మానవమేధ మహా యజ్ఞం చేయాలి లోకముద్దీప్తి మయం విశాల అవని వినిపించెనదె ఆమని వలె వికసించెనదె అణుమాత్రమైనా, ప్రతిధ్వనించెను అష్టదిక్కులు మారుమ్రోగగా తారలమించే తేజోమయం ఆనందభైరవి నాట్యాలు వెలిగి మనసానంద నాట్యాల ఉర్రూతలూగించి వనితా అవని సుశాస్త్రజ్ఞానం అవని పరిధినే అధిగమించెనే కెంపులకేల కరవాలము వలెనే కుజగ్రహ మున నిలిపెను మన భారత క్షిపణి కుజగ్రహమున […]