March 30, 2023

విశ్వపుత్రిక వీక్షణం – భూమి ద్వారం మూసుకపోతోంది

రచన: విజయలక్ష్మి పండిట్.

మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలలో చిన్నవయసులోనే 15-45 ఏండ్ల లోపే గర్భసంచి తొలగింపుకు లోనవుతున్నారని, ఇది మహిళలలను ఆరోగ్య సమస్యలకు గురిచేయడమే కాకుండా కొన్ని బీద, వెనుకబడిన, నిరక్షరాస్య మానవ సమూహాలు, జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్న నిజాలు.

ఇటీవల మహిళా దినోత్సవ సధర్భంగా “ వసుంధర “ పురస్కార గ్రహీత గైనకాలజిస్టు డా. వెంకట కామేశ్వరి గారి ప్రత్యక్ష అనుభవం ఆమె మాటలలో మనలో తీవ్ర ఆలోచనలను రేపుతుంది. ఇది పెరుగుతున్న స్రీల
ఆరోగ్య, ఆర్థిక, మానవ జనాభా, జాతి అంతరించిపోయే వైపు నిశ్శబ్ధంగా అడుగులేస్తున్న తీవ్ర సమస్య.
ఆమె పంచుకున్న నిజాలు నాలో రేపిన భయాలోచనలు ఈ నా కవితాక్షరాలుగా రూపు దిద్దుకున్నాయి.

***

“భూమి ద్వారం మూసుకపోతోంది”

“ఇదిగో ఇటు చూడండి
నన్ను చూడండి ..,
నిర్ధయగా నన్ను కోసి పారేసిన
నా దుర్గతిని తిలకించండంటూ”…
గుట్టలుగా గుట్టలుగా పడి
గడ్డకట్టిన రక్తమాంసాల దిబ్బ
ఏడుస్తూ పిలుస్తూన్న భావన..!?

కొంచెం దగ్గరకెళ్ళి పరిశీలించి
అవాక్కయినాను..అర్థమయింది
ఆ ఆర్థనాదాలెవరివో…
ఎవరో కాదు.., అవి
నిర్జీవంగా పడివున్న
మాతృమూర్తి మందిరాలు
మనిషికి ప్రాణంపోసే జీవామృతకలశాలు
ప్రకృతిని వికశింపచేసే ఆలయాలు
అవి స్త్రీ పవిత్రగర్భాశయాలు…!

ఎవరిదీ అజ్ఞానాంధకార చర్య?
ఎవరీ అమానుష కార్యకర్తలు..?!
మనిషి మూర్ఖత్వం స్వార్థం
పడగవిప్పి బుస కొడుతున్న వైనం
గుడిలో గర్భాలయాన్ని పడగొట్టినరీతి
మాతృమూర్తుల శరీరాలయాలలో
పవిత్ర గర్భాశయాన్ని విడగొడుతున్నారు..,

మనిషి జాతి మనుగడకు
తెరదించు తున్నారు
కవిపించడంలేదా..?!
మాతృమూర్తుల గర్భాశయాల నాశనం
వినిపించలేదా ఆ …గర్భాశయాల గోష.?!
భూమిపై మూసుకుపోతూంది
మనిషి సంక్రమణ ద్వారం..?!

నిరక్షరాస్యత చీకటి వలయంలో చిక్కుకున్న
అభంశుభంఎరుగని అమాయక పడతులు
తమ అర్ధాయుషును ఆ దిబ్బలో వదలి
నడిచిపోతున్నారు జీవశ్చవాలై..,

అదిగో అటుచూడండి
భూమిపై గుంపులు గుంపులుగా
నిష్క్రమిస్తున్నాయి గర్భాశయాలు
మాతృమూర్తి ఆలయాలు
గర్భాలయంకూలిన శిధిలాలయాలు
స్త్రీ శిధిలాలయాలు
శిధిలాలయాలు..?!

1 thought on “విశ్వపుత్రిక వీక్షణం – భూమి ద్వారం మూసుకపోతోంది

  1. బాగుంది….అనకూడదేమో….గాని
    తొలి ఇల్లును తొలగించడం బాధ కలిగించే విషయమే…..
    పేదవారు, చదువులేని వారు మూఢ నమ్మకాలలో ఉంటారని ఎగతాళి చేసే వారిని చూసా….గాని
    చదువుకున్న మూర్ఖులే సృష్టిని నాశనం చేస్తున్నారని ప్రత్యక్షంగా చూస్తున్నా…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2019
M T W T F S S
« Mar   May »
1234567
891011121314
15161718192021
22232425262728
2930