April 26, 2024

అర్చన 2020 – మాతృవేదన

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి

పాకావని పాయసం చేసా, నవ్వావని నువ్వుండలు వండా
గడప దాటితే గారెలు, అడుగులేస్తే అరిసెలు
నీ ప్రతి చర్యా ఒక పండగ చేసా.
కాని నువ్వేమి చేసావ్?
నడవ లేక నే పడిఉంటె . నవ్వుతూ నడిచి పోయావు
ఓపికలేక నేనుంటే. విలాసముగా విడిచి వెళ్ళావు
పళ్ళులేక ఆకలి తీరక నేనుంటే
పంచభక్ష్యాలు పసందుగా ఆరగించావు
నీ ప్రతిచర్యా నే పండగ చేస్తే
నే చెయ్యలేని ప్రతి పని. నువ్వు హేళన చేసావు
పున్నామ నరకం తప్పిస్తావనుకుంటే
బ్రతుకే ఒక ప్రత్యక్ష నరకం చేసావు
ఇందుకేనా బిడ్డలను కనేది
ప్రేమతో గోరుముద్దలు తినిపించేది
అందలాలు ఎక్కిoచక్కరలేదు .
పట్టుపీతాంబరాలు కట్టించక్కరలేదు
పట్టేడన్నము పెట్టి. ప్రేమగా చూస్తే
అదే పదివేలు. పంచభక్ష పరమాన్నాలు
అని వాపోతున్నారు కొందరు వృద్ధ మాతల,వ్రుద్దాశ్రమములో
వారి బాధను తీర్చి, అక్కున చేర్చుకునేవారే
నిజమైన బిడ్డలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *