June 25, 2024

అమ్మాయి వెడలెను

రచన: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం “అమ్మా! క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా సాన్ హొసె పార్క్ లో దీపాలంకరణ చాలా బాగా చేసారుట. వెళ్ళొద్దామా? “అంది బుజ్జి. “అదికాదే రేపటినుండి అంగళ్ళకు తిరగడం మొదలు పెట్టి పిల్లకు కావాల్సినవన్నీ కొని, అవన్నీ సర్ది, దాన్ని తీసుకు వెళ్ళి దిగబెట్టి రావాలి. ఇప్పుడు అంత దూరం చలిలో కారు నడుపుకుని వెళ్ళిరావడం,పైగా ఈ కరోనా సమయంలో అవసరమా?” అన్నారు మంగమ్మగారు. బుజ్జి గలగలా నవ్వింది. “నాకు తెలుసు అమ్మా. బయటకు వెళ్ళాలి […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2021 సంచికకు స్వాగతం..

  Jyothivalaboju Chief Editor and Content Head స్వాగతం.. సుస్వాగతం అని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి అప్పుడే నెల దాటిపోయింది కదా.. గత సంవత్సరం మొత్తాన్ని కరోనా కబ్జా చేసేసింది. ఈ సంవత్సరం వాక్సిన్ వచ్చిందనే శుభవార్త, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే వార్త మనందరికీ ఒక ఆశావహ దృక్ఫదాన్ని కలిగించాయి. అదేవిధంగా మళ్లీ ఏ కొత్త ముప్పు వస్తుందో అన్న భయం కూడా ఉంది అందరికీ.. ఈ ఆపదకాలంలో మనం నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకుని […]

తామసి 4

రచన: మాలతి దేచిరాజు “అసలు సీమాతో మీరు ఎప్పుడు,ఎలా ప్రేమలో పడ్డారో చెప్తారా?” రుద్రాక్ష్ అడిగిన ప్రశ్నకి తన దగ్గర సమాధానం ఉంది.కానీ అది నమ్మశక్యంగా ఉండదని అతనికి తెలుసు. బట్ అదే నిజం అని కూడా తనకి తెలుసు. “నవల రాసేటప్పుడు ఆ పాత్ర కి బాగా కనెక్ట్ అయ్యాను…అలా క్రమేపి సీమా మీద ఇష్టం ఏర్పడింది.చివరికది ప్రేమగా మారింది.” చెప్పాడు. ఫక్కున నవ్వాడు రుద్రాక్ష్..నవ్వుతున్నాడు..ఇంకా..ఇంకా.నవ్వుతూనే ఉన్నాడు. గాంధీకి కోపం వస్తోంది కానీ చూపించలేడు. “ఎందుకు […]

చంద్రోదయం 12

రచన: మన్నెం శారద సిగ్గు మొగ్గలేస్తున్న ఆమె కళ్లలో.. మెరుస్తోన్న మెరుపు… ఎర్రబడుతోన్న చెక్కిళ్ళు.. మెల్లగా క్రిందికి వాలిపోతున్న చూపులు. సారధి నిలువునా నీరుకారిపోతున్నాడు. గొంతు తడారిపోతోంది. ఏదో దారుణం జరిగిపోతోన్న అనుభూతి.. నిలువునా తనని హత్య చేస్తోన్నట్టుగా భ్రాంతి. అతని మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. అచేతనంగా కూర్చుండిపోయాడు. “అమ్మాయి పేరు స్వాతి. బి.ఏ. ఫైనల్ పరీక్షలు రాసింది.” మాస్టారు గొంతు వినబడింది. ఒక్కో అక్షరం ఒక్కో కొరడా దెబ్బలా తగులుతోంది సారధికి. “ఇక […]

అమ్మమ్మ -22

రచన: గిరిజ పీసపాటి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అమ్మమ్మ ఎదురింటావిడ అడిగిన ప్రశ్నకు జవాబుగా “నాగకు సీమంతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చానని, పువ్వులు, గాజులు మొదలగునవి తేవడానికి ఎవరికీ తీరుబాటు లేదంటున్నార”ని చెప్పింది. అందుకావిడ “ఈ మాత్రానికే దిగులు పడతారెందుకు అక్కయ్యగారూ! నాగను ఎప్పుడూ మా ఇంటి పెద్ద కూతురిలాగే భావిస్తాం. మా పిల్లలు కూడా నాగను సొంత తోబుట్టువులాగే చూస్తారు. కాకపోతే మీ మరిదిగారు బడిపంతులు కావడం, ఐదుగురు సంతానం […]

రాజీపడిన బంధం. 12

రచన: ఉమాభారతి అందరితో నమ్రతగా మెలిగే శ్యాంలో ‘జెంటిల్మెన్’ నైజం ఓ ప్రక్క, పైశాచిక ప్రవర్తనతో నన్ను బాధిస్తున్న తీరు మరో ప్రక్క… నన్ను నిత్యం ఆలోచింపజేస్తుంది. ఆ ఆలోచనే నన్ను, యూనివర్సిటీ వారి ‘ఆన్-లైన్ డిగ్రీ-కాలేజ్’ – దిశగా నడిపించింది. నాకున్న బి. ఎస్. సి డిగ్రీ నేపథ్యంలో, నేరుగా ‘హ్యూమన్ సైకాలేజీ ‘ కాలేజ్ కోర్సులు తీసుకొంటున్నాను. కేవలం నా వ్యక్తిగత ఆసక్తి తోనే, ఆరు నెల్లగా అలా చదువు సాగిస్తున్నాను. ఎంత సమయం […]

శిశుపాలుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. శిశుపాలుడు కృష్ణునికి మేనత్త కొడుకు. అంటే ఈయన తల్లి కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుని సోదరి శ్రుతదేవి, ధర్మఘోషుని భార్య. సంస్కృతములో శిశుపాల అనే మాటకు అర్ధము శిశువులను సంరక్షించేవాడు. శిశుపాలుడు, అతని మేనమామ దంతవక్రుడు పూర్వము శ్రీమహావిష్ణువు వైకుంఠ ద్వారాల వద్ద ద్వారపాలకులుగా ఉండి ముని శాపము వల్ల మానవజన్మ ఎత్తి శ్రీ మహా విష్ణువుతో వైరము వహించి అయన చేతిలో […]

అలిశెట్టి ప్రభాకర్ ని గుర్తుచేసిన ‘ శిథిల స్వప్నం ‘

సమీక్షురాలు యడవల్లి శైలజ ( ప్రేమ్) అనాగరిక సమాజం నుండి నాగరిక సమాజంలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలైన ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు మనుషుల్లో అంతరాల తేడాలు, అంతస్తుల తేడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వర్గ సమాజాలు, వర్ణ సమాజాలు మనుషులను, మనుషులు గా గుర్తించిన దాఖలాలు లేవు అటువంటి వర్గ, వర్ణ తారతమ్యాలు ఎదుర్కొన్న వాళ్ళలో రాజ్యాంగ నిర్మాత Dr. BR అంబేద్కర్, మహాత్మ గాంధీ, నెల్సన్ మండేలా ఉన్నారు. ‘ శిథిల […]

కంభంపాటి కథలు – నీచు

రచన: రవీంద్ర కంభంపాటి వేప, నేరేడు, ఉసిరి, సపోటా చెట్లు, అక్కడక్కడా బాదం చెట్లు, కనకాంబరాలు, సన్నజాజి తీవెలు, మల్లె పొదలు, బెండకాయ, బీరకాయపాదులు. ఓ అందమైన వనంలా ఉంది . అందులో బాగా పెద్దగా ఉన్న వేప చెట్టు కింద కట్టిన చప్టా మీద, అన్నయ్యలతో అష్టా చమ్మా ఆడుకుంటూ తను. చిన్నన్న ఏదో జోకేసేడు.. ఒక్కసారి గవ్వలు వదిలేసి మరీ నవ్వేను, వాడంతే. ఎప్పుడూ అలా జోకులేస్తూ నవ్విస్తూంటాడు . దూరం నుంచి అమ్మ […]