April 26, 2024

“సరికొత్త వేకువ” – “మానవత్వాన్ని ప్రతిబింబించే కోసూరి కథలు”

సమీక్ష: డా. మంథా భానుమతి. నర్తకీమణిగా, నాట్యగురువుగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోసూరి ఉమా భారతిగారు, గత కొద్ది సంవత్సరములుగా రచయిత్రిగా కూడా పేరుతెచ్చుకుంటున్నారు. తన రచనలలో ఒక సందేశాన్ని, ఒక విశ్లేషణను జొప్పించటం ఉమాభారతిగారి ప్రత్యేకత. నాట్యంలో.. నర్తకిగా, గురువుగా, వ్యాస కర్తగా అనేక పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అందుకున్న రచయిత్రి కొత్త కోణం ఇది. ఈ కథల పుస్తకంలో రచయిత్రి మనోభావాలు పూర్తిగా ఆవిష్కృత మౌతాయి. కథల్లో పాత్రలు అన్నీ […]

మాలిక పత్రిక సెప్టెంబర్ 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ప్రియ మిత్రులు, సహ రచయితలు, పాఠకులందరికీ పండగ శుభాకాంక్షలు. ఏ పండగ అంటారా.. మొదలయ్యాయి కదా. రాబోయేదంతా పండగల శుభదినాలే. ఈ పండుగలు మీ అందరికీ శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మాసంలో మాలిక పత్రికలో రెండు సీరియళ్లు ముగింపుకు వచ్చాయి. ప్రముఖ రచయితలు భువనచంద్రగారు, మంథా భానుమతిగారు తమ అమూల్యమైన రచనలను మాలికకు అందించారు. ఈ సీరియళ్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మిమ్మల్ని అలరించే, మీకు […]

రెండో జీవితం 9

రచన: అంగులూరి అంజనీదేవి కోపం మనిషిని పశువును చేస్తుందని విమలమ్మకి తెలియంది కాదు… ”ఆయన బాధంతా ఆయన కొడుకు గురించే అన్నయ్యా! మనం అర్థం చేసుకోవాలి కాని, ఇలా పంతాలకి పోతే కాపురాలు నిలవ్వు… అయినా ఎంత మంది భర్తలు ఉద్యోగరీత్యా బయట ఊళ్లలో గడిపిరావటం లేదు. అంతమాత్రాన వాళ్ల భార్యలు విద్వంసాన్ని సృష్టించుకుంటున్నారా? ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అభిమానులు, యాడ్‌ ఏజన్సీలు, సన్మానాలు చేసేవాళ్లు, ఎగ్జిబిషన్లవాళ్లు ఇలా ఎందరెందరో ఫోన్లు చేస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా […]

కలియుగ వామనుడు 9

రచన: మంథా భానుమతి చిన్నాకి, అబ్బాస్ తో మాట్లాడ్డానికి సమయం దొరకలేదు. తమ ‘ఇంటి’కి వెళ్లగానే పెట్టె తీసి బట్టలు తడిమి చూశాడు. చేతికి గట్టిగానే తగిలింది. ఫోన్ కూడా తీసి ఇంకొక షర్ట్ జేబులో పెట్టాడు. గుడ్ అంకుల్ ధర్మమా అని నాలుగు షర్టులు, నాలుగు నిక్కర్లు ఉన్నాయి. నజీర్ ఎప్పుడూ తన పెట్టె జోలికి రాలేదు. అబ్బాస్, నజీర్ తోనే ఉన్నాడు. ఇద్దరూ ఒంటెల దగ్గర, వాటికి కావలసిన తిండి చూస్తున్నారు. రేసులు దగ్గర […]

మాయానగరం 50

రచన: భువనచంద్ర “షీతల్” ఉద్వేగంతో వణికిపోయాడు కిషన్. రుషి షాక్ తిన్నాడు. ఠక్కున వెనక్కి తిరిగింది షీతల్. కిషన్‌ని చూసి సర్వం మర్చిపోయి అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని మండపం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. అతని గుండె ఎగసి పడుతోంది. కళ్లవెంట ధారగా నీరు కారుతోంది. ‘రుషి సైలెంటుగా, శబ్దం రాకుండా గుడిలో వున్న అవధానిగారి దగ్గరకు చేరాడు. బిళహరి అక్కడే వున్నది. జరిగిన విషయాన్ని లోగొంతుకతో బిళహరికీ, అవధానిగారికీ చెప్పాడు […]

గిలకమ్మ కతలు .. ఉప్పులో .. బద్ద

రచన: కన్నెగంటి అనసూయ “ఏం..కూరొండేవేటి ..వదినే..…! ” మిట్ట మజ్జానం రెండున్నరకి పిల్లలు అన్నాలు తిని బళ్ళోకి ఎల్లిపోయాకా.. తలుపుకి తాళవేసి ఆటిని జాగర్తగా జాకిట్లోకి దూరుపుతా అప్పుడే అరుగు మీద కొచ్చి కూచ్చుని తొక్క బద్దలు ఏరటానికని అక్కడే గోడకి జేరేసి ఉన్న సేటల్లోంచి ఏ సేట సేతుల్లోకి తీసుకుని పక్కనే ఉన్న కందిపప్పు బత్తాలోంచి దోసిలితో రెండో దోసిలి..కందిపప్పోసుకుంటున్న సరోజ్ని వంక సూడకుండానే సావిత్రంది ఏదోటి పలకరిచ్చాలి గాబట్టి అన్నట్టు. రోజూ మజ్జానం కందిపప్పులో […]

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద “ఈ రోజు పౌర్ణమి”. చోటానికరా పూజారి వైపు అర్ధం కానట్లుగా చూశారు కాన్హా, లిఖిత. పక్షపు దినాలుగా మీ నాన్నగారికి చేతబడి తీయడానికి నిరంతర నిర్విరామ కృషి జరిగింది. ఇలా ఇంతవరకూ ఎవరికీ ఇంత దీర్ఘకాలపు చికిత్స జరగలేదు. మీ నాన్నగారి మానసిక స్థితి చాలా బలహీనంగా వుంది. నాడీమండలం నీచ స్థాయిలో పని చేస్తోంది. అందుకే ఇలా జరిగింది. మేం చేయవలసిందంతా చేసేం. మానసిక శారీరక రుగ్మతలన్నింటిని తీసేసే అద్భుత మూలికా […]

కంభంపాటి కథలు – ఆవే పులి

రచన: కంభంపాటి రవీంద్ర ఆ రోజు మధ్యాహ్నం టీ తాగుతూ, టీవీ చూస్తున్న హైందవికి భర్త నుంచి వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది, ఎవరా అని చూసేసరికి , భర్త గోవర్ధన్ . ‘ఏమిటండీ ఇప్పుడు ఫోన్ చేసేరు?’ అని అడిగితే ‘ప్రణతి స్కూల్ నుంచి జాగ్రత్తగా వచ్చిందా ?’ అని అడిగేడు . ‘ఆ ..వచ్చింది .. బ్యాగు హాల్లో పడేసి దాని గదిలోకెళ్ళిపోయింది ‘ అంది హైందవి ‘ఏం .. ఏవైంది ? […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। (సాంఖ్య యోగము-భగవద్గీత) “కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు” అంటాడు భగవానుడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు […]