March 31, 2023

తపస్సు – గుహలో వెలుగు

రచన: రామా చంద్రమౌళి

ఈ హిమశిఖరంపై.. ఐదువేల అడుగుల ఎత్తులో
వీళ్ళేమి చేస్తారో తెలియదు
ఆకాశంలో అక్కడక్కడా నక్షత్రాలవలె
ఈ అఖండ పర్వత శ్రేణుల ఏటవాలు తలాలపై ఎన్ని కుగ్రామాలో
పదిహేను ఇండ్లు ఒక ఊరు
నాల్గు కుటుంబాలే ఒక గ్రామం
పదిమంది మనుషులే ఒక సమూహం.. ఒక కుటుంబం
తోడుగా ఒక విశాలాకాశం, ఒక పర్వతం, కొంత పచ్చని గడ్డి
నిట్టనిలువుగా లంబరేఖల్లా నిలబడ్డ చెట్లు –
పర్వతం ఉన్నదీ అంటే ప్రక్కన ఒక లోయ ఉన్నట్టే
దుఃఖం ఉన్నదీ అంటే పక్కనే ఎక్కడోఅక్కడ సుఖం పొంచి ఉన్నట్టే
కొన్ని ద్వంద్వాలంతే.. కళ్ళు.. కన్నీళ్ళు
అడుగులు.. బాట – పాట.. తేలిపోతూ దోచుకుపోయే గాలి –

లోయల్లోనుండి .. పొగమంచు మేఘాలౌతూ
మేఘాలు సెలయేళ్లవుతూ
ఒక అనువాద క్రియ.. నిశ్శబ్ద అనునాద ప్రక్రియ
సూర్యుడేమో నదులను వెంటేసుకుని
చిన్న పిల్లాడు కుక్కపిల్లలతో నడుస్తున్నట్టు .. తెగతిరుగుతున్నాడు,
కోనిఫర్‌ చెట్లూ, మేఫుల్‌ వృక్షాలూ
ఆకులతో, గాలితో సంభాషిస్తూనే ఉన్నాయి.. విరామమెరుగని ప్రేమికుల్లా-
భూమి కొండల ఒంటిపై ముడుతలు ముడుతలుగా
మెట్లు మెట్లుగా మట్టి గడ్డకడ్తూ ,
చరియలు చరియలుగా జారుతూ, కూలుతూ
వెంట వర్షధారలతో దూకుతూ,
వర్షాలూ, శీతల వాయు బీభత్సాలూ, వేసవి తాప తప్తతలూ అన్నీ
వెలుగు నీడల్లా.. ఒకటి వెంట ఒకటి
మనిషి .. ఒట్టిగా ప్రకృతి ముందు తలవంచుకుని నిలబడ్డమే
స్వీకరించడమే.. ప్రకృతి దేన్ని ప్రసాదిస్తే దాన్ని –

ప్రతి రాత్రీ చంద్రుడొస్తాడు
హిమాలయ పర్వత గ్రామాలన్నింటినీ గస్తీ కాస్తూ
ప్రతి ఇంటి తలుపునూ తడుతాడు
ఏ ఆశలూ, ఏ కాంక్షలూ, ఏ దుష్టాక్రమణ వ్యూహాలు లేని మనుషులను
ప్రేమతో, వాత్సల్యంతో, నుదుటిపై చుంబించి
మనుషుల నుండి జీవశక్తిని పొంది వెళ్ళిపోతాడు
ఎక్కడికో నగరాల భవనారణ్యాల్లోకి-
అప్పుడు.. ఆ సూర్యాస్తమయ సంధ్యవేళ
నేనక్కడికి వెళ్లాను
ఒక ఒంటరి కోనిఫర్‌ చెట్టును ఆనుకుని అతను
కళ్ళు మూసుకుని మురళిని వాయిస్తున్నాడు
గాలి పరవశిస్తూ అక్కడే ఆగి వింటోంది మధుర గానాన్ని
ముందర.. ఉదయంనుండీ వెంట తిరిగిన మూడు ఆవులు
ఒక కుక్క.. తోకాడిస్తూ.. కళ్ళు మూసుకుని.. ఋషులవలె
నన్ను గమనించి అతను కళ్ళు తెరిచాడు
కళ్ళు ఎంత స్వచ్ఛమో.. వెలుగుతున్న బల్బులవలె
అడిగాను.. నేను ‘‘ ఇక్కడ ఏముంది..ఎందుకుంటున్నారిక్కడ మీరు ‘‘ అని
అతను భ్రుకుటిని ముడిచి చిత్రంగా చూస్తూండగా
అడిగాను మళ్ళీ
‘ నగరాల్లో సుఖాలూ, చదువులూ, ఉద్యోగాలూ, డబ్బూ.. ’
అతనన్నాడు.. ‘ ఇంకా.. ! ’
‘ హోదాలూ, అధికారాలూ, సౌకర్యాలూ ’
నవ్వాడతను.. యోగిలా
అన్నాడు.. మీ దగ్గర ప్రక ృతి లేదుకదా .. ఇక్కడ పర్వతాలూ,
నదులూ, వృక్షాలూ, పక్షులూ, పశువులూ.. మమ్మల్ని చుంబించే
ఒక ఆకాశం ఉండగా.. వాటన్నింటితో మాకేం పని. మనిషి ప్రశాంతంగా జీవించడానికి ఇవే కావాలి
మీదగ్గరున్న వాటితో మాకు పనిలేదు’’ అని
సరిగా అప్పుడే అతని కుక్క వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది
అతను దాని శిరసుపై మృదువుగా స్పర్శించాడు ప్రేమతో
కళ్ళు మూసుకుందది తాదాత్మ్యంతో
ఇన్నాళ్ళూ తెలియని కొత్త రహస్యమేదో అప్పుడే తెలుస్తున్నట్టు
నా లోపలంతా విద్యుత్‌ రaరి
తేరిపార చూస్తే.. అతని వెనుక
మెలమెల్లగా అప్పుడే చీకటి కమ్ముకొస్తూండగా.,
గుహ నిండా ఎర్రగా.. పచ్చగా వెలుగు.. స్వర్ణకాంతి –

(ఆ మధ్య 2016 జూన్‌ ,23,24,25 తేదీలలో ‘ ఉత్తరాఖండ్‌ ’ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న ‘ మధోడ్‌ ’ గ్రామంలో ఈ సకల భౌతిక నగర జీవితాన్ని మరిచి అక్కడి అమాయక పర్వత వాసులతో ముచ్చటించిన స్వానుభవంలోంచి )

Translated by M.V.S. Prasad

Light in the Cave

Five thousand feet above,
on the snow capped mountain top,
like stars in the sky lie
so many hamlets
perched on the gigantic mountain slopes
fifteen homes make village
four families make a habitaion
ten people make a family, or a group.

The vast sky, the hills, green pastures
and the perpendicular trees that peep into the sky,
there’s always a valley beside a hill.
When there’s sorrow, joy is there hiding in the vicinity,
that’s duality.
Eyes and tears
feet, a path and a song,
the drifting breeze,
the mist that lifts out of the valley to become a cloud,
the cloud that dissolves into a stream.

It’s an act of translation
a silent act of transformation,
the Sun wanders with the rivers
like a child with his puppies
conifers and maple trees whisper in the air
like the eternal lovers chatting without a break.

The gnarled mountains
and the step like slopes
from which mud slides and glides along
pounding rains, cold winds and scorching summers
follow each other like light and dark.

Man has to surrender to Mother Nature
and accept whatever She gives.
Every night the moon wanders the Himalayan villages
like a watchman knocking each door,
kissing the innocent people
who have no hopes, nor desire
or any zeal to conquer.

Gathering energy, he leaves
into the concrete jungles beyond
there I went
in the sun-set time
I found him playing the flute
eyes closed.
The mountain breeze stopped by
to hear this melodious music.
There were three cows and a dog
In front of him
meditating like sages.
Noticing my presence, he opened his eyes,
his eyes bright, like a glowing light!
I ask him, “Why are you here? What’s there for you?
In cities, there’s comfort, education, jobs and money”
“Anything more?” he asked.
“Status, power and luxuries” I replied.
He laughed like a saint and said,
“You don’t have Nature, do you?
When we have these mountains, rivers, trees,
birds, cattle and a sky that bends to kiss us,
why do we need all those luxuries?
These are enough for our peaceful life and
we don’t need what you have.”
Just then, there came a dog, to sit beside him,
he caressed it with love and
it closed its eyes as if in a trance.

A flow of current surged inside me
as if I have discovered some new secret.
When I looked again at him,
I could see a golden glow from inside the cave
driven by the descending dark night.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2021
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031