April 28, 2024

ఊహల హరివిల్లు

రచన: అనుపమ పిల్లారిసెట్టి

మనస్సు ఉప్పొంగింది…
గుండెల్లో గుబాళింపు చెలరేగింది.
కళ్ళల్లో చిలిపితనం తొంగి చూసింది,
కొంటె పనులు చేసి కవ్వించమంది.
యవ్వనం పంచ వన్నెల చిలుకయ్యింది…
పమిట ఎదపై నిలవనంటున్నది.
పెదవులు పదే పదే నీ పేరే పలుకుతున్నవి,
గొంతులో కోయిల కుహూ కుహూ అంటున్నది.
నాగులాంటి వాలుజడ నడుమును చుట్టింది.
చేతి వేళ్ళు ముద్రలు వేస్తుంటే,
పాదాలు చేశాయి చిరు మువ్వల సవ్వడి.
పంచ భూతాల సాక్షిగా హరివిల్లు విరిసింది,
ధరిత్రిపై రంగులు మబ్బులై పైకెగిరి,
మనస్సుల్లో భావిపై ఆశలు చిగురింప బూనింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *