April 28, 2024

బాలమాలిక కథ – అడవిలో ఉగాది

రచన: కోనే నాగ వెంకట ఆంజనేయులు     ఉగాది పండుగ రోజు. ఊళ్ళో ఇల్లిల్లూ తిరిగే కాకి ఉదయాన్నే  అడవిలో జంతువులన్నిoటినీ మామిడి చెట్టు క్రింద సమావేశ పరిచింది. ఈ అత్యవసర సమావేశం దేనికో అర్థం కాని జంతువులన్నీ కాకి చెప్పే విషయం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగేయి. కాకి గొంతు సవరించుకుంది. జంతువులన్నీ చెవులు రిక్కించాయి. “సోదరులారా! ఈరోజు ఉగాది పండుగ. ఊళ్ళో మనుషులందరూ ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే […]

సృజనాత్మక చిత్ర కవిత్వమే నేరెళ్ల సృజనోదయం

పుస్తక సమీక్షకులు: రాథోడ్ శ్రావణ్ తెలుగు సాహిత్యంలో సృజనాత్మకతకు సంబంధించిన చిత్ర కవిత్వాలు పుస్తకాల రూపంలో రావడం చాలా అరుదు. తెలిసిన ఒక పనిని తెలిసినట్టు చేయడం తెలివైన పని అనొచ్చు , కాని అదే పనిని కొత్త కోణంలో పాఠకులకు, పుస్తక పఠన అభిమానులకు, కవులకు, రచయితలకు మరింత మెరుగ్గా, వేగంగా, సమర్థవంతంగా చేయటం అనేది సృజనాత్మకత. అదే సృజనాత్మకతకు మారు పేరు కవి నేరెళ్ల రంగాచార్య. ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులైన […]

విరించినై విరచించితిని – మంజుల ఘట్టమనేని

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి “నటించాలనే తపన చిన్నప్పటి నుండి వుంది” -‘షో’ మంజులతో ఇంటర్వూ చెవులు హోరెత్తే సంగీతం తోటి, అర్థం చేసుకున్నా వినిపించని సాహిత్యంతో వుండే పాటలతోటి, హింసాయుతమైన ఫైటింగ్లు, వెకిలిచేష్టలు, ద్వంద్వార్థాల హాస్యం, అర్ధనగ్న దృశ్యాలు, కలిగించే ప్రేమ సన్నివేశాలు – ఇవీ ఇప్పటి సగటు సినిమా ప్రాథమిక సూత్రాలు. వెర్రితలలు వేసే ప్రేమ సినిమాలతో విసిగెత్తిన తరుణంలో పన్నీటి జల్లులా ఇంటిల్లిపాది వెళ్ళి చూసేందుకు అనువుగా, పాటలు, ఫైట్లు లేకుండా అవసరమైనంత వరకే […]

మహిళలు – మారని గతులు

రచన: శ్రీ పేరి బాలగా కన్న వారి మురిపెంను పొందినా కుమారిగా కుర్రకారుకి హుషారు తెప్పించినా చెలిగా చెలుని చేరి చెంగల్వల చెండుగా మురిసినా భార్యగా బతుకు బాధ్యతలు మోసినా గంటె తిప్పి శాకపాకాలకు చవులు తెచ్చినా నెలతగా నెల తప్పి నెల బాలుడిని సాకినా అమ్మగా లాలించి పాలిచ్చి పాలించినా ముదితల్ నేర్వగారని విద్యలు లేవనిపించినా అతివగా అంతరిక్షాన విజయబావుట ఎగురవేసినా ధీర వనితగా కదన రంగాన కాలు దువ్వినా ఇంతిగా ఇంట బయట కీర్తిని […]

శిశిరం

రచన: ప్రకాశ లక్ష్మి తరలి రాదా తనే వసంతం, శిశిరం తర్వాత  కొంగొత్త ఆశలతో, నూతన జీవనానికీ ఊపిరి పోసుకొని, అదే కదా సహజ గమ్యం. ఇదే కదా..! మన జీవన మార్గం. కొన్ని రోజులు బాల్యం, కొన్ని రోజులు యవ్వనం, మరికొన్ని రోజులు వృద్దాప్యం, ఇదే కదా మన జీవన శిశిరం. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెలుగు, అమావాస్య నిశి వెంట పౌర్ణమి శశి రాదా, కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు ఖేదం, ఇదే […]