April 26, 2024

నీ కోసమై నేను

రచన: డా. బాలాజీ దీక్షితులు పి.వి

నీ చూపులు
దూసే బాణలు
నీ పెదవులు
లాగే అయస్కాంతాలు
నీ అందాలు
కాల్చే వలపు కణికలు
నీ వంపులు
కోసే చురకత్తులు
నీపై మేరువులు
రాజేసే రవ్వల కేరింతలు
నీవు నిలువెళ్ళా
కాటేస్తుంటే…..
నేను మూగపోయాను
నేను నీతో మనసు విప్పి
మాట్లడాలనుకున్నా…
నీవు తప్పించుకుపోయావు
నేను నీ గుండెన
నిలిచి పోవాలనుకున్నా
నీవు అమాంతం
అదృశ్యమయ్యావు
కానీ
నీ కోసమై నేను

1 thought on “నీ కోసమై నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *