March 19, 2024

మణికర్ణిక

రచన: ప్రొఫెసర్ రామా చంద్రమౌళి


తనెవరో తనకే తెలియని మణికర్ణిక
భస్మసింహాసనంపై కూర్చుని గంగా హారతిని చూస్తోంది కటిక చీకట్లో
యుగయుగాలుగా అంతే
స్త్రీని హింసించి , వధించి , సతిని యాభైరెండు ఖండాలుగా ఖండించినపుడు
ఇక్కడ వారణాసి తటిపై ‘ కర్ణాభరణం ‘ ఒక శక్తిపీఠమై మొలిస్తే
కన్యాకుమారిలో తెగ్గొట్టబడ్డ ఆదిమ స్త్రీ పవిత్ర పాదాలు రక్తసిక్తమై
చుట్టూ ఆవర్తనాలౌతూ సముద్రాలూ, నదులూ దుఃఖితలైనాయి –
అంబాడ్తున్న మణికర్ణికను ఎవరో శ్మశానాల మధ్య విడిచి వెళ్ళారు అప్పుడు
కాలాన్నే వస్త్రంగా కప్పుకుంటూ ఎదిగిన ఆమె
ప్రపంచ నగ్నత్వాన్నీ .. నగ్న ప్రపంచాన్నీ చూడ్డం నేర్చుకుంది
మొట్టమొదటిసారి రెండు పిడికిళ్ళనిండా చిల్లర సంపాదించిననాడు
వాటిని శ్మశానతీరంపై ఎగజల్లి
ఆబగా ఏరుకుంటున్న మనుషుల నుండి ప్రథమపాఠం నేర్చుకుంది
నిశ్శబ్దతీరం .. ఒంటరి పడవ .. ఎడతెగని ప్రయాణమే ‘ జీవితం ‘ అని
ఇక చేతిలోకి అంకుశాన్నీ , అక్షరాన్నీ తీసుకుంది
వారణాసి వీధుల్లోనుండి నడిచే బోసిపాదాలు
ఇచ్ఛామరణాన్ని ప్రసాదించే ‘ ముక్తిభవన్ ‘ ను స్పర్శిస్తూ
అగ్నిలో దేహం దహించబడడంకన్నా
దేహంలోనే అగ్నిని ఎలా పరీభూతం చేయాలో నేర్చుకుంది
వారణాసి ఆమెకు జనన మరణాల రహస్యాన్నీ
మనుషులు దోపిడీ చేయడం, చేయబడ్డం గురించీ నేర్పింది
పుట్టుక ఎక్కడో .. చావు ఎక్కడో చితిలోని కాలే కట్టె చెప్పింది
తర్వాత నిశ్శబ్దం శబ్దించడమెలాగో నేర్చుకున్న ఆమె
జీవితమంటే వ్యూహమనీ ,

జయాపజయాలు వ్రేళ్ళసందుల్లోనుండి జారే నీళ్ళనీ
గుర్రాన్ని సమర్థవంతమైన స్వారీతోనే జయించాలనీ
సారంగీ విషాద స్వరం దర్శింపజేసే
‘ అవతలి తీరాన్ని ‘ చూడ్డం నేర్చుకుంది
పైకి .. పైపైకి చేరుతున్నకొద్దీ
శిఖరాలన్నీ లోయలుగా మారుతూండడం గమనించి
ఆమె క్షితిజ సమాంతర రేఖను అన్వేషించింది
కళ్ళముందున్నవన్నీ
శాశ్వత ప్రేమలుగా, తాత్కాలిక ప్రేమలుగా గుర్తిస్తున్నకొద్దీ
అంతిమంగా అసలు ‘ ప్రేమే ‘ లేదనీ
ఉన్నదంతా ‘ మోహమే ‘ నని గ్రహించిన తర్వాత
అనాథ .. అమోఘగా మారి , అనంతగా మిగిలి
ప్రపంచాన్ని గుప్పిట్లో పట్టుకుని వచ్చి
మణికర్ణిక చితిమంటల వెలుగులో ఆకాశంలోకి చూస్తూ
తన ‘ వజ్ర కర్ణాభరణాన్ని ‘ గంగలోకి విసిరేసింది
* * *
అటు ప్రక్కన ఎవరో అవధూత
‘ఎగిరిపో ఓ చిలుకా ‘ అని తత్వం పాడుతూనే
మోహవిమోహ విమోచనలో తేలిపోతున్నాడు
జీవితమై.. గంగ ప్రవహిస్తూనే ఉంది నిర్మలంగా.. నిశ్శబ్దంగా –

 

 

 అనేకమంది పాఠకుల అభ్యర్థనపై ప్రొఫెసర్ రామా చంద్రమౌళిగారి తెలుగు కవిత  ‘ మణికర్ణిక ‘కు  ఆంగ్ల అనువాదాన్ని క్రింద ప్రచురిస్తున్నాము.

 

MANIKARNIKA

 

Original Telugu : Prof.Raamaa chandramouli

Translated By :  Mydavolu Satyanarayana

 

 

Manikarnika must be in an oblivion,

a fugue or some kind of amnesia…

sitting pretty on her throne of ashes

was watching keen the Ganga Aarti !

Nothing changed since epochs

…when woman was tortured and killed…

and lo when Sati was cut into pieces fifty two,

here at Varanasi…

her earrings became a pool of Sacred Force.

And at Kanykumari, the chopped two feet

of that aboriginal woman that eddied

pools of gore all around

had stirred the oceans and rivers

to inexplicable woe!

Someone had deserted the wailing Manikarnika

amidst the blazing pyres of the graveyard.

She, who grew wearing the time-attire

could visualize a naked world

and could read the nakedness of  the world!

Yes…she beheld them all…

When someone flung his first earned coins

over the dusty tombs of God’s acre

there were more scrambing

for that squandered dough!

 

She realised that life was a silent shore

…a lone canoe…a never ending journey,

and sported a goad in hand

and a billion letters in heart!

Walking barefooted through

the narrow lanes of Varanasi,

passing through the ‘Mukti Bhavan’,

the mystic shrine that grants one

his death as and when desired…

her conscience transcended

the mortal ends of burning in pyres

to realise how to kindle the divine inner fire !

Varanasi…yes revealed to her

the secrets of birth and death;

and taught her the ways to rob and get robbed.

The burning wood in pyres

revealed to her…where begins the birth

and where it ends as death !

Later when she learned

how to make the silence to speak

she realised that life is a subtle strategy,

that victory and loss

are like dribbling away water

through the gaps between the fingers

and that a horse can only be reined

by an expert horseman

and through the thin screens of elegiac tunes

she learnt how to peer at the other bays.

 

The more she scaled the heights,

she found the zenniths

becoming deeper and deeper dales

and searched for some parallels

to the equatorial lines.

When she could discern

between the love eternal

and love transient…

she realised that there’s  in fact

no love-pure and perfect at all

and all that’s seen is nothing

but desire and infatuation!

 

Ah…Manikarnika, an orphan became

a Divine soul and an eternal being

with the entire world now in her choking grasp.

Staring at the sky

in the light of the burning pyres

she threw her diamond earrings

into the gushing streams of pious Ganges.

 

*                       *                               *

A passing saint singing ecstatic

some classic hymn:

‘O fly away my little bird…’

is floating in the duelty

of revelry and sobriety…

and Pious Ganga, like an everlasting life

is flowing and flowing, shimmering

with silent chastity !

 

7 thoughts on “మణికర్ణిక

  1. తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    -మౌళి

  2. The film on Manikarnika is getting controversial this wonderful poem if translated into English and other languages may help.
    Vemula Rama Rao

  3. ఒక అద్భుతమైన కవిత.మౌళి గారికి ధన్యవాదాలు.

  4. ఒక అద్భుతమైన కవిత.మౌళి గారికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *