April 26, 2024

గిలకమ్మ కతలు – నడిసెల్లేదారి

రచన: కన్నెగంటి అనసూయ భుజానున్న సంచిని మొయ్యలేక మొయ్యలేక మోత్తా..పరిగెత్తుకుంటా వచ్చేసేడు శీను బళ్ళోంచి. సందలడే యేల సరోజ్ని బయటే అరుగు మీద కూకుని సేట్లో పోసి తెచ్చుకున్న బియ్యంలో మట్టిబెడ్డలుంటే ఏరతందేవో..ఎవరా వగురుత్తున్నారని తలెత్తి సూసేతలికి శీను.. దాంతో.. “ ఏటా పరిగెత్తుకొత్తం? ఏం కొంపలంటుకుపోతన్నయ్యనీ..! గొప్పదగిలి ఎక్కడన్నా పడితేనో..” అంటా ఇసుక్కుంది..కొడుకెనక్కే సూత్తా.. శీనగాడా మాటలెయ్యీ లెక్కసెయ్యనట్టు.. ఎంత పరిగెత్తుకొచ్చేడో అంతిసురుగానూ పుస్తకాల సంచి అరుగుమీదడేసి..ఆళ్ళమ్మ దగ్గరకంటా వచ్చేసి రాస్కున్నిలబడి.. “ అమ్మా..మరే…మరి అక్క…” […]