April 27, 2024

అర్జునుడు

రచన: శ్యామసుందరరావు

మహాభారతం లోని అతిరధ మహారధులలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు
కురుక్షేత్ర సంగ్రామములో కీలక పాత్ర వహించి సాక్షాత్తు శ్రీ కృష్ణ
భగవానుని ద్వారా గీతోపదేశము పొందినవాడు అర్జునుడు కుంతికి ఇంద్రుని వరము
వల్ల జన్మించిన వాడు అర్జునుడు శ్రీకృష్ణుని సాంగ్యత ము వలన ఇద్దరి జోడి
నర నారాయణులుగా ప్రసిద్ధి చెందింది అర్జునికి గురువు మార్గదర్శి
నిర్దేశకుడు అన్ని శ్రీ కృష్ణ భగవానుడే అందుచేతనే కురుక్షేత్ర
సంగ్రామానికి ముండు శ్రీ కృష్ణుడు అస్త్ర శస్త్రాలు ముట్టను యుద్ధము
చేయను అని చెప్పినా సాక్షాత్తు భగవంతుడు తన వెంట ఉంటె చాలు అని నమ్మిన
జ్ఞానీ అర్జునుడు అంతే కాకుండా అమోఘమైన శక్తులు గల అస్త్రాలను దేవతలను
మెప్పించి పొందినవాడు అర్జునుడు అర్జునుడికి గల ఏకాగ్రత దీక్ష పట్టుదల
వల్ల ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుడు అవగలిగాడు ద్రోణాచార్యుని
గురుకులములో శిక్షణ పొంది అతిరధుడు హోదా పొందిన వ్యక్తి అర్జునుడు ఒక్కడే
ఒకసారి గురువు ద్రోణాచార్యుడు శిష్యులతో గంగా నదిలో స్నానము చేస్తుండగా
ఒక మొసలి ద్రోణాచార్యుని పట్టుకుంటుంది స్వతహాగా విడిపించుకోగల శక్తి
ఉన్నప్పటికీ ద్రోణాచార్యుడు శిష్యుల శక్తి సామర్ధ్యాలను పరీక్షించ దలచాడు
అప్పుడు శిష్యులంతా బిత్తర పోయి చూస్తుంటే అర్జునుడు మొసలి నుంచి
గురువుగారిని విడిపించాడు అందువల్లే సంతుష్టుడైన గురువు గారు అర్జునికి
శక్తి వంతమైన బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాడు ఆ విధముగా ద్రోణాచార్యుని
శిష్యులలో అటువంటి అస్త్రాన్ని నేర్చుకున్న మొదటివాడు
అర్జునుడే.చిన్నప్పటినుంచి అర్జునుడు తన ఇంద్రియాలను పూర్తిగా తన
అధీనములో ఉంచుకొని అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకున్నాడు
ధనుర్విద్యలో ద్రోణాచార్యుడు కాకుండా ఎనిమిది రకాల విద్యలు నేర్చుకున్న
యోధుడు అర్జునుడు ఒక్కడే ద్రోణాచార్యుడు కాకుండా బ్రహ్మ కూడా అర్జునికి
విలువిద్యలో గురువే అర్జునుడు పరమశివుని నుండి రౌద్రాస్త్ర ,వరుణుడి నుడి
వరుణాస్త్ర ,ఆగ్ని దేవుడి నుండి ఆగ్నేయాస్త్రాన్ని, వాయుదేవుడి నుండి
వాయవ్యాస్త్రాన్ని ఇంద్రుని నుండి ఇతర అస్త్రాలను పొందాడు.అర్జునుడి
దగ్గర ఉన్న అన్నిటికన్నా పెద్ద శక్తి వంతమైన అస్త్రము సాక్షాత్తు శ్రీ
కృష్ణ పరమాత్ముడే. ఈ విధముగా అర్జునుడినికి విలువిద్య లో ఎవరు సాటి రారు
ద్రౌపది స్వయం వరము లో అర్జునుడు మత్స యంత్రాన్ని ఛేదించటం ద్వారా ఈ
విషయము ఋజువైంది కర్ణుని తో సహా ఇతరులెవ్వరు తీగను ధనుస్సు కు తగిలించ
లేక పోయినారు
అర్జునుడు వేరు వేరు సందర్భాలలో గంధర్వులను సైతము ఓడించాడు ఖాండవ దహనము
సందర్భముగా అగ్ని దేవుని తృప్తి పరచాడు ఖాండవ దహనము సందర్భముగా ఇతర
దేవతలను జయించి చివరకు ఇంద్రునితో తలపడి ఇంద్రుని జయిస్తాడు.
దుర్యోధనునికి గంధర్వులకు యుద్ధము జరిగి గంధర్వులు దుర్యోధనుని బంధించి
తీసుకు వెళు తున్న ప్పుడు కర్ణుడు ఇతర కౌరవ సేన దుర్యోధనుని
విడిపించాలని ప్రయత్నించి గంధర్వుల చేతిలో ఓడిపోయినప్పుడు అర్జునుడు వారి
సహాయానికి వచ్చి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి గంధర్వ రాజైన చిత్ర సేనుని
నుండి దుర్యోధనుడిని ఇతర కౌరవ ప్రముఖులను గంధర్వుల చెర నుండి
విడిపిస్తాడు చిత్రసేనుడు కూడా అర్జుని యుద్ధ కౌశల్యానికి ప్రతిభకు
సంతోషపడతాడు.
పరమశివుడు అర్జుని యుద్ధ కౌశల్యాన్ని పరీక్షించటానికి ఒక
కిరాతకుని(వేటగాడు) వేషములో వచ్చి అర్జునినితో యుద్ధము చేసి అర్జునుని
పరాక్రమానికి సంతోషించి పరమేశ్వరుడు తన వ్యక్తిగత ఆయుధము అయిన పాశుపత
అస్త్రాన్ని ఇస్తాడు అర్జునుడు ఇంద్ర లోకములో కంటికి కనిపించని (దేవతలకు
కూడా కనిపించని) నివత్కవచ దానవులను సంహరిస్తాడు దివ్య నగరమైన హిరణ్యపుర
లో కాలకేయుడు ఇతర రాక్షసులు దేవతలను ఇబ్బంది పెడుతున్నప్పుడు అర్జునుడు
రౌద్రాస్త్రాన్ని ప్రయోగించి వారిని సంహరిస్తాడు.ఈ విధముగా అర్జునుడు దేవ
,గంధర్వ, దానవులను జయించాడు.
కురుక్షేత్ర యద్దానికి ముందుగానే విరాటుని కొలువులో ఉన్నప్పుడు
,అజ్ఞాతవాసము పూర్తి అయినాక ఉత్తర గోగ్రహణ మప్పుడు అర్జునుడు ఒంటరిగా
కౌరవ సేనలోని ప్రముఖులను సైన్యాన్నిఏ విధమైన రక్త పాతము లేకుండా ఓడించి
విరాటుని గోవులను కౌరవ సేన నుండి విడిపిస్తాడు.ఈ యుద్దములో అర్జునిడి
ప్రతిభను భీష్ముడు ప్రశంసిస్తాడు.కురుక్షేత్ర యుద్దములోఅర్జునుడుఅందరిని
చూసి సోదర సమానులైన కౌరవులను ఇతర బంధు మిత్రులను యుద్దములో చంపవలసి
వస్తున్నందుకు తీవ్రమైన మనో వేదన చెందినప్పుడు శ్రీ కృష్ణుడు గీతోపదేశము
చేసి అర్జునిడిని కార్యోనుముఖుడిని చేస్తాడు ఈ విధముగా అర్జునుడి చేతిలో
చాలా మంది కౌరవ ప్రముఖులు అర్జునుడి చేతిలో పరాభవం లేదా మృత్యు వాత
పడినవారే. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామములో కౌరవ సేనలోని ఏడూ
అక్షౌహిణీల సైన్యాన్ని 14 వ రోజు యుద్దములో సంహరించాడు ఆవిధముగా
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి ముఖ్య కారకుడు అయినాడు.
భీష్ముడి పరాక్రమానికి 9 వరోజు జరిగిన యుద్దములో మొత్తము పాండవ సేన
తుడిచి పెట్టుకొని పోయేది ఆ పరిస్థితిలో శ్రీ కృష్ణుడు అస్త్రము పట్టాను
అన్నవాడు కోపోద్రిక్తుడై భీష్ముని మీదకు దాడికి సిద్దమవుతాడు కానీ
అర్జునుడు శ్రీ కృష్ణునికి అడ్డు పడి భీష్మునితో పోరాడి భీముడు,
అభిమన్యుడు, ధర్మరాజు సాత్యకి వంటి యోధులను ప్రాణాలతో కాపాడాడు ఆ
తరువాత10వ రోజు యుద్దములో కృష్ణుని,భీష్ముని సూచనల మేరకు అర్జునుడు
శిఖండిని అడ్డు పెట్టుకొని యుద్ధముచేసి భీష్ముని నెలకొరిగేటట్లు
చేస్తాడు
అంపశయ్యపై ఉన్న భీష్ముని దాహము తీర్చటానికి అర్జునుడు తన అస్త్రాలతో
పాతాళ గంగను రప్పించి భీష్ముని దాహము తీరుస్తాడు 12వ రోజు ఉత్తరాయణ
పుణ్యకాలం ప్రవేశించాక భీష్మ నిర్యాణము జరిగినాక కౌరవ సేన నైతికంగా
ధైర్యాన్ని కోల్పోయింది అప్పుడు పాండవ సేన విజృంభించింది అర్జునుడు
కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్తమా దుర్యోధనుడు, శల్యుడు వంటి యోధులతో
పోరాడాడు. 14 వ రోజు యుద్దములో ద్రౌపదిని అపహరించటానికి ప్రత్నించిన
జయద్రత్తుని సంహరించాడు.
15 వ రోజు యుద్దములో పాండసేననుతుడిచి పెట్టటానికి అశ్వత్తమా
ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కానీ ఆ అస్త్రాన్ని అర్జునుడు
సమర్ధవంతముగా ఎదుర్కొని పాండవ సేనను కాపాడుతాడు 17 వ రోజు యుద్ధములో
అర్జునిని చేతిలో కర్ణుడు చనిపోవటంతోకురుక్షేత్ర యద్దము ఇంచుమించుగా
ముగిసింది అనుకోవచ్చు.ఆ తరువాత అశ్వత్తమా తనతండ్రిని ధర్మరాజుతో అబద్ధము
చెప్పించి చంపారని కోపముతో పాండవులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు
కానీ శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని తప్పించిన ఫలితముగా ఉపపాండవులు ఆ
అస్త్రానికి ఆహుతి అవుతారు అప్పుడు అర్జునుడు అశ్వత్తమా ను బంది చేసి
ద్రౌపది ముందు పడవేస్తే ద్రౌపది పెద్ద మనస్సుతో క్షమిస్తుంది కానీ శ్రీ
కృష్ణుడు అశ్వత్తామను శపిస్తాడు.
కురుషేత్ర సంగ్రామము అనంతరము కృష్ణ నిర్యాణము జరిగినాక అర్జునుడు ఇతర
పాండవులు వాళ్ళ శక్తులను కోల్పోతారు అందరు స్వర్గారోహణ మొదలు పెడతారు ఆ
క్రమములో ముందు ద్రౌపది, ఆతరువాత భీముడు ఆ తరువాత అర్జునుడు పడిపోతారు
చివరకు ధర్మరాజు అతని వెంట అతని ధర్మము స్వర్గాన్ని చేరుతారు
ఈ విధముగా భారతములో అర్జునిని పాత్ర ఆద్యంతమూ ప్రధానమైనది దీనికి కారణము
అతని వెంట ఉండే శ్రీకృష్ణుడు నరనారాయణలుగా అర్జునుడు ప్రతి సందర్భములో తన
శక్తి కన్నా శ్రీకృష్ణుని సలహాల మేరకు ప్రవర్తిస్తూ విజయాన్ని
పొందగలిగాడు దైవబలము ముంది ఏ బలము సాటి రాదు కదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *