April 27, 2024

అందాల రంగుల హరివిల్లు

రచన: లక్ష్మీ ఏలూరి

అందాలండీ…!! ఆనంద రాగ రంజిత వర్ణాలు,
పాపాయి పుట్టిన రోజు చైత్ర మాస ఫుష్పరాగం,
ఆమె బుడి బుడి నడకల చిరు మువ్వలసడి,
వైశాఖ మాస కళ్యాణ పసుపు కుంకుమ శోభ.

ఆ బంగారు తల్లి మాట మాఘమాస మల్లెసుమం,
ఆ అందాల సుందరి నవ్వులు కోకిలమ్మ కూజితాలు,
పాపాయి ఆకుపచ్చ పట్టుపావడ లో శ్రావణలక్ష్మి శోభ,
యుక్తవయస్సులో ఆశ్వయుజ మాస నవరాత్రి శోభ,

నవవధువుగా కార్తీక మాస దీప లక్ష్మీ శోభ,
మాతృమూర్తిగా నిండుగా కదలి వచ్చిన పౌష్యలక్ష్మీ, శోభ,
ఇల్లాలిగా, మాతృమూర్తిగా, గృహలక్ష్మిగా
మార్గశిర మాస ఆరాధనా శోభ,

సకలకళానిధిగా ,ఆపధబాంధవిగా,అపరకాళిగా
అనేక పాత్రలలో అవలీలగా ఒదిగే,
ఇంటికి దీపం,మింటిలోని రంగుల హరివిల్లు.
సకల ఋతువుల సమాహారం స్త్రీ శక్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *