April 23, 2024

తొలివలపు

రచన: నిష్కల శ్రీనాథ్ బయ్యప్పనహళ్ళి (బెంగళూరు)మెట్రో స్టేషన్ సమయం 7:45 మెట్రో ఎక్కేవాళ్ళు దిగేవారితో రద్దీగా ఉంది. ఈ నగరానికి వచ్చిన దగ్గర నుండి హడావిడి గా మనుషులు పరిగెత్తడం చూసి అలవాటు అయిపోయిన స్వప్న మాత్రం మెల్లగా సెక్యూరిటీ చెక్ ముగించుకుని లోపలికి వెళుతూ ఫోన్ కి ఇయర్ ఫోన్స్ పెట్టి చెవిలో పెట్టుకుంది. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఆ పాత మధురాలు వింటూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాక […]

నూటికొక్కరు

రచన: ఆదూరి. హైమావతి. అది ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వపాఠశాల. ఆదర్శ పాఠశాలగా ఎంపికైంది. H. M. రాజేంద్రప్రసాద్ గారు చాలా ఆదర్శ భావాలున్నవారు, వృత్తి పట్ల అంకిత భావం ఉన్నవారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధులు, అందుకే కుమారునికి ఆ పేరు పెట్టుకున్నారు. పాఠశాలలో విలువలు, ఉప విలువలు మొత్తం’ 108 ‘ గురించీ పాఠశాల ప్రార్ధనలో బోధిస్తూ పిలల్ల చేత స్వఛ్ఛందంగా 2, 3 ని. ఉపన్య సింపజేస్తారు. ఉపాధ్యాయ బృందం, పిల్లలు అంతా […]

శ్రమజీవన సౌందర్యం

రచన: మణికుమారి గోవిందరాజుల “ప్రతి ఒక్కళ్ళూ కూడా తమ స్వార్ధం తాము చూసుకోకుండా కాస్త అందరికీ సహాయపడటం అలవాటు చేసుకోవాలి. ఒక వెయ్యి సంపాయించామంటే కనీసం ఒక్క రూపాయన్న యెవరి సహాయనికైనా ఇవ్వగలగాలి. యెన్నాళ్ళుంటామో తెలియని ఈ జీవితంలో మనం పోయాక కూడా మనల్ని జీవింపచేసేది అలా చేసిన సాయమే. సహాయం పొందిన వాళ్ళు మనని తల్చుకుంటే వాళ్ళ మనసుల్లో మనం జీవించి వున్నట్లే కదా?అదన్నమాట. నా వరకు నేనైతే యెవరికే సహాయం కావాలన్నా ముందుంటాను. అలా […]

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు సీసపద్యం తెలుగునాట బాగా వెలుగు చూసిన ప్రక్రియ. దానికి కారణం దానిలోని గాన యోగ్యత. రెండవది సంభాషణలాగా ఉండే ప్రక్రియ. ఎదుటి వారితో మాట్లాడుతున్నట్టుగా సాగే ఈ పద్య ప్రక్రియకు శ్రీనాథునిది పెట్టింది పేరు. ఆయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితిని మరుత్తరాట్చరిత్ర’బహు ప్రసిద్ధం. అలాగని మిగతా కవులెవ్వరిని తీసివేయడానికి లేదు. నన్నయ రాజవంశోత్తమ రంతిదేవుని కీర్తి ఏలచెప్పగ బడి విందు నందు. . . అట్లాగే తిక్కన సీసం ‘కుప్పించి […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30   విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। (సాంఖ్య యోగము–భగవద్గీత) “కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు” అంటాడు భగవానుడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం […]

ఐఐటి(లెక్కల) రామయ్యగారు

రచన: శారదాప్రసాద్ ఖద్దరు పంచె, చొక్కా, భుజాన ఒకఖద్దరు సంచి వేసుకొని అతి సాధారణంగా కనిపించే ఈయనను చూసిన వారెవరూ ఆయనను అఖండ మేధావిగా గుర్తించలేరు. చికాకు లేని చిరునవ్వు ఆయన సొంతం. ఈ అసమాన్య మేధావే లెక్కల(చుక్కా) రామయ్య గారు. శ్రీ చుక్కా రామయ్య గారు 20 -11 -1928 న, వరంగల్ జిల్లాలోని గూడూరు గ్రామంలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు-నరసమ్మ , అనంతరామయ్య గార్లు. వీరి ప్రధాన వృత్తి పౌరోహిత్యం. […]

తపస్సు – మొదటి సమిధ

రచన:- రామా చంద్రమౌళి ఔను .. ఈ శరీరం ఒక పుస్తకమే .. సంహిత బీళ్ళు, అరణ్యాలు , నదులు, పర్వతాలు .. అన్నీ ఈ దేహంలోనే .. సుప్త సముద్రాలు , జ్వలితాకాశాలు పుట వెనుక పుట తిప్పుతూ ఎన్ని యుగాలుగానో .. ఈ బూజుపట్టిన గ్రంథాల పురాపరిమళం హోమర్ లు, వ్యాసులు, కంఫ్యూషియస్ లు, సూఫీలు అన్నీ రక్తనదుల్లో కొట్టుకుపోతూ రాజ్యావశేషాలు ఏ చక్రవర్తి జాడించి సింహాసనంపైకి బొంగరాన్నో , ఖడ్గాన్నో విసిరినా అది […]

అంతర్యుద్ధం

రచన: మూలా వీరేశ్వరరావు పుట్టక ముందే ఎదో పెద్ద కుట్ర జరిగింది ! జాతి అని, మతమని, కులమని, లింగమని నా మీద ముద్ర వేశారు ! నన్ను నేను చూసే అవకాశం లేదు ! చదువేదో మొదలయ్యాక ఇప్పుడు 90 శాతం 30 శాతం ఒకే చోట కూర్చునే అనివార్య స్థితి అంతర్యుద్దానికి సిద్ధం చేస్తుంది ! జంధ్యం పోగు,మాంసము పేగు పెనవేసుకొని సాగే పరిస్థితి ! కులాల కొలనులో కలహాల అలలు ! సామాజిక […]

ఎల్. జి. బి. టి.

రచన – శ్రీకాంత గుమ్ములూరి. అనాది నుండి మన సమాజంలో ఎన్నెన్ని వర్ణాలు !!! కులం మతం జాతి లింగం ఎన్నెన్నో విభాగాలు. వీటన్నింటినీ సంతరించుకుని వైషమ్యాల కక్షలు !! ఒక అతివ మరొక అతివను మోహించిందని ఒక పురుషుడు వేరొక పురుషునితో రమించాడని ద్విలింగాత్మక మైధునంలో లైంగికానుభూతి బడసారని పురుషుడు స్త్రీ వలె మరి స్త్రీ పురుష ప్రవృత్తి చూపారని నపుంసకత్వపు పుటకను పొందిన వారు నష్ట జాతకులని వారంతా ప్రకృతికే విరుద్ధమని వారి జీవనమే […]