March 30, 2023

ఇసైజ్ఞాని ఇళయరాజా

రచన: శారదాప్రసాద్


(శ్రీ ఇళయరాజాగారికి పద్మ విభూషణ్ సత్కారం లభించిన సందర్భంగా, ఆయనను అభినందిస్తూ వ్రాసిన చిన్న వ్యాసం)

ఇళయరాజా … పరిచయం అక్కరలేని పేరు ఇది. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు అతని బాణీలని కూనిరాగాలుగానైనా పాడుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా సంగీతంలో ఒక నూతన శకారంభానికి కారకుడైన ఈ సంగీత మేధావిని మేస్ట్రో అని పిలిచినా, ఇసైజ్ఞాని అన్నా, అభిమానులు ఇంకెన్ని మకుటాలు తగిలించినా ఈ నిగర్వి నిరాడంబరంగా నవ్వే ఒక చిరునవ్వు ముందు అవి చిన్నబోతాయి. అతడు మకుటాలు అవసరంలేని మహారాజు. పేరు యువరాజు అని పెట్టుకున్నప్పటికీ సంగీత ప్రపంచానికి అతడు రారాజు.
అయితే ఈ ప్రస్థానం అంత నల్లేరు మీది నడకలాగా ఏమీ సాగలేదు.అత్యంత దయనీయమైన బీదరికం నుంచి కేవలం తన విద్వత్తుతో, స్వయంకృషితో, గాడ్ ఫాదర్ ఎవరు లేకుండా ఒక్కడుగా ఆ శిఖరాలను అధిరోహించాడు. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనేందుకు అతని జీవితం నిలువెత్తు తార్కాణం. మనల్ని ఎవరు గుర్తించటంలేదు, మన మేధస్సు అంతా బూడిదలో పోసిన పన్నీరు ఐపోతోందని నిరాశ చెందే యువతరానికి పోరాటపటిమను నేర్పే ఒక చక్కని పాఠం.దక్షిణ భారత సంగీతాన్ని కొత్త మలుపులు తిప్పి, ఎన్నో ప్రయోగాలు చేసి, ప్రతి పాటలో తనదైన శైలిని కనబరచే సంగీత జ్ఞాని శ్రీఇళయరాజ గారు .ఆయన వయసు 73 ఏళ్ళు.ఈ వయసులో కూడా నూతన ప్రయోగాలతో, నేటి తరాన్ని అలరిస్తున్న శ్రీ ఇళయరాజ గారు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.ఆ సందర్భంలో వారి జీవిత విశేషాలు క్లుప్తంగా అందిస్తున్నాను.
***
అసలు పేరు : డేనియల్ రాజయ్య
జననం : 2-6-1943
జన్మస్థలం : మదురైలోని పన్నైపురం గ్రామం
తల్లిదండ్రులు : చిన్నత్తాయమ్మాళ్, రామస్వామి
తోబుట్టువులు : అన్నయ్యలు (పావలర్ వరదరాజన్- రామస్వామి మొదటి భార్య కొడుకు, డేనియల్ భాస్కర్), తమ్ముడు (గంగై అమరన్)
చదువు : 8వ తరగతి
భార్య : జీవా(ఈమె మూడు సంవత్సరాల క్రితం మరణించారు)
పిల్లలు : కుమారులు (కార్తీక్‌రాజా, యువన్‌శంకర్‌రాజా), కుమార్తె (భవతారిణి)– సంగీత దర్శకులు, గాయకులుగా రాణిస్తున్నారు
సంగీత గురువు : జి.కె.వెంకటేష్
తొలిచిత్రాలు సంగీత దర్శకునిగా : తమిళం-అన్నకిళి (1976), తెలుగు-భద్రకాళి (1977)
గాయకునిగా : సీతాకోకచిలుకలో ‘అలలు కలలు ఎగసి ఎగసి…’ (తెలుగు)
సంగీత దర్శకునిగా చిత్రాలు : 1000 దాకా
నటించిన సినిమాలు : పుదు పుదు అర్తంగళ్ (1989), అళగర్‌మలై (2009)
రాసిన పుస్తకాలు : తుళకడల్, పాల్ నిలాపాదై
అవార్డులు-పురస్కారాలు : గిటార్ సాధనలో ‘ట్రినిటీ మ్యూజిక్ ఆఫ్ లండన్’ వారి నుండి గోల్డ్‌మెడల్, జాతీయ అవార్డులు… తెలుగులో రెండు, తమిళ, మళయాళాలలో ఒక్కక్కటి, అన్నామలై, అరిజోనా వరల్డ్, మదురై కామరాజ్ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు, తెలుగులో మూడు నంది అవార్డులు. పద్మభూషణ్, ఇసై జ్ఞాని… బిరుదులు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి లతా మంగేష్కర్ అవార్డు, కలైమామణి, ఏపీ ప్రభుత్వం నుండి 2008 లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుండి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారం, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు. 2018 లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ విభూషణ్ సత్కారంతో గౌరవించింది.
భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుందాం!

9 thoughts on “ఇసైజ్ఞాని ఇళయరాజా

  1. రంగమ్ ఏదైనా రంగరించి రచనను కొన సాగించ గల సమర్థతను , సినీ రంగ ప్రముఖులు గురించి కూడా వ్యాసంగాలను వ్రాయగలిగిన , వ్రాసి చూపించిన, శ్రీ శారదా శాస్త్రీ గారికి అభినందనలు.

  2. Very good analysis . He deserves “Padma Vibhushan” award. No doubt he is a “SVARANIDHI”. Thank you for giving us a good Information about “Raja” of Music.

  3. భగవంతుడు సృష్టించిన గాన సరస్వతులలో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు ఒకరు. చక్కటి వ్యాసం అందించినందులకు మీకు ధన్యవాదాలు.

  4. సంగీతానికి మరో పేరు ఇళయరాజా. సృష్టిలో కొన్నిటికి ప్రత్యామ్నాయాలు ఉండవు. అటువంటివాటిలో ఇళయరాజా ఒకడు. సంగీతాన్ని శ్వాసించి, శాసించే జ్ఞాని అతడు … సంగీతజ్ఞాని. నిత్యం జరిగేవి అద్భుతాలు కావు. అరుదుగానే జరుగుతాయి. ఇళయరాజా ఒక అద్భుతం. ప్రపంచానికి ఒక్కడే ఇళయరాజా, ఒక్కడే ఇసైజ్ఞాని. నిండు నూరేళ్లు అలుపెరుగని సంగీతసుధలు ఈ ప్రపంచానికి అతను అందివ్వాలని … అందరితోబాటుగా నేనూ కోరుకుంటున్నాను.

  5. అద్భుతమైన సంగీత దర్శకుడికి అతి చక్కని బహుమతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2018
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031