April 27, 2024

అమ్మ ఆనందం

రచన: లక్ష్మి ఏలూరి

అమ్మా అన్న మాట అమృత సోన,
అమ్మేగా మనకు‌ తన అమృతం నింపింది,
అమ్మ లేని రోజు మన ఉనికే లేదు.
మన జన్మ కొరకు తను పునర్జన్మ ఎత్తింది.
అటువంటి అమ్మకు ఏమిచ్చి ఋణం తీర్చుకోను!!.

మన అభివృద్ధికి అమ్మేగా సోపానాలు వేసింది.
తను నిద్రాహారాలు మాని ఎంత కృషి చేసింది.
అటువంటి అమ్మకు మనం ఎలా ఋణం తీర్చగలం!
అమ్మంటే ఆలనా, పాలనా, ఆలంబన!!

అమ్మ సుఖసంతోషాలు, ఆటపాటలు మనతోనే,
మనల్ని పెంచి పెద్ద చేసిన, క్రమంలో తన తనువును,
గమనించంక, అనారోగ్యం పాలయినా,
ఆఖరి క్షణం వరకు మనం తిన్నామా అని ఆరాటపడే,
అటువంటి అమ్మకు నీరాజనాలు, నివాళులు కాదు,

ప్రేమగా”,అమ్మా!! తిన్నావా, ఎలా ఉన్నావు?”
అనే మాటతో సంతోషంతో పొంగిపోతుంది,
అంతే కానీ మనం ఇచ్చే చీనీ, చీనాంబరాలు,
అవసరం లేదు, ఆశపడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *