April 27, 2024

శ్లోకం – పాట

రచన: మంగు కృష్ణకుమారి

మన పద్యాలూ, సుప్రభాతాలూ, దండకాలూ దేన్నిచూస్తే అవే గొప్పవి.
మన సినీపాటల రచయితల ప్రతిభని వేనోళ్ల కొనియాడినా, తక్కువే అనిపిస్తుంది.
పెద్దలకి పాటంటే ఎంత భక్తి పారవశ్యమో! శ్రీ వెంకటేశ్వర‌ సుప్రభాతం తెలీని వాళ్లు లేనేలేరని చెప్పగలం. శ్రీమతి ఎమ్.ఎస్ సుబ్బలక్షిగారి గంధర్వగానంతో, ఇంటింటా ఆమె సుప్రభాతం తోనే తెల్లవారుతుంది.
సముద్రాల రాఘవాచార్యుల వారు గృహలక్ష్మి సినిమా‌కోసం రాసిన ఈ పాట శ్రీమతి భానుమతి పాడేరు.
కవిగారు ఇందులో స్వామి వారి సుప్రభాతపు సొగసులు ఎలా కలిపి అందించేరో చూడండి :
” యోషా గణేన వరదధ్ని విమథ్య మానే ఘోషాలయేషు దధి మంథన తీవ్ర ఘోషాః”
ఇంకో శ్లోకంలో ఒక సగం: “భృంగావళీ చ మకరంద రసానువిద్ద ఝుంకార గీత నినదైస్సహ సేవనాయ”
కవిగారు స్వామివారి రెండు శ్లోకాల్లో సగం సగం కలిపి కమ్మగా ఇలా పాటగా మలచేరు.
చల్లచిలికే భామలా కంకణాల మ్రోతలవిగో, ఝమ్మని, నిను లెమ్మని పిలిచేను తేటి తీయగా! మేలుకో శ్రీ రంగ, కావేటి‌రంగ మేలుకోవయ్యా”
ఈ కమ్మదనం ఆస్వాదిస్తే వచ్చే ఆనందం సామాన్యం కాదు
‘మేలుకో శ్రీరంగ కావేటి రంగ, శ్రీరంగ మేలుకోవయ్యా!’

ఈ పాట యూట్యూబ్ లో లభ్యం.

***

1 thought on “శ్లోకం – పాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *