April 27, 2024

జగన్మాత

రచన: ప్రకాశలక్ష్మి

అక్రరమాలలోని మొదటి అక్షరం”అ”.
అ అంటే అమ్మేగా మరి।
ఆదికి,అనాదికి మూలం అమ్మ।

సమస్త సృష్టికి మాతృరూపం అమ్మ।
ధరణి పైన నడయాడే దేవత అమ్మ।
దుష్ట శిక్షణ , శిష్టరక్షణ చేసి,
సమస్త మానవాళికి రక్షణ ఇచ్చేది అమ్మ।

అమ్మ ప్రేమ అమృతం,అదేకదా ..మనకు ఆధారం
పాల సంద్రం లో పుట్టిన క్షీరాబ్ధి కన్యక అమ్మ।
సృష్టి స్థితి లయ కారిణి అమ్మ।
ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత

ఆషాడమాసం బోనాలజాతరలు,
శ్రావణమాస లక్ష్మీ పూజలు,
బతుకమ్మలు,దసరా నవరాత్రులు,
దీపావళి అమావాస్య లక్ష్మీపూజలలో,
మహిళ ల వదనాలలో లక్ష్మి కళలుగా,
అంతట తానై నిలిచి, జలంలో,
తైలంలో,ప్రకృతిలో, చెట్టూచేమలో,
సర్వం తానే అని తెలిపే జగన్మాతా,
నీకు నా నమస్సులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *