రచన: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

తెలంగాణ మాటలను తూటాలుగా పేలుస్తూ
అవినీతిపై అక్షరాయుధాలను సంధించినవాడు
అధర్మంపై న్యాయపోరాటం చేసినవాడు కాళోజీ

కవితలతో నిరంతరం అక్షరయుద్ధం చేస్తూనే
ప్రజలను కవితాశక్తితో చైతన్యవంతం చేసినవాడు
నడుస్తున్న చరిత్రకు సాక్షీభూతం కాళోజీ నా గొడవ

అణిచివేతలను అన్యాయాలను సదా నిరసించి
సామాజిక మార్పుకోసం పాటుపడినవాడు
సమాజ ప్రగతికోరిన అభ్యుదయవాది కాళోజీ

సామాన్యుల ఆక్రందనలకు తిరుగులేని గొంతుకై
ఆపన్నహస్తంలా వారిని ఆలింగనం చేసుకున్నవాడు
సామాన్యప్రజలకు ఉద్యమగొంతుకైనవాడు కాళోజీ

నిజాం వ్యతిరేక పోరాటంలో ముందుకు నడుస్తూ
నిరంకుశ పరిపాలనపై నిప్పుల కొలిమైనవాడు
తెలంగాణ తొలిపోరాటానికి ఉద్యమదీప్తి కాళోజీ

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *