February 21, 2024

పడతీ! ఎవరు నీవు??

రచన: ఉమా వెంకట్

ఓ స్త్రీ నువ్వు మహిళగా ఓ కూతురిగా, అమ్మగా, తోబుట్టువుగా, భార్యగా, ప్రేయసిగా, స్నేహితురాలిగా అత్తగా, చెల్లిగా ఇలా అన్ని రూపాలు ఉన్న ఓ వనిత….
మహిళ గా నువ్వు ఎంతో చేయగలవు కానీ నువ్వు ఒక ఆడపిల్ల అని సమాజం గుర్తుచేస్తుంది, వెనుకకి లాగడానికి ముందు ఉంటుంది, కారణం సమాజంలో ఉన్న చీడ పురుగుల వల్ల ఆడదాని ఔనత్యాన్ని చాటి చెప్పే అవకాశం రాకముందే ఆడపిల్ల ఒకరికి భార్య గా మరొకరికి కోడలు ఇంకొకరికి తోడికోడలు ఇలా ఎన్నో పాత్రలు పోషించడానికి సిద్ధంకా అంటూ ప్రతి నిమిషం వెన్నంటే ఉంది తరుముతుంది. ఆడపిల్ల పుడితే అమ్మో అనో లేక వారసత్వం పోతుంది అనో ఆలోచనతో ఉన్న సమాజం ఏనాడో పోయింది…ఆడపిల్ల ప్రస్తుత కాలంలో మగవారికి సమానంగా అభివృద్ధికి తోడ్పడుతుంది…
కూతురిగా నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించాలని నువ్వు ఎంతో ధైర్యం కూడగట్టుకొని నీవంతు ప్రయత్నం చేస్తున్నా ఓ వనిత…నువ్వు తలుచుకుంటే మగవాడి కన్న వంద రెట్లు ఎక్కువగా శ్రమించగలవు…. తల్లిదండ్రులు నీ తమ్మ కొడుకులు వారిని ఎంత వరకు హింస పెట్టకుండ చూసుకోగలరు తెలీదు కానీ ఆడపిల్ల మాత్రం శ్రమించే తండ్రిని చూసి పట్టుదల పెంచుకుంటుంది…. కష్టంలో ఉన్న తల్లిని చూసి కృషి తో అనుకున్నది సాధించడానికి ఎంత కష్ఠాని అయిన ఇష్టంగా మార్చుకుని శ్రమిస్తుంది…. . ఆర్థిక ఇబ్బందులు ఎదుటి వారి కంట పడకుండా పరిస్థితులుని చాకిచక్యంగా సర్దుమణుగు అయ్యేలా కాలం వెళ్లదీస్తుంది…. ఏది ఉన్న లేకున్నా పరిస్థితి బాగున్నా లేకున్నా తిన్న తినకపోయినా వంటి మీద ఉన్న దుస్తులు నుండి ఇంట్లో ఉపయోగించే వస్తువులు వరకు అంత శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది…నలుగురు ఆడది ఆ ఒక్కదానికే పనికొస్తుంది అని చూసే చూపులుకి ఆడపిల్లని తక్కువ అంచనా వేసే వారికి సమాధానం ఒక్కటే స్త్రీ తలుచుకుంటే అసాధ్యం అనే పదంని సుసాధ్యంగా మార్చి చూపిస్తుంది…. .
భార్యగా ఓ స్త్రీ ఒక కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు తన భర్తని అత్తమామలను ఆడపడుచులుని ఇలా ఇంటిల్లపాదిని తన రాకతో ఆనందపెడుతుంది. ఆడపిల్ల పుట్టింటిని వదిలి అత్తారింటికి వచ్చేటపుడు తాను తెచ్చే కట్నకానుకలు కోసమో లేక సొమ్ము కోసమో అత్త ఇల్లు ఎదురు చూడట్లేదు కేవలం తన వల్ల వచ్చే గౌరవం, కట్టుబాట్లు, సంప్రదాయం, ఆనందాలు, పుట్టింటి సంప్రదాయాలని అత్త ఇంటి గౌరవాన్ని కాపాడగలిగే ఔనత్యాన్ని, తను నడుచుకునే విధానం, బంధాలు బంధుత్వాలకి విలువని లెక్కిస్తుంద లేక, లెక్కలేనట్టు తీసిపారేస్తుంద అన్ని చూసే రోజుల్లో ఈ వనిత తన బాధ్యతని భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించే స్థానంలో ఉండి కూతురిగా అమ్మానాన్నల్ని ఎంత బాగా చూస్కుంటుందో భార్యగా ముఖ పరిచయాలతో పెళ్లి అనే ఆనకట్ట వేసుకుని, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి మనస్తత్వాలను అర్ధంచేసుకుని వాళ్ళకి తగినట్టుగా నడుచుకుంటూ వారి అవసరాలు తీర్చుతూ వారిని ఆనందంగా ఉంచడానికి ఇంటి ఇల్లాలు గా మాత్రమే కాకుండా తల్లిలా సమస్తం తానే ప్రతి నిమిషం ఇష్టంగా శ్రమించే ఇల్లాలుగా ఆమె కష్టాని గడప బయటే అణిచివేస్తుంది అత్తారింట్లో భర్త తిట్టిన అత్తమామలు లేదా ఆడపడుచులు ఇలా ఎవరు ఏమన్నా అంత తనవారే అని ఒక చిన్న చిరునవ్వుతో పక్కకి వెళ్లిపోతుంది. భర్త మంచివాడు అయినా చెడ్డవాడు అయినా భార్య తన్న భర్త బాధ్యతని ప్రేమగానే స్వీకరిస్తుంది కానీ కసాయిలా నిరాకరించడం లేదా నిందించటం చేయదు ఎందుకు అంటారా ఆమె భార్య అవటానికి ముందు ఒక ఆడపిల్ల గనుక. ఆడదాని గొప్ప తనం ముందుగా ముఖ్యంగా తన ఓర్పు సహనంలో కనపడుతుంది, అమ్మవారి చేతిలో త్రిశూలం ఎంతటి పవిత్రమైన ఆయుధమో అలానే ఆడదాని జీవిత ప్రయాణంలో ఓర్పు, సహనం కూడా అంతే సమానంగా ప్రాముఖ్యం కలిగిన ఆయుధాలు. ఈ ఆయుధాలు స్త్రీ వెంట ఉన్నంత వరకు ఎంతటి దుర్మార్గులు అయిన చెడ్డ వారిని అయిన తన ఆయుధాలను ఉపయోగిస్తూ మంచి వైపు నడిపించటానికి సాయిశక్తులా ప్రయత్నిస్తుంది. భర్యగా తాను చేపట్టే పనులు మరియే బంధం లోనూ కనబడవు, కారణం ఆడపిల్ల స్థానం నుండి భర్య స్థానానికి చేరుకుంది గనుక. ఆమె చేసే ప్రతి పనిలోనూ కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లకుండా భర్త పరువుని అత్తమామల పెద్దరికం కాపాడుకునే ప్రయత్నం తప్ప మరో ఆలోచన చేయని మహా అద్భుతమే కోడలు/ భార్య. .
పడతీ, అవని, వనిత, మహిళ, స్త్రీ, ఆడపిల్ల ఇలా ఎన్నో మరి ఎన్నో విధాలుగా ఒకటే అర్దం వచ్చే పిలుపులు పేర్లు అన్ని ఆడదానికి మాత్రమే సొంతం. ఎన్ని రకాలుగా వర్ణించిన తక్కువే సుమీ. మంచిలో అయినా చెడులో అయనా ఆడది చేసే ప్రతి పని వెనుక ఒక కారణం ఉంటుంది, ఒక వేశ్య వద్దకు వెళ్లి ఒక మగాడు పది నిమిషాలు సుఖం కోసం వేలకి వేలు కర్చుపెడతాడు అదే ఆపదలో ఉన్నవారి దగ్గెరకు వేళ్ళి పది రూపాయిలు ఇవ్వటానికి ఎంతో ఆలోచిస్తాడు, కానీ ఇక్కడ ఉన్న వేశ్య కి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఉండే కష్ట నష్టాలు వారిని ఇలాంటి పనులకి లోబడెల చేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చే ఆడపిల్లలు లేదా పెళ్ళాన్ని కాదు అని మరో ఆడదాన్ని వారి జీవితంలోకి ఆహ్వానించే మగవారు వల్ల దిక్కు తోచని పరిస్థితి ఎదురు అయినపుడు ఇలా ఎన్నో కారణాలు వల్ల వారు ఇష్టం లేకున్నా వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి గనుక ఇలాంటి పనులకి పాలుపడుతున్నారు అందుచేతనే అటువంటి దుస్థితి పడుతుంది. వేశ్య అయినప్పటికీ ఆడదే గనుక వేశ్యగా బ్రతికినా మంచి మనసుతో ఉంటుంది. వేశ్య మనసు కూడా తల్లి మనసులా బిడ్డ కోసం పరితపిస్తుంది. ఇక ఆమెకి వేశ్య అనే పేరు తప్ప ఆడదానిగా ఒక అమ్మ మనసుతో ఉన్న వనితలా ఏ ఒక్కరి కంటికి కనపడదు కానీ ఇలా కూడా ఆడది తన ఔనత్యాన్ని చాటి చెప్తుంది.
వదిన, ఆడపడుచు వీరి బంధం ఎంతో ముచ్చటయినది ఎందుకు అంటారా ఆడదానికి తల్లి స్థానం ముందుగా ముఖ్యంగ ఆడపడుచు లేదా మరిది వీరి నుండే కలుగుతుంది తల్లి తర్వాత తల్లిగా భావించే గొప్ప అనుభూతిని కలిగించే వదిన స్థానంలో ఉన్న స్త్రీ యొక్క గొప్ప మనసుకి అది అంకితం. ఓ స్త్రీ నువ్వు ఆడపిల్ల అంటే కూతురు స్థానం నుండి భార్య స్థానంలోకి వచ్చి, భార్య స్థానం నుండి అమ్మ స్థానంలోకి అడగుపెట్టీ, అమ్మ నుండి అత్తగారు స్థానానికి చేర్కుని నాన్నమ్మ/అమ్మమ్మ స్థానానికి వచ్చి విశ్రాంతి తీసుకునే సమయాన మరల ఆమె పసిబిడ్డ అవుతుంది మరో పసికందుతో ఆటలు ఆడటానికి మనసు వురకలేస్తు సిద్ధంగా ఉంటుంది. తల్లిగా స్త్రీ ఎంతో అద్భుతంగా కనబడుతోంది ఎందుకు అంటే బిడ్డలు ఎంత పెద్ద వారు అయినా ఎన్ని తప్పులు చేసిన పోత్తిళల్లో పెంచిన అనుభూతిని మరువలేదు గనుక తిరిగి వారిని కాపాడుకోవటానికి అదే కడుపులో పెట్టుకుని వారిని ఎళ్ల వేళల కాపాడుకునే బాధ్యత కలిగిన స్త్రీ మూర్తి తానే తల్లి భూదేవి. మాతృత్వం యొక్క గొప్ప నీతి ఎంటి అంటే బిడ్డ ఎప్పటికీ పసి బిడ్డే తాను కని పెంచిన బిడ్డ అయిన పెంచిన బిడ్డ అయిన బేధం లేకుండా సమానంగా ప్రేమ పంచగలిగే బంధం తల్లి తోనే ముడి పడియుంటుంది. మహిళల్లో జరిగే మహా పుణ్యకార్యం ఋతుక్రమం. మహిళ లేనిదే ఋతుక్రమం లేదు ఋతుక్రమం లేనిదే తల్లి లేదు తల్లి లేనిదే ప్రపంచమే లేదు అసలు ఆడదాని అవసరానికి పది నిమిషాలు సుఖానికి దారుణంగా చంపే పిశాచాలకి జీవం రుపం జీవితం ఇచ్చేది స్త్రీ మూర్తి అనే ఆలోచన ఒక్క క్షణం అయిన మనసులోకి వస్తే ఆడదాని గొప్ప అదృష్టం మనం దురదృష్టంగా మార్చుతునామ్ అని తెలుసుకుంటారు. ఇలా పిశాచాలు చేతిలో పడి నలిగిపోయి కూడా ఆడది గొప్పగానే చరిత్రలో మిగిలిపోతుంది కారణం దీపం తను కాలుతూ వెలుగుని ఇస్తోంది ఆడది మానసికంగా శారీరకంగా చంపబడుతూ కూడా ఆనందాన్ని ఇచ్చే పోతుంది పిశాచాలు యొక్క పది నిమిషాలు పైశాచిక ఆనందానికి బలియైపోతుంది.
ఆడదాని స్నేహం చాలా అపురూపమైన బహుమతి అది ఇద్దరు లేదా ఎంత మంది మధ్య అయినా ఉండొచ్చు ఒక ఆడ, మగ మధ్య స్నేహం, స్నేహంగా మాత్రమే ఉంటుందా ? తప్పకుండ ఉంటుంది ఒక బామ్మ, మనవడు మధ్య ఒక తాత, మనవరాలు మధ్య ఒక చిన్ననాటి స్నేహితులు లేదా ఎవరు అయిన కావొచ్చు స్నేహం అంటే అది మగ, ఆడ మధ్య అంటే ఎవరో తెలియని మనుషులు మధ్యనే కాదు ఇలాంటి బంధంలో కూడా ఉంటాయి అవి చూసే కళ్ళు ఆస్వాదించే మనసు బట్టి అర్థమవుతుంది. ఎందులో అయిన ఏ బంధంలో అయిన స్త్రీ హస్తం లేనిదే జీవితం, ఈ ప్రపంచం రెండు లేవు ఏదోక రూపంలో వనిత యోక్క సాయం తప్పక అవసరం పడుతుంది అది తల్లిగా లేదా భార్యగా, స్నేహితురాలిగా, ప్రేయసిగా ఏదోక విధంగా ముఖ్య పాత్ర పోషించేది స్త్రీ.
మహిళను చాలా రకాలుగా వర్ణిస్తాం. పార్వతీదేవి, పరమశివుని సగభాగం, అంతటి దేవదేవుడైన మహాశివుడు భార్య మాటను దిక్కరించటం, ఆమె ఒక స్త్రీ గనుక ఏమి చేయలేదు అని హేళన చేయటం కాని వారి కథలో ఎక్కడ వినలేదు, అంతటి శివయ్య మహిళ యొక్క గొప్పతనాన్ని భార్య అయిన పార్వతీదేవి ద్వారా అర్ధనారీశ్వరులుగా తెలియచేశారు. ఒక సర్వసాధారణ మహిళ యొక్క ధైర్యసహసాలు గుర్తించి చిన్న చూపుతో కాకుండా పెద్ద మనసుతో ఆలోచిస్తే స్త్రీ జీవితం యొక్క పరిపూర్ణత అనుభూతిని కలిగిస్తుంది.
వేశ్యగా అయిన తన వృత్తిని గౌరవించడం తన ధ్యేయం. నీతి నిజాయితీతో తన పని తాను చేసుకుంటూపోతుంది అలాంటిది ప్రస్తుత సమాజంలో ఉన్న కుళ్ళుతో పోల్చుకుంటే ఒక వేశ్య జీవితం ఎంతో ఉత్తమం అయినది. ఇలాంటి కుళ్ళు కి కారణం అయిన వారు ఇపటికి అయిన ఆడదాని గొప్ప మనసుని అర్దం చేసుకుని వారిని గుర్తించి అదుపులో ఉంటే కారు చీకట్లలో నలిగిపోతున్న ప్రతి ఆడపిల్ల జీవితము చాటి చెప్పి రాబోయే తరాలకి భుజం తట్టి ధైర్యం వరంగా అందించవచ్చు. అలా అందించగలిగే రోజు స్త్రీ యొక్క జీవితం అందమైన అనుభూతిగా ప్రచురించబడుతుంది…!

1 thought on “పడతీ! ఎవరు నీవు??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *