June 19, 2024

మాలిక పత్రిక జులై 2023 సంచికకు స్వాగతం

ప్రియ పాఠక మిత్రులు, రచయితలందరికీ  సన్నజాజులు, చిరు చినుకులతోడుగా మాలిక కొత్త సంచికకు స్వాగతం. అమెరికాలో, అన్నవరం, అయిద్రాబాదులో కూడా అందరూ ఎండల్లో మండిపోతూ,  వరుణుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కరుణ కూడా తక్కువగానే ఉంది ఇప్పటివరకు.  పూర్తి వానాకాలపు జోరువానలు వస్తాయని ఆశిద్దాం. సన్నజాజులు కూడా తోడున్నాయి కదా.. పాఠకులను అలరించడానికి  మాలిక పత్రిక  ఎప్పటికప్పుడు విభిన్నమైన అంశాలను ప్రవేశపెడుతోంది. ఈ మాసం నుండి సంగీతమాలిక రాగమాలికలు ప్రారంభమవుతోంది. కథలు, కవితలు, సీరియళ్లు, వ్యాసాలు, […]

అమ్మమ్మ – 48

రచన: గిరిజ పీసపాటి వెంటనే గిరిజ కాలిక్యులేటర్ ముందేసుకుని లెక్క చూసి ఐదు వందలు జీతం, రెండు రోజులు సెలవు పెట్టనందుకు అదనంగా ముఫ్ఫై మూడు రూపాయలు ఇచ్చినట్టున్నారమ్మా!” అంది. “నీకెమన్నా మెంటలా? జాయిన్ అయి రెండు నెలలు కూడా కాలేదు! అప్పుడే జీతం పెంచుతారా ఎవరైనా?” అని వసంత అడగడంతో ఆరోజు షాప్ లో జరిగినదంతా చెప్పింది. అంతా విన్న నాగ “ఆయనకు నీ వర్క్ నచ్చి జీతం పెంచితే సంతోషించాల్సిన విషయమే. కానీ మన […]

ప్రాయశ్చితం – 2

రచన: గిరిజారాణి కలవల గెలుపు… గెలుపు…. గెలవాలి… తానే గెలవాలి. మరెవరూ గెలవకూడదు. అది ఆట అయినా, చదువు అయినా ఏదైనా సరే తనే మొదటి స్థానంలో వుండాలనుకునేవాడు సురేంద్ర. ఒకసారి స్కూల్లో పరుగుపందెంలో, తన క్లాస్ మేట్ రాజేష్ తనని దాటి ముందుకు వెళ్ళి మొదటి బహుమతి పొందడం, సురేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ఇంటికి వచ్చాక అన్నం కూడా తినకుండా ఏడుస్తూ కూర్చున్నాడు. సంగతి తెలిసిన తండ్రి, సురేంద్రని దగ్గరకు తీసుకుని, “ఇంతదానికి నువ్వు ఏడిస్తే ఎలా? […]

ఊయల వంతెన

రచన: బి.భవానీ కుమారి సమయం ఒంటిగంట దాటుతుండగా, పొలం నుంచి వచ్చిన రాఘవ భోజనానికి కూర్చున్నాడు. జానకి ఇద్దరికీ కంచాలు పెట్టి, వడ్డించటానికి సిద్దమౌతుండగా , బెడ్ రూమ్ కిటికీ అద్దాలు భళ్ళున పగిలిన శబ్దం వచ్చింది. ఆ వెనువెంటనే, వరండాలో వరుసగా రాళ్లు పడుతున్న శబ్దం విని ఇద్దరూ గబాగబా వరండాలోకి వచ్చారు. “నువ్వు బయటకు రాకు” అంటూ ముందుకెళ్ళి చుట్టూ చూసాడు. మరొక గులకరాయి వచ్చి పడింది , ఆశ్చర్యపోతూ ఈసారి తమ్ముడు, తన […]

పరవశానికి పాత(ర) కథలు – కొన్ని కన్నీళ్లు కొందరికే వస్తాయి

రచన: డా. వివేకానందమూర్తి “ఇందులో దుక్కరసం బాగా ఎగస్ట్రాగా వుండేలా గుందే!” అని తల పక్కకి తిప్పేశాడు నా ఫ్రెండు మహాదేవరావు – ఈ కథ శీర్షిక చూసి. అతనికి వొత్తులు పలకవు. అతనికున్న వొత్తు ఒక్కటీ అతని జుట్టు మాత్రమే. హెయిర్ కట్ చేయించుకున్నాక కూడ అతని జుత్తు, జులపాల్లా వేలాడుతుంది. “క్షవరం చేయించుకున్నాక కూడా అంత జుట్టేవిటయ్యా?” అని అడిగితే సమాధానంగా, “కటింగ్- చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ!” అంటాడు మహదేవరావు. మరేం చెయ్యను? ఇక్కడ […]

ఈశ్వర సేవ

కథ: G.S.S. కళ్యాణి. ఆదివారం మధ్యాహ్నం, సమయం మూడు గంటలయ్యింది. సముద్రం పైనుండి వీస్తున్న చల్లటి గాలి ఎండ వేడిమినుండి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉండటంతో పిల్లలూ, పెద్దలూ అందరూ సముద్ర తీరంలో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలోంచి ఎనభయ్యేళ్ళ ప్రకాశరావు మెల్లిగా కిందకు దిగి, తన జేబులోంచి ఒక వంద రూపాయల నోటును తీసి ఆ ఆటో డ్రైవర్ చేతిలో పెట్టి, సముద్రం వైపుకు తిరిగాడు. “అయ్యా!”, […]

తులసి

రచన: శ్యామదాసి జీవితం ఒక పాఠశాల అయితే, ప్రతి క్షణం కొత్త పాఠాన్ని నేర్వవలసిన జీవుల జీవననాటకాల్ని కాలం కలంగా మారి చిత్ర విచిత్రంగా రచిస్తుంది. అటువంటి ఒక సాగిపోతున్న రచనే ప్రస్తుత ఈ తులసి. పాతికేళ్ళ క్రితం మా అమ్మాయి పెండ్లిలో, పెండ్లి కొడుకు పెద్దమ్మ కోడలని, దగ్గర బంధువుగా పరిచయ మయింది తులసి. అప్పటికే తనకు ఐదారేళ్ళ పాప. అత్తగారిది టౌనుకు దగ్గరలో ఒక పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. పల్లెటూరి అమాయకత్వంతో కూడి నునుపైన […]

లోపలి ఖాళీ – భూమిపుండు

రచన: రామా చంద్రమౌళి సింగిల్‌ పేరెంట్‌ సునంద. గత ఇరవై రెండేళ్ళుగా హైస్కూల్‌ పిల్లలకు ‘ చరిత్ర ’ ను బోధిస్తూ విద్యార్థులందరిలోనూ. సహ ఉపాధ్యాయు లందరిలోనూ ఉత్తమ అధ్యాపకురాలిగా పేరు తెచ్చుకుని గత సంవత్సరమే ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా కూడా స్వర్ణ పతకాన్నీ, ప్రశంసా పత్రాన్నీ పొందిన సునంద. గత అరగంట నుండి ఆ చెట్టుకింద కూర్చుని తదేకంగా ఆ భూమిపుండు దిక్కు చూస్తూనే ఉంది. అప్పుడామె హృదయం కూడా సరిగ్గా […]

తనివి తీరింది

రచన: యశస్వి జవ్వాది డాక్టర్ విశ్వం మనసు అలజడిగా ఉంది. తన మనసు లోతుల్లో తాను బ్రతుకుతున్న వ్యవస్థను మోసం చేస్తున్నాననే భావన వలన చాలా భారంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే అతని మొహం మీద ఒత్తిడి ఛాయలు పేరుకున్నాయి. ఎవరి మొహం చూడకుండా నేరుగా తన క్యాబిన్ వైపు వేగంగా వెళ్ళాడు. టేబుల్ మీదనున్న పేషెంట్ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చూసాడు. ఈలోగా, “అయ్యా!! లోపలకు రావచ్చా?” అంటూ సగం తెరచిన […]

బాలమాలిక – ‘నెపాలెందుకు?’

రచన: విశాలి పేరి సుధన్వ స్కూల్ నుంచి వచ్చి స్కూల్ బాగ్ విసిరేసి రాఘవయ్యగారి గదిలోకి వెళ్ళి “తాతయ్యా! నాకు రన్నింగ్ లో సెకండ్ వచ్చింది” అని చెప్పాడు. “కంగ్రాట్స్ నాన్నా!” అన్నాడు రాఘవయ్య. “నాకు పార్టీ కావాలి మరి!” అడిగాడు సుధన్వ. “ఓ తప్పకుండా, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రా” సుధన్వ వంటింట్లోకి వెళ్ళి తల్లి, నాన్నమ్మ కి తను ఎలా గెలిచింది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు. “అమ్మా ఎంత స్పీడ్ గా […]