May 2, 2024

విరించినై విరచించితిని … వంటింట్లోనే కాదు మార్కెటింగ్‌లోనూ వీరు అసాధ్యులే!

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి   గృహిణిలు వ్యాపారం చెయ్యటం సాధ్యమా? సాధ్యమేనని నిరూపించారు విజయలక్ష్మి, శకుంతల, కృష్ణవేణి, నాగలక్ష్మి. గృహిణులు కూడా వ్యాపారం చేసి ఎలా విజయం సాధించగలరో తెలుసుకోటానికి వీరిని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.   ప్ర. విజయలక్ష్మిగారూ! మీరు ఈ ఒన్‌ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? జ. మొదట్లో లక్ష రూపాయల పెట్టుబడితో 2001లో బంగారు నగల వ్యాపారం ప్రారంభించాను. బంగారం రేటు పెరగటంతో 2003 నుంచి ఒన్ గ్రామ్ […]

రిమెంబర్ – రీమెంబెర్

రచన: శ్యామదాసి   రిమెంబర్ (సదాస్మరణ) రీమెంబెర్ (మళ్ళీ ప్రపంచంలోకి) అద్దoలో చూస్తేగాని మన ముఖం మనకు తెలియదు శాస్త్రాల ద్వారాగానే గురుముద్రతతో ఆత్మ దర్శనం కలుగుతుంది.  గురువు అనే దర్పణం మన స్థితిని మనకు చూపిస్తుంది,  కర్తవ్యాన్ని బోధిస్తుంది.  శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరించి నష్టోమోహ: స్మృతిర్లబ్ధా త్వత్ప్రసా దాన్మయాచ్యుతI స్థితో స్మి గతసన్దేహ: కరిష్యే వచనం తవ భగవద్గీత 18-73 “ఓఅచ్యుతా నా మోహము తొలగినది,  నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. […]

సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబం

పండుగలు ముత్యాల హారాలు సమీక్ష: కందుకూరి భాస్కర్ ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యంలో అనేక సాహితీ ప్రక్రియలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎందరో కవులు, సాహితీవేత్తలు అనేక రకాల నూతన కవితా ప్రక్రియలను రూపొందించి తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇలా వచ్చిన ప్రక్రియల్లో కొన్ని పాఠకుల ఆదరణను చూరగొంటున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కవితా ప్రక్రియల్లో నవకవుల, సాహితీ అభిమానుల ఆదరణ పొందిన వాటిలో “ముత్యాల హారం” ఒకటి. […]

కవిత్వం పరమార్ధం

రచన: అజయ్ పారుపల్లి కవిత్వం అర్థం లేని మౌన గోస కాకూడదు కవిత్వం సాగరఘోషై నినదించాలి నిద్రాణమైన జనులందరికి ….. కవిత్వం కామాంధుల పాలిట కరాళ మృత్యువై కదలాడాలి … కవిత్వం పీడిత, తాడిత ప్రజల్లో విప్లవాలను రగిలించాలి ….. కవిత్వం అసహాయుల చేతుల్లో ఆయుధమై మిగలాలి … కవిత్వం చెడును సంహరించే చండికలా చెలరేగాలి ….. కవిత్వం దానవ సమాజాన్ని మానవ సమాజంగా మార్చగలిగేదై నిలవాలి ….. కవిత్వం మంచి కి మారుపేరై మమతల కోవెలలా […]