May 26, 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2023 సంచికకు స్వాగతం

  పాఠక మిత్రులు, రచయితలకు సాదర ఆహ్వానం.. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని దారుణాలు జరిగినా కాలం మాత్రం ఆగకుండా పోతూనే ఉంటుంది. అప్పుడే తెల్లారిందా? అప్పుడే రాత్రయిందా? అప్పుడే మొదటి తారీఖు వచ్చేసిందా అనిపిస్తోంది కదా.. పిల్లలు ఎదుగుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, విదేశాలు, పెళ్లిళ్లు, వాళ్లకు పిల్లలు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఎంత పెద్దవాళ్లమయ్యామో కదా.. ఈ వేదాంతం ఎందుకు కాని ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. మామిడి పులుపు రుచి చూస్తుండగానే తీపి మామిడిపళ్లు […]

వెంటాడే కథ – 17

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507   నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా […]

నేను కాదు మనం…

రచన: జ్యోతి వలబోజు చిత్రం: కూచి చిత్రకారుడు “నాన్నా! మీరు పేపర్సన్నీ పెట్టుకుని, టాక్సీ మాట్లాడుకుని రేపు వచ్చేస్తారా.? నన్ను రమ్మంటారా..? లేక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా?” ఫోనులో మాట్లాడుతున్నాడు కిశోర్. కొద్దిసేపు మాట్లాడి “సరే మీ ఇష్టం. జాగ్రత్తగా రండి. బయలుదేరేటప్పుడు కాల్ చేయండి” అంటూ ఫోన్ పెట్టేసాడు. పక్కనే ఉన్న అతని భార్య ప్రియ “ఏమంట? మామయ్యవాళ్లు ఎందుకొస్తున్నారు. ఏమైంది?” అని అడిగింది. “అమ్మకు, నాన్నకు రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉందిగా. అలాగే […]

లోపలి ఖాళీ – గాడ్‌ డాగ్‌

రచన: రామా చంద్రమౌళి బ్రిడ్జిపై ఆ ఇద్దరూ నడుస్తున్నారు. అతను శివుడు. అతనితోపాటు ఒక కుక్క. అతనివెంట కుక్క నడుస్తోందా. కుక్క వెంట అతను నడుస్తున్నాడా. వ్చ్‌. తెలియదు. చుట్టూ పొగమంచు. ఇక చీకటి పడ్తుందా. అంతా మసక మసక భారతీయ పంచమవేదమైన మహాభారతంలో. మహాప్రస్థానిక పర్వంలో. ఐదుగురు పాండవులు. వెంట ఆరవ వ్యక్తి ద్రౌపది. ఏడవ జీవి. ఒక కుక్క. ఈ కుక్క ఏమిటి.? ధర్మదేవత కుక్క రూపంలో యుధిష్టరుడైన ధర్మరాజును పరీక్షించుట. పరీక్షలే అన్నీ. […]

సుందరము సుమధురము – 4

రచన: నండూరి సుందరీ నాగమణి ఈ శీర్షికలో ఇటీవలే ఎంతో వైభవంగా మనం జరుపుకున్న శ్రీరామనవమి సందర్భంగా, ఈ నెల భూకైలాస్ చిత్రంలోని ఒక మంచి పాటను గురించి ముచ్చటించుకుందాం. నందమూరి తారకరామారావు గారు రావణ బ్రహ్మగా నటించిన ఈ చిత్రానికి శ్రీ కె. శంకర్ గారు దర్శకత్వం వహించగా, ఎవియం పతాకం పై, శ్రీ ఎలా మొయ్యప్పన్ గారు నిర్మించారు. చిత్రకథ, సంభాషణలు, గీతాలు సముద్రాల సీనియర్ రచించగా సంగీతాన్ని ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం […]

జీవన వేదం – 8

రచన: స్వాతీ శ్రీపాద ఇమ్మిగ్రేషన్ తంతు ముగించుకుని బెరుకు బెరుగ్గా బయటకు వచ్చేసరికి రవికిరణ్ పేరు రాసిన ప్లకార్డ్ పట్టుకుని నించున్న అతని మిత్రులు ముగ్గురినీ చూసి సులభంగానే గుర్తుపట్టి చేతులు ఊపారు. చొరవగా ముందుకు వచ్చి రండి అంటూ వారి సామాన్ల ట్రాలీలను అందుకున్నారు. ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియడం లేదు. సీత మనసు ఒకరకంగా మొద్దుబారిపోయింది. ప్రమాదం జరిగింది, రవికిరణ్ ఆసుపత్రిలో ఉన్నాడని విన్నది మొదలు ఒక్క మాటా నోటరాలేదు. ఏ ఆలోచనా తోచడమే […]

తస్మై శ్రీ గురవైనమః

రచన: విశాలి పేరి తస్మై శ్రీ గురవైనమః   गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय। बलिहारी गुरू अपने गोविन्द दियो बताय।। ‘గురువు,  భగవంతుడు ఎదురుగా నిలిస్తే నేను నమస్కరించేది మొదట గురువుకే, ఎందుకంటే ఆ భగవంతుడు ఉన్నాడని చెప్పింది నా గురువే కదా!’ అని కబీర్ దాస్ అన్నాడు.  ఈ రోజు విద్యార్థులు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఆ చదువుకు బీజం వేసి దాని మీద ఆసక్తి కలగడానికి […]

అర్చన కనిపించుటలేదు – 4

రచన: కర్లపాలెం హనుమంతరావు ‘ఇప్పుడు నాకు కావాల్సింది కాఫీలు, టీలు కాదురా రఘూ! ఒక చెడ్డ డాక్టర్. ‘ అంది అర్చన కాఫీ తాగుతూ. ‘డాక్టర్ రాంప్రసాద్ అంత చెడ్డ డాక్టర్ ఈ సిటీ మొత్తంలోనే లేడంటారు తోటి డాక్టర్లు. పేషెంట్ల దగ్గర అతను తీసుకొనే ఫీజు ఐదు, పది రూపాయలే! ‘ ‘నాకు కావాల్సింది నిజం చెడ్డ డాక్టర్. ప్లీజ్ ! నా కడుపులోని బేబీని నిర్దాక్షిణ్యంగా చంపగలిగే కిరాతక డాక్టర్ !’ రఘు అమాంతం […]

స్మార్ట్ వర్క్

రచన: కవిత బేతి “అరేయి నితిన్, ఇక్కడున్నావేంటి? అందరూ నీకోసం వెతుకుతున్నారు” ఆఫీస్ కాఫ్టేరియాలోని బాల్కనీలో నిలుచుని బయటకి చూస్తున్న నితిన్ దగ్గరగా వస్తూ అన్నాడు శశాంక్. “నీ ఫోన్ కూడా అక్కడే వదిలేసి వచ్చావ్. బాస్ మూడుసార్లు అడిగాడట. ఇదుగో నీ ఫోన్, కాల్ చేసి వస్తున్నానని చెప్పు” అని ఫోన్ అందియబోయాడు. ఒకే ఆఫీస్‌లో పనిచేసే నితిన్, శశాంక్ ఇద్దరూ, మంచి స్నేహితులు. నితిన్ కనీసం వెనకకి తిరిగి చూడకుండా నింపాదిగా జేబులోంచి సిగరెట్ […]

ఒంటరివైపోయావా??

రచన:- లావణ్య బుద్ధవరపు ఇప్పుడు కొత్తగా ఏదీ జరగలేదు. కానీ చాలా వెలితిగా ఉంది. విపరీతమైన ఒంటరితనం. ఎన్నో ఏళ్లుగా పరుగులు పరుగులు తీస్తూ, ఏదో సాధించెయ్యాలి అని అనుక్షణం తపన పడుతూ, కింద పడుతూ లేస్తూ, ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి గడిపేకా, ఎందుకో ఈ సాయంత్రం చాలా గుబులుగా, అన్నీ పోయేయేమో అనే దిగులుగా, విపరీతమైన శూన్యం ఆవహించి ఎడతెగని కన్నీటి ధారలు ఆపినా ఆగనంటూ మరింత కలవరపెడుతున్నాయి. అన్ని పనులూ అలాగే నడుస్తున్నాయి. […]