June 24, 2024

బద్ధకపు అలవాటు.

  రచన: పంతుల ధనలక్ష్మి.   రమేష్ కుకుకుకుకుష్    కురుకురుకురు కుష్ శబ్దం వినగానే లేచి కూర్చుని ఫోనులో టైమ్ చూసాడు.  నాలుగుంపావు అయింది.  ఇప్పటినుండి ఎందుకు కాసేపు పడుకుందాము అనుకున్నాడు. ఈలోపు టింగ్ మని శబ్దం.  వాట్సాప్ లో శుభోదయాలు ప్రారంభం అనుకున్నాడు.  తనకి మంచి మిత్రుడు ఈ మధ్యే రిటైరయ్యేడు. సరే చూద్దామని చూసాడు.  “మనిషికి అన్ని అనర్థాలకి కారణం బద్ధకం. దానిని వదిలించుకుంటే జీవనం చాలా బాగుంటుంది.” అని.  అలా ఒక్కొక్కటీ చదివి […]

“గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

రచన: రమా శాండిల్య గవి అంటే కన్నడలో, ‘గుహ అని అర్థంట!! పాత బెంగుళూర్ లో అతి పురాతన ఆలయం. గవి గంగాధరాలయం. ఈ ఆలయం ఒక కొండ గుహ లోపల ఉన్నది. ఏ మాత్రము మార్పులు చెయ్యకుండా అలాగే కాపాడుతున్న అతి పురాతన ఆలయం ఈ శివాలయం. పైగా ఎన్నో ప్రాముఖ్యతలున్న ఆలయం ఇది. ఈ ఆలయం సూర్య ప్రతిష్ట అని, ఇక్కడ శివుడితో సమానంగా సూర్యుడికి కూడా ఆరాధన జరుగుతోందని ఇక్కడి పూజారులు చెప్పారు. […]

ప్రకృతి మాత

రచన: లక్ష్మీ ఏలూరి ఎవరు సారె పెట్టారమ్మా ? పుడమి తల్లికి పచ్చలకోక। అమ్మ బిడ్డలకు ఆనందమాయా। కళకళలాడుతున్న అమ్మ ముఖబింబం కాంచి। ఆర్ణవంకి ఎవరు నేర్పారమ్మా? తను పరిశుభ్రంగా ఉండి, తనలోని, జీవజాలాన్ని పదికాలాలపాటు పదిలంగా ఉంచమని। తనమీద పదేపదే తిరిగే నౌకలకు, చెత్తాచెదారం, కాలుష్యభూతాన్నివదిలి, తనకూ,తనలోని జీవజాల మనుగడకు, ఆటంకం కలిగించవద్దని చేతులు జోడించి, వేడుకుంటుంది। పచ్చల పందిరేసి, తనతో మనుగడ సాగించే పులుగూ, పుట్రకూ స్వేచ్ఛగా, జీవించనీయమని , చేతులెత్తి వేడుకుంటూ, ఆ […]

అవును.. గాలిమేడలే.. అయితేనేమి..?

రచన: ముక్కమల్ల ధరిత్రిదేవి ఊహలకు రెక్కలొచ్చి ఊసులు వేనవేలు ఎగసి ఎగసి నింగిని చేరి కడతాయి మేడలు… గాలి మేడలు ! పునాదులే లేని ఊహాజనితపు కట్టడాలు! అంతులేని భావవీచికలు అందంగా మలిచి ఆశల తోరణాలతో అలంకరించిన ఆకాశహర్మ్యాలు !! అవును… అవి కలలే.. గాలిలో మేడలే ! నిజాలై కళ్లెదురుగా ఎన్నటికీ నిలవని వాస్తవ దూరాలే ! ఆ కలలన్నీ కల్లలే… ఎప్పటికీ కలలే ! తెలిసినా మారాం చేస్తూ మది వినదే ! ప్రతీసారీ […]

మకరద్వజుడు

రచన: శ్యామసుందర రావు హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారి అని భక్తులు విశ్వసిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఉదంతము రామాయణములో ఒక ఆసక్తికరమైన వృత్తాంతము. ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. […]