April 26, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2019 సంచికకు స్వాగతం..

    Jyothivalaboju Chief Editor and Content Head స్వాగతం.. సుస్వాగతం.. చిరుజల్లులు, జడివానలు కలిసి మనతో ఆటాడుకుంటున్నాయి కదా.. తప్పదు మరి. ఎండలెక్కువగా ఉంటే వానలు కావాలనుకుంటాం. వానలు కాస్త జోరు పెంచితే వామ్మో అంటాం. ప్రకృతితో అడ్జస్ట్ అవ్వక తప్పదు మరి. ఈ చిరుజల్లులతో జతగా సన్నజాజులు కూడా ఉంటే ఎంత బావుంటుంది కదా.. ఎండాకాలంకంటే మనోహరమైన ఈ కాలంలో సన్నజాజుల పరిమళాలు అద్భుతం.. మహాద్భుతం.. మాలిక పత్రిక రచయితలకు, మిత్రులకు, పాఠకులకు […]

దేవుళ్ళకూ తప్పలేదు!

రచన: పెయ్యేటి రంగారావు దేవుళ్ళయినా పరిస్థితులకి తలలు ఒగ్గవలసిందే! ఒక్కొక్కసారి అటక ఎక్కుతారు, ఒక్కొక్కసారి అల్మారాల్లో దాక్కుంటారు. ఒక్కొక్కసారి గట్టెక్కుతారు!! సీతమ్మగారి మనవడు గురుదత్త మహా గడుగ్గాయి. కొద్దిగా ఈ మధ్యనే నడక వచ్చింది. దాంతో ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. పొద్దున్న లేవగానే సీతమ్మగారి కోడలు సీతాలక్ష్మి పొందికగా మంచం మీద దుప్పటి చక్కగా సరిచేస్తుంది. ఆవిడ స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి పడకగదిలోకి వచ్చేసరికి మంచం మీద దుప్పటి నేల మీద పారాడుతూ వుంటుంది. తల […]

గోడమీద బొమ్మ

రచన: చెంగల్వల కామేశ్వరి సాయంత్రపు సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి ఆకాశపు నీలాన్ని కాజేసినట్లుగా, నీలపురాశిలా మెరిపోతోంది. వేగంగా తెల్లని నురుగులుతో ఒడ్డుకి కెరటాలని తోస్తోంది. అంతే నెమ్మదిగా వెన్నక్కి వెళ్లిపోతోంది. ఇసకలో కాళ్లు కూరుకుపోతుంటే చేతుల్లో బరువయిన సంచీ అతికష్టం మీద మోసుకు వస్తూన్న పరమేశానికి ఆయాసం ఎగతన్నుతోంది. నడవలేక నడవలేక నడుస్తున్న పరమేశాన్ని చూసి పరుగులు తీస్తూ సముద్రం వైపు వెడుతున్న ఒక అబ్బాయి. “తాతా బ్యాగ్ బరువుగా ఉందా ఇలా ఇవ్వు నేను తెస్తా!” […]

పాలమనసులు

రచన: కొత్తపల్లి ఉదయబాబు అది నగరంలోని ప్రసిద్ధమైన కార్పొరేట్ పాఠశాల మెయిన్ బ్రాంచ్. ఎలిమెంటరీ సెక్షన్స్ వన్ టు ఫైవ్ క్లాసెస్ ఉన్న బ్లాక్ లోని పేరెంట్ విజిటర్స్ రూంలో ప్రిన్సిపాల్ గారి కోసం నిరీక్షిస్తున్నాయి రెండు జంటలు తమ పిల్లలతో. ఒక పక్క ఆఫీసుకు టైం అవుతోంది. రఘువరన్ అసహనంగా భార్యకేసి చూసాడు. యూనిఫామ్ లో ఉన్న ఐశ్వర్య తల్లి చెయ్యి పట్టుకుని ధీమాగా కూర్చుంది. చరణ్ కూడా తనభార్య ప్రశాంతి తో అక్కడే కూర్చున్నాడు. […]